Akkineni Amala: అమల అక్కినేని తన కోడళ్లైన శోభిత ధూళిపాల, జైనబ్ తో ఉన్న అనుబంధం గురించి తాజాగా వెల్లడించారు. తాను డిమాండ్ చేసే అత్తగారిని కాదు అంటూ అమల పేర్కొంది.
అమల అక్కినేని ప్రస్తుతం సినిమాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మూడేళ్ళ క్రితం ఆమె తెలుగులో ఒకే ఒక జీవితం అనే చిత్రంలో మెరిశారు. ఆ తర్వాత మరో చిత్రానికి సైన్ చేయలేదు. నాగ చైతన్య, అఖిల్ అక్కినేని ఇద్దరూ వరుసగా వివాహం చేసుకున్న తర్వాత, అమల ఇప్పుడు తన కోడళ్లైన శోభిత ధూళిపాల, జైనబ్ లతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు.
25
నా కోడళ్ళు అద్భుతం
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమల అక్కినేని మాట్లాడుతూ – “నాకు అద్భుతమైన కోడళ్లు ఉన్నాయి. వాళ్లు చక్కని వ్యక్తిత్వం కలవారు. వాళ్ల వల్ల నాకు జీవితం కొత్తగా అనిపిస్తోంది. మా ఇంట్లో నాకు ఇప్పుడు ‘గర్ల్స్ సర్కిల్’ ఉంది అంటూ సరదాగా కామెంట్స్ చేశారు.
35
నేను డిమాండ్ చేసే అత్తని కాదు
అమల మాట్లాడుతూ నా కోడళ్ళు ఇద్దరూ చాలా బిజీగా ఉంటారు. కానీ అది మంచిదే. యువతకు ఉత్సాహభరితమైన జీవితం ఉండటం చాలా అవసరం. వాళ్లు బిజీగా ఉన్నప్పుడు నేనూ నా పనుల్లోనే మునిగిపోతాను. అయితే సమయం దొరికినప్పుడు మేమంతా కలిసి చాలా ఆనందంగా గడుపుతాం. నేను డిమాండ్ చేసే అత్తగారిని కాదు. అలాగే నేను డిమాండ్ చేసే భార్యని కూడా కాదు,” అని చిరునవ్వుతో చెప్పింది.
నాగ చైతన్య, అఖిల్ అక్కినేని గురించి అమల మాట్లాడుతూ..“వాళ్లు అద్భుతమైన యువకులుగా ఎదిగారు. వాళ్లకు నాగార్జున గారంటే చాలా గౌరవం ఉంది. ఆయన వారిపై చాలా ప్రేమ చూపిస్తారు. నేను కూడా నా బాధ్యతల పట్ల కచ్చితంగా ఉంటాను. నా పిల్లల విషయంలో ఏదీ కూడా నిర్లక్ష్యం చేయను,” అని అమల పేర్కొంది.నాగార్జున 1984లో లక్ష్మీ దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు. అయితే 1990లో వారిద్దరూ విడిపోయారు కానీ తమ కుమారుడు నాగ చైతన్యను ఇద్దరూ కలిసి పెంచారు. ఆ తర్వాత 1992లో నాగార్జున, నటి అమల అక్కినేని ని వివాహం చేసుకున్నారు. వారికి అఖిల్ అక్కినేని అనే కుమారుడు ఉన్నాడు.
55
నాగ చైతన్య, అఖిల్ ఇద్దరి పెళ్లిళ్లు పూర్తి
నటుడు నాగ చైతన్య 2024లో నటి శోభిత ధూళిపాలను వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఆ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. 2025లో అఖిల్ అక్కినేని, ముంబైకి చెందిన ఆర్టిస్ట్, ఎంట్రప్రెన్యూర్ అయిన జైనబ్ ని వివాహం చేసుకున్నారు. జైనబ్ వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన అమ్మాయి.