Happy Raj Review: హ్యాపీ రాజ్‌ మూవీ రివ్యూ.. జీవీ ప్రకాష్‌, అబ్బాస్‌, జార్జ్ మరియన్‌ నటించిన సినిమా ఎలా ఉందంటే?

Published : Mar 27, 2026, 10:36 AM IST

మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాష్‌ మ్యూజిక్‌ చేస్తూనే హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఆయన `హ్యాపీ రాజ్‌` చిత్రంలో నటించాడు. అబ్బాస్‌ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం ఎలా ఉందంటే? 

PREV
16
హ్యాపీ రాజ్‌ మూవీ రివ్యూ

జీవీ ప్రకాష్‌, గౌరీ ప్రియా జంటగా, జార్జ్ మరియన్‌, అబ్బాస్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `హ్యాపీ రాజ్‌`. మరియా రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళంలో రూపొందింది. తెలుగులో దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్‌ చేస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా నేడు శుక్రవారం(మార్చి 27న) రిలీజ్‌ అయ్యింది. మరి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా, హీరోగా రాణిస్తోన్న జీవీ ప్రకాష్‌ ఈ చిత్రంతో హీరోగా సక్సెస్‌ అందుకున్నాడా? సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

26
హ్యాపీ రాజ్‌ మూవీ కథ

హ్యాపీ రాజ్‌(జీవీ ప్రకాష్‌)ది సుందరపల్లి అనే పల్లెటూరు. నాన్న(జార్జ్ మరియన్‌) స్కూల్‌ టీచర్‌. అయితే ఆయన చూడ్డానికి చిన్నగా ఉండటంతో అందరు ఆయన్ని గుర్రం గుడ్డు అంటూ ఎగతాళి చేస్తుంటారు. తనని ఎన్నిరకాలుగా అవమానించినా, అవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతాడు. తన కొడుకు తనలాగా కాకుండా అందంగా రావడంతో మురిసిపోతుంటాడు. తండ్రిని అందరు అలా పిలుస్తూ, తనని ఎగతాళి చేస్తుండటంతో హ్యాపీరాజ్‌ ఇబ్బంది పడుతుంటాడు. తండ్రి నీడ నుంచి దూరంగా ఉండాలనుకుంటాడు. తాను ప్రేమించిన అమ్మాయి కూడా తండ్రిని చూసే రిజెక్ట్ చేస్తుంది. దీంతో ఇలా కూడా తానంటే ఎవరికీ తెలియని ప్రాంతానికి వెళ్లిపోవాలనుకుంటాడు. దీంతో బెంగుళూరులో ఐటీ జాబ్‌ దక్కించుకుంటాడు. అక్కడికి వెళ్లాక తన కంపెనీలో టీమ్‌ మేనేజర్ కావ్య( శ్రీ గౌరీ ప్రియ)ని చూసి ఫిదా అవుతాడు. హ్యాపీలోని టాలెంట్‌ని చూసి ఆమె అతన్ని ఎంకరేజ్‌ చేస్తుంది. ఆయన్ని మొత్తం మార్చేస్తుంది. దీంతో ఇద్దరు ప్రేమలో పడతారు. హ్యాపీ రాజ్‌లోని టాలెంట్‌ని చూసి వాళ్ల నాన్న(అబ్బాస్‌) కూడా తనకి అల్లుడిగా చేసుకోవాలనుకుంటాడు. కానీ తన పేరెంట్స్ ని చూస్తే వాళ్లు తనని రిజెక్ట్ చేస్తారని భయపడతాడు హ్యాపీ. ఫోటో చూపించగా, వాళ్లు ఓకే చెబుతారు. కావ్య వాళ్ల పేరెంట్స్ మ్యారేజ్‌ యానివర్సరీ రోజు పార్టీలో ఈ పెళ్లి ప్రకటన చేస్తారు. దానికి హ్యాపీ రాజ్‌ పేరెంట్స్ ని ఆహ్వానిస్తారు. కానీ పెళ్లి చూపుల కోసమని తన బంధువులందరితో బెంగుళూరుకి వస్తాడు హ్యాపీ నాన్న. అక్కడ పెంట పెంట చేస్తారు. వారిని అవమానిస్తారు. దీంతో తానేంటో చూపిస్తాడు హ్యాపీ నాన్న. ఇంతకి గుర్రం గుడ్డు బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటి? తమకు జరిగిన అవమానికి ఎలా ప్రతీకారం తీర్చుకున్నారు? తన పేరు, పరువు పోగొట్టినందుకు కావ్య వాళ్ల నాన్న ఏం చేశాడు? ఇంతకి కావ్య, హ్యాపీ కలిశారా? విడిపోయారా? క్లైమాక్స్ లో ఉన్న ట్విస్టేంటి? అనేది మిగిలిన కథ.

36
హ్యాపీ రాజ్‌ మూవీ ఎలా ఉందంటే?

తండ్రీ కొడుకుల మధ్య సాగే ఫ్యామిలీ ఎమోషనల్‌ డ్రామా `హ్యాపీ రాజ్‌`. మోడ్రన్‌ కల్చర్‌లో పల్లెటూరు వాళ్లని తక్కువగా చూస్తున్న ఈ రోజుల్లో వారి గొప్పతనాన్ని, తండ్రి గొప్పతనాన్ని, అవమానాలు దాటుకొని తండ్రి ఎదిగిన తీరు, ఆస్తులు కాదు, మానవసంబంధాలు, ఒకరికి సహాయం చేసే గుణానికి సంబంధించిన అంశాలను ఆవిష్కరించిన చిత్రమిది. అయితే ఇటీవల సినిమాలు ఒక పాయింట్‌ని పట్టుకుని దానిచుట్టూ కథని అల్లుకోవడమే ఎక్కువగా జరుగుతుంది. క్లైమాక్స్ కోసం సినిమా మొత్తం చూడాల్సిన పరిస్థితి చాలా సినిమాల్లో ఉంటుంది. ఇప్పుడు `హ్యాపీ రాజ్‌` విషయంలో అదే జరిగింది. ఈ మూవీ ప్రారంభం నుంచి రొటీన్‌ రొడ్డకొట్టుడు సినిమాలా సాగుతుంది. అంతా గందరగోళంగా సాగుతూ, చివర్లో హార్ట్ టచింగ్‌గా చూపించారు. అయితే క్లైమాక్స్ కోసం రెండు గంటల సినిమాని భరించాలా అన్నట్టుగా ఈ సినిమాని తెరకెక్కించారు. సినిమాగా చూసిప్పుడు హీరో ఫస్ట్ సీన్‌లోనే లవ్‌ ఫెయిల్యూర్‌ కావడం, అందుకు తన తండ్రినే కారణం కావడం, తండ్రి నేపథ్యాన్ని ఆవిష్కరించడానికి టైమ్‌ తీసుకున్నారు. తండ్రిని ఎందుకు గుర్రం గుడ్డు అంటున్నారనేది చూపించారు. అయితే దాన్ని ఫన్నీగా చూపించినా, ఆ ఫన్‌ వర్కౌట్‌ కాలేదు. హీరో ఇబ్బంది పడే సీన్లు కూడా నవ్వులు పూయించలేకపోయాయి. తండ్రి వల్ల హీరో ఇబ్బంది పడేసీన్లు, పేరెంట్స్ కారణంగా తనకు అమ్మాయిలు పడకపోవడం, దీని వల్ల ఆయన బెంగుళూరు వెళ్లడం, అక్కడ హీరోయిన్‌ని చూడగానే పడిపోవడం, ఆమె కూడా ఇతని టాలెంట్‌ చూసి పడటం, ఇద్దరు పెళ్ళి చేసుకోవాలనుకోవడ ఫాస్ట్ గా జరిగిపోతుంది. పెళ్లి అనౌన్స్ మెంట్‌ సందర్భంగా వచ్చే సీన్లు అటు అబ్బాస్‌కి చిరాకు పెట్టించినట్టుగానే, ఆడియెన్స్ కి కూడా చిరాకు తెప్పిస్తాయి. ఫన్‌ కోసం క్రియేట్‌ చేసిన బీజీఎం మరింత ఇరిటేషన్‌ తెప్పిస్తుంది. ఫస్టాఫ్‌లో బిజీఎం పెద్ద మైనస్‌. ఫన్‌ కోసం అలా చేయగా, అది బెడిసికొట్టి రివర్స్ అయ్యింది. సెకండాఫ్‌లో సారీ చెప్పించడం చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో డ్రామా ఓవర్‌గా ఉంటుంది. అందులోనూ కామెడీ వర్కౌట్‌ కాలేదు. కాకపోతే క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంటుంది. హీరో తండ్రి గొప్పతనం చెప్పే సీన్లు, ఈ క్రమంలో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటాయి. గుండెని బరువెక్కిస్తాయి. సినిమాకి జీవీ ప్రకాష్‌, అబ్బాస్‌ కాదు, జార్జ్ మరియన్‌ హీరో అనేలా క్లైమాక్స్ సీన్లు ఉన్నాయి. సినిమాలో మెయిన్‌ హైలైట్‌ పాయింట్‌ ఇదొక్కటే అని చెప్పొచ్చు.

46
హ్యాపీ రాజ్‌ మూవీలో ఆర్టిస్టులు ఎలా చేశారంటే?

హ్యాపీ రాజ్‌గా జీవీ ప్రకాష్‌ చాలా బాగా నటించాడు. ఫన్‌ ఫ్రస్టేషన్‌తో మెప్పించింది. నటుడిగా తనకు మంచి మార్కులు పడతాయి. ఇక గుర్రం గుడ్డుగా జార్జ్ మారియన్‌ నటన సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. ఆయనే సినిమాకి హీరో అని చెప్పొచ్చు. తన పాత్రలో ఇరగదీశాడు. ఇక అబ్బాస్‌ చాలా రోజుల తర్వాత వెండితెరపై కనిపించారు. ఆయన పాత్ర బాగుంది. ఆయనకు మంచి కమ్‌ బ్యాక్‌ అని చెప్పొచ్చు. కావ్యగా శ్రీ గౌరీ ప్రియా ఉన్నంతలో బాగా చేసింది. హీరో తల్లిగా నటించిన గీతా కైలాసం నటన మెప్పిస్తుంది. నవ్విస్తుంది. మిగిలిన నటీనటులు ఓకే అనిపించారు.

56
హ్యాపీ రాజ్‌ మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

జస్టిన్‌ ప్రభాకరన్‌ మ్యూజిక్‌ సినిమాకి పెద్ద మైనస్‌. సౌండింగ్‌ విషయంలో చాలా వరకు చిరాకు తెప్పిస్తుంది. కాకపోతే క్లైమాక్స్ లో ఎమోషనల్‌ సీన్లు ఆకట్టుకుంది. మధన్‌ క్రిస్టోఫర్‌ విజువల్స్ ఆకట్టుకున్నాయి. సెల్వ ఆర్కే ఎడిటింగ్‌ ఇంకా బాగా చేయాల్సింది. నిర్మాణ విలువలకు కొదవలేదు. దర్శకుడు మరియా రాజా ఎంచుకున్న కథ బాగుంది. దాన్ని తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. సినిమా మొత్తం బాగా లేకపోవడంతో క్లైమాక్స్ హైలైట్ అయ్యింది. ఆకట్టుకుంది.

66
ప్లస్‌ మైనస్‌లు, రేటింగ్‌

ప్లస్‌లు: సినిమాకి జీవీ ప్రకాష్‌, జార్జ్ మరియన్‌, అబ్బాస్‌, శ్రీ గౌరీ ప్రియా, విజువల్స్, క్లైమాక్స్ ఎమోషనల్‌ సీన్లు.

మైనస్‌లు: మిగిలిన అన్నీ మైనస్‌ లే. కథనం, పాటలు, బీజీఎం, కామెడీ, సాగదీత, ఫస్టాఫ్‌, సెకండాఫ్‌, ఎడిటింగ్‌.

ఫైనల్‌గా:

తండ్రి గొప్పతనాన్ని, పల్లెటూరి వాళ్లల్లో ఉండే బ్యూటీని, తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్ బాండింగ్‌ని ఆవిష్కరించే మూవీ ఇది. రెండు గంటల సినిమాని భరిస్తే, క్లైమాక్స్ సర్‌ప్రైజ్‌ చేస్తుంది.

రేటింగ్‌ : 2.5

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories