Pushpa Review:అల్లు అర్జున్‌ ‘పుష్ప - ది రైజ్‌’ రివ్యూ

First Published | Dec 17, 2021, 9:40 AM IST

  దాదాపు 12 ఏళ్ల తర్వాత ముచ్చటగా మూడోసారి కలిసి చేసిన చిత్రం ‘పుష్ప’. పాన్ ఇండియా సినిమాగా వ‌చ్చిన  పుష్ప‌ మొదటి భాగం… రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటకతో పాటు హిందీలో కూడా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది.

‘తగ్గేదే లే’ అంటూ అల్లు అర్జున్ థియేటర్స్ లో దిగిపోయాడు. విభిన్నమైన గెటప్, తెలుగు తెరపై రాని నేపధ్యంతో ఈ సినిమా ముస్తాబై వచ్చింది. ఈ మధ్యకాలంలో ఏ సినిమాకు రానంత క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా కేజీఎఫ్ లా ఉంటుందని, వీరప్పన్ పాత్రను చూసి డిజైన్ చేసారని రకరకాల వార్తలు రిలీజ్ ముందు దాకా రచ్చ రచ్చ చేసాయి. మరో ప్రక్క ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో.. ఎంత గ్రాండ్‌గా విజువల్ ఫీస్ట్ ఉండబోతుందో కళ్ల ముందు కనిపించింది. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో సినిమా ఉండబోతోందని అర్దమైపోయింది. ఈ లోకం నీకు తుపాకి ఇస్తే.. నాకు గొడ్డలి ఇచ్చింది అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ అన్ని చోట్లా మారు మ్రోగింది. మరో ప్రక్క దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన అన్ని పాటలు యూట్యూబ్ ను ఒక ఊపు ఊపేస్తున్నాయి.  ఈ నేపధ్యంలో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉంది? చిత్రం కథేంటి..అంచనాలకు తగ్గ స్దాయిలో ఈ సినిమా ఉందా? 

Pushpa

కథ ఏంటి

రాయలసీమలోని శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ జరుగుతూంటుంది. పోలీస్ లుదాడి చేసి  లారీ డ్రైవర్ పుష్ప (అల్లు అర్జున్) ని పట్టుకుంటారు. అతన్ని అరెస్ట్ చేసి అసలు దీనివెనక ఎవరు అని తమ స్టైల్ లో కొట్టి విచారిస్తారు. అప్పుడు తమతో స్మగ్లింగ్ చేయించేది తమ  పుష్ప రాజ్ అని చెప్పటం మొదలెడతాడు. ఈ లోగా పుష్పకు బెయిల్ ఇప్పించేందుకు కొండారెడ్డి(అజయ్ ఘోష్) వస్తాడు. కొండారెడ్డి ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఆరితేరినవాడు. అతని క్రింద కొంతకాలంగా పుష్ప పనిచేస్తున్నాడన్నమాట.   కొండారెడ్డి లాంటి కొందరు స్మగ్లర్స్ ని వెనక నుంచి లీడ్ చేసే బాస్ మంగళం శీను(సునీల్). వాళ్లంతా ఎప్పటికప్పుడు తమ ఎర్ర చందనం దుంగలు స్మగ్లింగ్ కు కొత్త మార్గాలు అన్వేషిస్తూంటారు. వాటిని పుష్ప తన తెలివితో ఐడియాలు ఇస్తూ..కొండా రెడ్డికు దగ్గర అవుతాడు.  పాలబండిలో దుంగలు పెట్టి స్మంగ్లింగ్ చేస్తారు. కానీ అదీ ఎంతోకాలం దాగదు.  ఈ క్రమంలో మంగంళ శ్రీను కు చెందిన మాల్ ని ఓ సారి పుష్ప పోలీస్ ల నుంచి సేవ్ చేస్తాడు. 



 కోట్ల విలువ చేసే మాల్ ని పుష్ప తన తెలివితో  సేవ్ చేసినందకు   మంగళం శ్రీను ఓ పెద్ద పార్టీ ఇస్తాడు. ఆ పార్టీలో మంగళం శ్రీను బిజినెస్  గురించి ఓ విషయం పుష్పకు తెలుస్తుంది. ఎర్రచందనం దుంగలను మంగళం శీను ..కొండా రెడ్డి దగ్గర తక్కువకు తీసుకుని, బాగా ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నాడని రివీల్ అవుతుంది. అది అవకాసం చేసుకోవాలనుకుంటాడు పుష్ప. మంగళం శీనును ఒప్పించి  ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చేలా చేస్తే అందులో 50 శాతం షేర్ ఇస్తా అని పుష్పకు.. కొండారెడ్డి ఆఫర్ ఇస్తాడు.  ఆ క్రమంలో మంగళం శ్రీనుకు వార్నింగ్ ఇస్తాడు.  అలా తన తెలివి, తెగువ తో ఆ స్మగ్లింగ్ సామ్రాజ్యంలో ముందుకు దూసుకుపోతూంటాడు పుష్ప. అయితే అదే క్రమంలో అతని చుట్టూ పోలీస్ లు, మంగళం శ్రీను మనుష్యులు కమ్మేస్తూంటారు. వాటిని దాటుకుని పుష్ప..పుష్ప రాజ్ గా ఎదిగి...ఎర్ర చందనం సిండికేట్ కు..మంగళం శ్రీను ని దాటి బాస్ అని ఎలా అనిపించుకున్నాడు. కొండా రెడ్డి ఏమయ్యాడు..భన్వర్ సింగ్ షెకావత్ (ఫహద్ ఫాజిల్‌) పాత్ర ఈ కథలో ఏమిటి, పుష్ప గతంలో ఎదుర్కొన్న అవమానాలు ఏమిటి.. శ్రీవల్లి(రష్మీక మందన్నా) తో ప్రేమ వ్యవహారం ఓ కొలిక్కి ఎలా తీసుకొచ్చాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Pushpa Premier show review


ఎనాలసిస్...

ఈ సినిమా పూర్తిగా  ఓ క్యారక్టర్ డ్రైవన్ ప్లాట్. కథ గా చెప్పాలంటే కష్టం. ఈవెంట్స్ లాంటి సీన్స్ తో కథ నడుస్తుంది. పుష్ప క్యారక్టర్ పట్టేస్తే సినిమా ఎక్కేస్తుంది అనే ధోరణిలో చేసిన స్క్రిప్టు. ఓ రకంగా ఇది పుష్ప అనే పిక్షనల్ వ్యక్తి చెందిన బయోపిక్ లాంటి కథనం. అయితే కథ పూర్తిగా ఒకే పార్ట్ లో చెప్పటం లేదు కాబట్టి చివరకు వచ్చేసరికి చిన్న అసంతృప్తి అనిపిస్తుంది. కానీ అప్పటిదాకా ఎంత ఇంట్రస్టింగ్ గా నడిపామన్నదే ముఖ్యం. ఈ విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడెక్కడికి మాస్ ఎలిమెంట్స్ తో కథని కదం తొక్కించే ప్రయత్నం చేసారు. నెగిటివ్ క్యారక్టర్ ని కూడా నావెల్టీ గా చెప్పారు. ఈ మధ్యన వచ్చిన మళయాళ చిత్రం కురూప్ లా..ఇది యాంటి సోషల్ ఎలిమెంట్ కథే. కానీ దాన్ని మన మధ్య తిరిగే ఓ వ్యక్తి కథ క్రింద చెప్పారు. హీరో పాత్రకు ఓ ఎమోషనల్ లగేజి (మదర్ సెంటిమెంట్) బ్యాక్ స్టోరీ పెట్టారు. 

pushpa kerala release


పెయిన్ తో కూడిన గతం పుష్పని మనకు దగ్గర చేస్తుంది. అలాంటి కుటుంబ పరిస్దితుల నుంచి వచ్చాడు కాబట్టి అతని చేసే చేష్టలు సబబే అనిపిస్తాయి. పుష్పకు ఏం కావాలో (power, dominion)..అందుకోసం తనను తాను ఎంతవరకూ ఎంతవరకూ తెగించాలో కూడా స్ఫష్టంగా  తెలుసు. అదే ప్యూయిల్ గా పనిచేసి  ఈ కథని బేస్ లెవిల్ లో నిలబెట్టి ముందుకు తీసుకెళ్లింది. తన లక్ష్యం(స్మగ్లర్స్ సిండికేట్ నాయకుడిగా )ఎదగటం వైపుకు దూసుకుపోవటం..ఆ క్రమంలో ఇతర పాత్రల నుంచి వచ్చే అడ్డులను తొలిగించుకోవటం ..అందుకు తగ్గ మోటివేషన్ చాలావరకూ బాగా కుదిరాయి. అలాగే ఇదో static character ఎక్కడా ఛేంజ్ కాదు. చుట్టూ పరిస్దితులు మారచ్చేమో కానీ తను మారడు.   చాలా సార్లు ఈ పాత్రలు flat character అయ్యే ప్రమాదం ఉంది. కానీ ఇక్కడ అది జరగలేదు.  ప్లాట్ నేరేషన్ కు తావిచ్చింది. ఫస్టాఫ్ ఇంటర్వెల్ దాకా ఏమీ జరిగినట్లు అనిపించదు. ఫస్టాఫ్ లో ఎక్కువ హై ఎలిమెంట్స్ లేవు. దానికి తోడు స్లో నేరేషన్. సెకండాఫ్ మొత్తాన్ని సెకండ్ ఇనస్టాల్మెంట్ కోసం రంగం సెట్ చేసిపెట్టినట్లు అనిపిస్తుంది. లవ్ ట్రాక్ విషయానికి వస్తే ...ఫన్ యాంగిల్ బాగా వర్కవుట్ అయ్యింది. 

 కాంప్లిక్ట్  ప్రీ క్లైమాక్స్ దాకా లేదే


సాధారణంగా ఇలాంటి సినిమాల్లో మెయిన్ క్యారక్టర్ ద్వారా పుట్టే ఇన్సిడెంట్స్ కాంప్లిక్ట్స్ ఇస్తూ కథకు ఓ పాయింట్ ఆఫ్ ఇస్తాయి. ఇంటర్వెల్ లో మంగళం శ్రీను కు వార్నింగ్ ఇచ్చే క్రమంలో అది మనకు పూర్తిగా అర్దమవుతుంది. అయితే ఆ ఫైర్ ని చివరి అరగంట సస్టైన్ చేయలేకపోయారు. ఎంతో ఎక్సపెక్ట్ చేసిన ఫహద్ ఫాజిల్‌ పెద్దగా అనిపించలేదు.  క్లయిమాక్స్ కు ముందు భన్వర్ సింగ్ షెకావత్ గా తెరపైకి  ‘ఒకటి తక్కువుంది…’అంటూ వచ్చి పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. ‘పుష్ప’ రెండో భాగంలో ఫహద్ కి ప్రాధాన్యత ఉంటుందేమో.  భన్వర్ సింగ్ పాత్ర వచ్చేకే వాస్తవానికి కథలో బలంగా కాంప్లిక్ట్  క్రియోట్ అవుతుంది. అంటే అప్పటిదాకా నడిచిన డ్రామా తేలిపోయింది. సినిమా అక్కడ నుంచే మొదైలనట్లు అనిపించింది.


అయితే ఈ లెక్కలన్నీ ఊహించనేమో  సుకుమార్ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పుష్ప పాత్రను మన మైండ్ లో మెల్లిగా ఎక్కించే ప్రయత్నం..అందకు తీసుకున్న టూల్స్ ..పుష్ప వేసుకున్న డ్రస్, వాకింగ్ స్టైయిల్, వాయిస్, యాస, పర్శనాలిటీ.  పుష్ప బిహేవియర్ మన సొంత ethical norms కు ఫిట్ కాదు. కానీ అతని చేసే పనులకు మనం టెన్షన్ పడతాం. అయితే ఈ ఎలిమెంట్స్ అన్నీ పూర్తిగా వర్కవుట్ అయినా వందకు వంద శాతం ఎంగేజ్ చేయటంలో మాత్రం ఈ సినిమా సక్సెస్ కాలేదనిపిస్తుంది.  అందుకు కారణం అతను గత చిత్రం రంగస్దలం స్దాయి డ్రామా ఈ సినిమాలో మిస్ కావటమే. రెండు సినిమాల్లోనూ rustic యాంగిల్ కు ప్రాధాన్యత ఇచ్చినా రంగస్దలంలో కాంప్లిక్ట్స్ వన్ టు వన్ ఉండి, క్లైమాక్స్ ట్విస్ట్ దాకా అది డ్రైవ్ చేస్తుంది. ఈ సినిమా మాత్రం కేజీఎఫ్ తరహాలో హీరో పాత్ర ఎదుగుదల..ఆ క్రమంలో వచ్చే సవాళ్లకే ప్రాధాన్యత ఇచ్చింది. అయితే నేపధ్యం కొత్తగా ఉండటం, అల్లు అర్జున్ గెటప్ మరింత కొత్తగా అనిపించటం చాలావరకూ కలిసొచ్చిన అంశాలు. ఏదైమైనా సుకుమార్ ప్రతీ పాత్రనీ ఇంటలెక్చవల్ ఇంట్రెస్ట్ తో   మన ముందు ఆవిష్కరించారు. కొందరైతే ఒకే పాత్రను రూట్ చేస్తారు. మిగతా పాత్రలను పట్టించుకోరు. కానీ సుకుమార్ తన  అన్ని పాత్రలను పట్టించుకున్నారు. హీరో పాత్రను మరింత ఎక్కువ పట్టించుకున్నారు అంతే తేడా. 


టెక్నికల్  గా...

దర్శకుడుగా ఈ సినిమా సుకుమార్ కు ఓ కొత్త ప్రయోగం. రెండు పార్ట్ లు కాకుండా ఒకే పార్ట్ లో కథను కుదించి చెప్తే బాగుండేదేమో అనిపించింది. అయితే చాలా చిన్న చిన్న డిటేల్స్ సైతం సుకుమార్ ప్రెజెంట్ చేసారు. అడవిలో పూర్తిగా కళ్ళకు కట్టినట్లు చూపించారు.  సుకుమార్ కు తన సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లటంతో టెక్నీషియన్స్ కు ఏ స్దాయి ప్రిఫరెన్స్ ఇవ్వాలో పూర్తిగా తెలుసు. అందరి నుంచి అద్బుతమైన అవుట్ ఫుట్ తీసుకుంటారు. ఎక్కడా కాంప్రమైజ్ కారు. అదే విషయం ఈ సినిమాలో మనకు క్లారిటీగా మరోసారి కనిపిస్తుంది. మేకప్,ఆర్ట్ డిపార్టమెంట్స్  పడిన కష్టం అయితే మామూలుగా లేదు. రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్ యాక్షన్స్ సీన్స్ గూజ్ బంబ్స్ . కెమెరా వర్క్ నెక్ట్స్ లెవిల్ లో ఉంది. సినిమా  లెంగ్త్ తగ్గించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.  అలాగే సుకుమార్ కు రైట్ హ్యాండ్ లా దేవిశ్రీ ప్రసాద్‌ మళ్లీ నిలిచారు.  అన్ని పాటలూ చార్ట్ బస్టర్స్ .  చంద్రబోస్‌ పాటలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. రసూల్ పూకుట్టి సౌండ్ డిజైన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.  మైత్రీ మూవీ మేకర్స్   ప్రొడక్షన్ వాల్యూస్ మామూలుగా లేవు.

pushpa press meet


నటీనటుల్లో...

‘తగ్గేదే లే’మేనరిజంను అల్లు అర్జున్ ..ఒక్కో చోట..ఒక్కోలా పలుకుతూ తెర మొత్తం తానే ఆక్రమించాడు.   నేను బిజినెస్ లో ఏలు పెట్టి కెలకటానికి రాలేదు… ఏలటానికి వచ్చాను.. అని పుష్ప మంగళం శీనుతో అనే డైలాగ్ సినిమాకే హైలెట్. పాలు అమ్ముకునే లో మిడిల్ క్లాస్ అమ్మాయి శ్రీవల్లి గా రశ్మిక ఒదిగి పోయింది. పుష్పని ఇబ్బంది పెట్టే  డీఎస్పీ గోవిందప్పగా శత్రు,ఎర్రచందనం స్మగ్లర్ కొండారెడ్డిగా అజయ్‌ ఘోష్‌, అతని తమ్ముడు జాలిరెడ్డిగా కన్నడ నటుడు ధనుంజయ్ ఎప్పటిలాగే బాగా చేసారు. మంగళం శ్రీను పాత్రలో సునీల్ ని చూస్తే అతను ఇంతకు ముందు కామెడీ చేసేవాడు అంటే నమ్మబుద్ది కాదు. అనసూయ పాత్ర మాత్రం హైలెట్ కాలేదు. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్‌ మాత్రం తేలిపోయారనిపించింది. సెకండ్ పార్ట్ లో ఆయన విశ్వరూపం కనపడుతుందేమో చూడాలి.


హైలెట్స్ 
 
అల్లు అర్జున్  బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్
లవ్ ట్రాక్
ఇంట్రవెల్
మేకప్
కెమెరా వర్క్
 ఐటమ్ సాంగ్
ఫహద్ ఫాజిల్‌ ఇంట్రో సీన్

మైనస్ లు

డల్ గా సాగిన క్లయిమాక్స్
స్లో నేరేషన్
 మూవీ రన్ టైమ్ బాగా ఎక్కువ అవటం
VFX వర్క్
 

ఫైనల్ థాట్
 బలమైన క్యారక్టర్స్ ఎలాగైనా బ్రతికేస్తాయి. 'పుష్ప: ది రూల్‌' 

--సూర్య ప్రకాష్ జోశ్యుల


Rating : 3/ 5

Also read Pushpa movie review: పుష్ప ట్విట్టర్ టాక్.. పోకిరి రేంజ్ క్లైమాక్స్ ట్విస్ట్!
 

Pushpa Pre release event

తెర ముందు..వెనక

బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ ముత్తంశెట్టి మీడియా
నటీనటలు:
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు

Also read Pushpa Movie Review: 'పుష్ప' ప్రీమియర్ షో టాక్.. ఫారెస్ట్ లో అల్లు అర్జున్ చెడుగుడు

టెక్నికల్ టీం:
సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: S. రామకృష్ణ – మోనిక నిగొత్రే
సౌండ్ డిజైన్: రసూల్ పూకుట్టి
ఎడిటర్: కార్తిక శ్రీనివాస్ R
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్
లిరిసిస్ట్: చంద్రబోస్
క్యాస్ట్యూమ్ డిజైన్: దీపాలీ నూర్
మేకప్: నాని భారతి
దర్శకుడు: సుకుమార్
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
కో ప్రొడ్యూసర్స్: ముత్తంశెట్టి మీడియా
 రన్ టైమ్:179 నిముషాలు
విడుదల తేదీ:17, డిసెంబర్ 2021

Latest Videos

click me!