`మదరాసి` మూవీ రివ్యూ, రేటింగ్‌.. శివకార్తికేయన్‌కి మరో బ్లాక్‌ బస్టర్‌ పడిందా?

Published : Sep 05, 2025, 06:10 PM IST

`అమరన్‌` వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత హీరో శివ కార్తికేయన్‌ ఇప్పుడు `మదరాసి` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

PREV
16
`మదరాసి` మూవీ రివ్యూ

తమిళ హీరో శివకార్తికేయ `అమరన్‌` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. ఈ మూవీ ఆయన కెరీర్‌నే మలుపుతిప్పింది. తిరుగులేని స్టార్‌ ని చేసింది. ఇప్పుడు `మదరాసి` మూవీతో వచ్చాడు శివకార్తికేయ. ఈ చిత్రానికి ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించారు. ఇటీవల కాలంలో వరుసగా పరాజయాల్లో ఉన్న ఆయన ఈ మూవీతో హిట్‌ కొట్టాలనే కసితో ఉన్నారు. శ్రీ లక్ష్మీ మూవీస్‌ పతాకంపై ఎన్‌ శ్రీ లక్ష్మీప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటించింది. నేడు శుక్రవారం(సెప్టెంబర్‌ 5న) సినిమా విడుదలైంది. ఈ మూవీని తెలుగులోనూ అదే పేరుతో డబ్‌ చేశారు. ప్రసాద్‌ ఐమాక్స్ లో సినిమా తిలకించాను. మరి మూవీ ఎలా ఉంది? శివ కార్తికేయన్‌కి మరో బ్లాక్‌ బస్టర్‌ పడిందా? దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ ఈ మూవీతో అయినా హిట్‌ కొట్టాడా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
`మదరాసి` మూవీ కథః

రఘు(శివ కార్తికేయన్‌) ఒక మానసికమైన వ్యాధి(డెల్యూషనల్ సిండ్రోమ్‌)తో బాధపడుతుంటాడు. ప్రమాదంలో ఎవరు ఉన్నా, వాళ్లు తన సొంత మనుషులే అని భావించి సహాయం చేస్తుంటాడు. అదే సమయంలో తన వాళ్లకి ఏమైనా ఊరుకోరు. ఈ క్రమంలోనే ఆయనకు మాలతి(రుక్మిణి వసంత్‌)పరిచయం అవుతుంది. ఇద్దరు ప్రేమలో పడతారు. ఓ సంఘటన కారణంగా వీరి లవ్‌ బ్రేకప్‌ అవుతుంది. దీంతో సూసైడ్‌ చేసుకోవాలనుకుంటాడు రఘు. అదే సమయంలో తమిళనాడు స్టేట్‌లోకి ఆరు కంటైనర్లలో గన్స్ వస్తుంటాయి. అవి కస్టమర్లకి చేరితే తమిళనాడులో గన్‌ కల్చర్‌ విస్తరిస్తుంది. ఇది రాష్ట్రానికే ప్రమాదకరం. ఈ విషయం తెలిసిన ఎన్‌ఐఏ అధికారులు రంగంలోకి దిగుతారు. రఘు, ఎన్‌ఐఏ అధికారి(బీజు మీనన్‌) అంబులెన్స్ లో కలుసుకుంటారు. రఘు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న విషయం తెలిసిన ఎన్‌ఐఏ అధికారి తన ఆపరేషన్‌కి రఘుని వాడుకోవాలనుకుంటాడు. మరి ఈ మిషన్‌లోకి రఘుని ఎలా తీసుకొచ్చారు? అతి పెద్ద సమస్యని ఎలా సాల్వ్ చేశారు?. గన్‌ డీలర్స్ విరాట్‌(విద్యుత్ జమాల్‌), చిరాగ్‌(షబీర్‌)లను ఎలా పట్టుకున్నారు? రఘు లవ్‌ స్టోరీ, ఈ ఆపరేషన్‌కి ఎలా హెల్ప్ అయ్యింది? రఘు ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? చివరికి కలిశారా? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ.

36
`మదరాసి` మూవీ విశ్లేషణ

శివ కార్తికేయన్‌ చివరగా `అమరన్‌` చిత్రంతో ఆకట్టుకున్నారు. ఈ మూవీ పెద్ద విజయం సాధించింది. దీంతో శివ కార్తికేయన్‌ నుంచి వచ్చే సినిమాలప భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలతోనే ఇప్పుడు `మదరాసి` మూవీ వచ్చింది. కానీ ఆ అంచనాలు అందుకోవడంలో సక్సెస్‌ కాలేకపోయింది. దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ సక్సెస్‌ఫుల్‌ మూవీని అందించడంలో సక్సెస్‌ కాలేకపోయారు. ఎన్‌ఐఏ, రా, ఏజెంట్‌, స్పై నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఇటీవల `వార్‌ 2` కూడా అలాంటి జోనర్‌ మూవీనే. కాకపోతే ఈ మూవీలో దానికి లవ్‌ స్టోరీని యాడ్‌ చేశారు. ఈ స్పై, ఎన్‌ఐఏకి సంబంధం లేని ఒక కుర్రాడిని ఈ మిషన్‌లో భాగం చేయడం, దానికి అతని లవ్‌ స్టోరీ కారణం కావడం ఇందులో కొత్త పాయింట్‌. అది తప్పితే సినిమా సాగిన తీరు మొత్తం రెగ్యూలర్‌ కమర్షియల్‌ సినిమాలను తలపిస్తుంది. ఏమాత్రం కొత్తదనం కనిపించలేదు. తన లవర్‌ బ్రేకప్‌ చెప్పిందని హీరో సూసైడ్‌ చేసుకోవాలనుకోవడం, అది ఎన్‌ఐఏ అధికారులకు ఉపయోగపడటం ఇందులో ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌. తన లవర్‌ని ఎలా తిరిగి పొందాడు? ఈ క్రమంలో ఎన్‌ఐఏ మిషన్‌ని ఎలా కంప్లీట్‌ చేశాడనేది ఈ మూవీ కథ. ఈ ఎలిమెంట్లు కొత్తగా ఉన్నా, సినిమా సాగిన తీరు మొత్తం రొటీన్‌గానే ఉంటుంది.

46
`మదరాసి` మూవీలో హైలైట్స్, మైనస్‌లు

ఈ మూవీ ప్రారంభం నుంచి ఎండింగ్‌ వరకు చాలా స్లోగా సాగుతుంది. ప్రారంభంలో లవ్‌ ట్రాక్‌ కాస్త ఆకట్టుకునేలా ఉంటుంది. ఎన్‌ఐఎ ఎపిసోడ్‌ స్టార్ట్ అయినప్పట్నుంచి మూవీ మరో ట్రాక్‌ తీసుకున్నట్టుగా ఉంటుంది. సంబంధం లేని సంఘటనల్లో హీరోని ఇన్‌వాల్వ్ చేయడం, వారి ప్రేమని ఇన్‌ వాల్వ్ చేయడం ఏమాత్రం కనెక్టింగ్‌గా లేదు. చాలా అసహజంగా అనిపించింది. పైగా ఆ ఎన్‌ఐఏ ఆపరేషన్‌ కూడా చాలా స్లోగా సాగుతుంది. దీంతో ఆడియెన్స్ కి నీరసం వచ్చేలా ఉంటుంది. ఫస్టాఫ్‌ సోసోగా సాగిందంటే సెకండాఫ్‌ మరింత స్లోగా, బోరింగ్‌గా సాగుతుంది. ఎన్‌ఐఏ ఆఫీస్‌పై విలన్ల దాడి కాస్త ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఆ యాక్షన్‌ సీన్లు ఫర్వాలేదనిపిస్తాయి. కానీ ఇలాంటి యాక్షన్‌ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూశాం. మరోవైపు లవ్‌ స్టోరీలోనూ ఎమోషన్ పండలేదు. ఏదో సన్నివేశాలు వస్తూ పోతూ ఉంటాయి. ఎక్కడా ఆడియెన్స్ కనెక్ట్ కాలేని పరిస్థితి. ఇలాంటి కథలు, ఇలాంటి జోనర్‌ ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితమే చూసేశారు ఆడియెన్స్. ఇప్పటికీ అలాంటి సినిమాలే వస్తున్నాయి. ఇది కూడా ఆ కోవలో వచ్చిన మూవీనే. అయితే శివ కార్తికేయన్‌ కి ఉన్న వ్యాధి, ఆయన రియాక్షన్‌ కొన్ని చోట్ల వాహ్‌ అనిపిస్తుంది. క్రేజీగా ఉంటుంది. అదే ఇందులో కాస్త రిలీఫ్‌నిచ్చే అంశంగా చెప్పొచ్చు.

56
`మదరాసి` మూవీలోని నటీనటుల ప్రదర్శన

రఘు పాత్రలో శివ కార్తికేయన్‌ చాలా బాగా నటించాడు. సినిమాకి ఏదైనా ప్లస్‌ ఉందంటే అది శివ కార్తికేయన్‌ అనే చెప్పాలి. ఆయన యాక్షన్‌ సీన్లు, లవ్‌ సీన్లలో చాలా బాగా నటించాడు. ఆద్యంతం మెప్పించాడు. ఇక రుక్మిణి వసంత్‌ నటన కూడా బాగుంది. ఉన్నంతలో బాగానే చేసింది. ఎన్‌ఐఏ అధికారిగా బీజు మీనన్‌ ఆకట్టుకున్నాడు. మరోవైపు విలన్లు విద్యుత్‌ జమాల్‌, షబీర్‌లు తమదైన పాత్రల్లో ఒదిగిపోయారు. రెగ్యూలర్‌ విలన్లుగానే మెప్పించారు. మిగిలిన పాత్రలు జస్ట్ ఓకే.

66
మదరాసి మూవీ టెక్నీషియన్ల పనితీరుః

ఈ సినిమాకి అనిరుథ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు. కానీ ఎక్కడా ఆయన మార్క్ మ్యూజిక్‌ కనిపించలేదు. బీజీఎంలోనూ అది వర్కౌట్ కాలేదు. సినిమాకి ఆయన సంగీతం ఏమాత్రం ప్లస్‌ కాలేదు. కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇంకోవైపు ఎడిటింగ్‌ పరంగా కొంత ట్రిమ్‌ చేయాల్సింది. ల్యాగ్‌ సీన్లని, చాలా వరకు కట్‌ చేయడానికి స్కోప్‌ ఉంది. ఇక నిర్మాణ విలువలకు కొదవలేదు. అయితే దర్శకుడు మురుగదాస్‌ కొత్త సీసాలో పాత సారా అన్నట్టుగా ఈ మూవీని తెరకెక్కించారు. ఆయన టేకింగ్‌, డైలాగ్స్, స్క్రీన్‌ ప్లేని నడిపించిన తీరు చాలా రొటీన్‌గా ఉంది. ఏమాత్రం కొత్తదనం చూపించలేకపోయారు. ఆకట్టుకునేలా తెరకెక్కించలేకపోయారు.

ఫైనల్‌గాః రొటీన్‌, బోరింగ్‌ మూవీ.

రేటింగ్‌ః 2

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories