చిరంజీవి గ్యాంగ్ లీడర్ స్పీడుకి బ్రేకులు వేశా.. పవిత్ర లోకేష్ ముందు తన గొప్పలు చెప్పుకున్న నరేష్

Published : Oct 17, 2025, 02:27 PM IST

Actor Naresh : చిరంజీవి గ్యాంగ్ లీడర్ మూవీపై నటుడు నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవిత్ర లోకేష్ ముందు ఆయన చెప్పుకున్న గొప్పలు వైరల్ అవుతున్నాయి. ఆయన ఏమన్నారో ఈ కథనంలో తెలుసుకోండి.  

PREV
15
చిరంజీవి గ్యాంగ్ లీడర్ మూవీ 

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో గ్యాంగ్ లీడర్ ఒకటి. ఈ చిత్రంలో చిరంజీవి డ్యాన్సులు, డైలాగ్ డెలివరీ, ఫైట్స్, మాస్ మ్యానరిజమ్స్ ఇలా ప్రతి అంశంలో చెలరేగిపోయారు. టాలీవుడ్ లో మాస్ చిత్రాలకు సరికొత్త అర్థం చెప్పిన చిత్రం గ్యాంగ్ లీడర్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సాధించిన వసూళ్లు ఇండస్ట్రీ మొత్తాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. గ్యాంగ్ లీడర్  మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 1991 మే 9న గ్యాంగ్ లీడర్ మూవీ రిలీజ్ అయింది. 

25
గ్యాంగ్ లీడర్ పై నరేష్ కామెంట్స్ 

ఈ మూవీలో విజయశాంతి హీరోయిన్. మురళి మోహన్, శరత్ కుమార్, సుమలత కీలక పాత్రల్లో నటించారు. సీనియర్ నటుడు నరేష్ ఓ ఇంటర్వ్యూలో గ్యాంగ్ లీడర్ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేష్, పవిత్ర లోకేష్, కమెడియన్ అలీ ముగ్గురూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. 90 దశకం నాటి పరిస్థితులని, సినిమాలని వీరు గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం నరేష్, పవిత్ర లోకేష్ రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. 2023లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరిద్దరి రిలేషన్ పై గతంలో చాలా వివాదాలు నడిచాయి. 

35
పవిత్ర ముందు తన గొప్పలు చెప్పుకున్న నరేష్ 

లేటు వయసులో వివాహం చేసుకున్న నరేష్, పవిత్ర ప్రస్తుతం అన్యోన్యంగా జీవిస్తున్నారు. నరేష్ కి ఇది నాలుగో వివాహం. ఇదిలా ఉండగా నరేష్, పవిత్ర, అలీ కలిసి పాల్గొన్న ఇంటర్వ్యూలో చిరంజీవి గ్యాంగ్ లీడర్ మూవీ గురించి ప్రస్తావన వచ్చింది. గ్యాంగ్ లీడర్ సినిమా జోరుకి తానే బ్రేకులు వేశానని నరేష్.. పవిత్ర ముందు గొప్పలు చెప్పుకున్నారు. నరేష్ మాట్లాడుతూ.. 'చిత్రం భళారే విచిత్రం' మూవీ అనేక సమస్యలతో మూడు నెలలు ఆలస్యంగా రిలీజ్ అయింది. గ్యాంగ్ లీడర్ రిలీజ్ అయిన నెలరోజుల తర్వాత 'చిత్రం భళారే విచిత్రం' రిలీజ్ అయింది. 

45
గ్యాంగ్ లీడర్ స్పీడుకి బ్రేకులు 

అప్పటికి ఇంకా గ్యాంగ్ లీడర్ జోరు తగ్గలేదు. జూన్ 7న రిలీజైన చిత్రం భళారే విచిత్రం మూవీకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. థియేటర్స్ లో నవ్వుల జల్లులు కురిశాయి. జనం ఈ చిత్రాన్ని ఎంతగా ఆదరించారు అంటే.. గ్యాంగ్ లీడర్ స్పీడుకి కూడా బ్రేకులు పడ్డాయి' అని నరేష్ అన్నారు. ఈ మూవీలో నరేష్ లేడీ గెటప్ లో అదరగొట్టారు. 

55
సినిమా హిట్ అని చెప్పింది ఆయనే 

అలీ మాట్లాడుతూ ఈ చిత్రం రిలీజ్ సమస్యలతో ఇబ్బంది పడ్డప్పటికీ.. రిలీజ్ అయ్యాక మాత్రం థియేటర్స్ లో పేలిపోయింది. ప్రతి షో హౌస్ ఫుల్స్ అయ్యాయి అని అన్నారు. నరేష్ మరికొన్ని విషయాలని గుర్తు చేసుకున్నారు. తాను ఈ మూవీలో సినిమా మొత్తం లేడీ గెటప్ లో నటించానని తెలియడంతో బయ్యర్లు ఎవరూ సినిమా కొనేందుకు సాహసించలేదు. అందువల్లే రిలీజ్ ఆలస్యం అయింది. సన్నిహితులు కూడా ఈ సినిమా ఆడదని చెప్పారు. కానీ జంధ్యాల గారు ఈ సినిమాని చూసి.. నువ్వేం భయపడకు, మూవీ గన్ షాట్ హిట్ అంతే అని చెప్పారు. ఆయన మాటలే నిజమయ్యాయి అని నరేష్ గుర్తు చేసుకున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories