Lakshya:నాగ శౌర్య 'లక్ష్య' మూవీ రివ్యూ

First Published | Dec 10, 2021, 3:05 PM IST


స్పోర్ట్ డ్రామా అయినప్పటికి భిన్నమైన కాన్సెప్ట్ తో ఎక్కడా బోర్ కొట్టకుండా ఆకట్టుకోవటం అనేది ఎప్పుడూ పెద్ద టాస్కే.  అందుకే కొత్తగా ఉంటుందని విలువిద్య నేపథ్యంలో హీరో నాగశౌర్య 'లక్ష్య' చేశారు. సినిమా కోసం ఆయన ప్యాక్డ్ బాడీ బిల్డ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉంది? ఏమిటి? 

Lakshya


‘వరుడు కావలెను’లో లవర్ బాయ్ గా కనిపించిన నాగశౌర్య తనను తాను మార్చుకుని  ‘లక్ష్య’లో విలువిద్యకారుడుగా మన ముందుకు వచ్చాడు. పాత్రలకు తగ్గట్లుగా మారిపోవడం కోసం ఏకంగా 8 ప్యాక్ బాడీ పొందాడు. ఇది మన తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని ఆర్చరీ బ్యాక్డ్రాప్ లో సాగే కథ.  మనకు ఎప్పటినుంచో తెలిసినదే విలువిద్య. దాన్ని కొత్తగా చెప్పాం అని మేకర్స్ చెప్తున్నారు. నిజంగానే ఈ కథలో కొత్తదనం ఉందా..నాగశౌర్యకు ఈ సినిమా హిట్ అనే లక్ష్యాన్ని చేర్చిందా? కథేంటి, జగపతిబాబు పాత్ర ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.


కథ
పార్ధు (నాగశౌర్య) ఆర్చరీ ప్లేయర్. తన తండ్రి కు  వరల్డ్ ఛాంపియన్ కావాలనేది లక్ష్యం. అది నెరవేరకపోవటంతో తను అయినా రాణించాలనుకుంటాడు.ఆ క్రీడా లక్షణం చిన్నతనం నుంచే పార్దులో కనపడుతుంది. ఆ విషయాన్ని గుర్తించిన  తాతయ్య రఘురామయ్య (సచిన్ ఖేడేకర్) సహకారంతో స్టేట్ లెవల్ ఛాంపియన్ అవుతాడు. నెక్ట్స్ లెవిల్ కు వెళ్లి దేశం తరుపున ఆడతాడు అనుకునే సమయంలో అతని లక్ష్యాన్ని డిస్ట్రబ్ చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి.తాతయ్య చనిపోతాడు. గెలుపు కోసం మత్తు పదార్దాలకు బానిస అవుతాడు. దాంతో అకాడమి నుంచి సస్పెండ్ అవుతాడు. చనిపోవాలనుకుంటాడు. అప్పుడు అతని జీవితంలోకి వచ్చిన సారథి (జగపతి బాబు) చేసిన సారధ్యం ఏమిటి? అలాగే రితికా (కేతికా శర్మ) పాత్ర ఏమిటి?  చివరకు అడ్డంకులు దాటి వరల్డ్ ఛాంపియన్ అయ్యాడా? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  


Lakshya


ఎలా ఉంది


నిజానికి ఇదేం కొత్త క‌థ కాదు. ఇలాంటి స్పోర్ట్స్ క‌థ‌లు ఇది వ‌ర‌కు చాలా వ‌చ్చాయి. మ‌రి ఏంటి ఈ సినిమాలో కొత్తదనం అంటే..ఎంచుకున్న క్రీడ ఆర్చరీ బ్యాక్డ్రాప్.  ఇలాంటి సినిమాల్లో ఏం ఉండాలి? అంటే… స్ట్రాంగ్ ఎమోష‌న్.  ఎందుకంటే స్టోరీ ఆర్క్ ...స్క్రీన్ ప్లే డిజైన్ టెంప్లేట్ లోనే సాగుతాయి. ఓ క్రీడాకారుడు నానా కష్టాలు పడి చివరకు పోటీలో గెలుస్తాడు. దాన్ని ఎంత ఇంట్రస్టింగ్ గా చెప్పాము...హీరో గెలవాలి అని ప్రేక్షకుడుకు ఎమోషన్ గా ఫీల్ అయ్యేలా సీన్స్ ఉండాలి. అంతేకానీ తెరపై కనపడే హీరో వేరు, చూసే మనం వేరు అనుకున్నప్పుడు కనెక్ట్ అవ్వటం కష్టమనిపిస్తుంది. అదే ఈ సినిమాకు జరిగింది. ముఖ్యంగా కాంప్లిక్ట్స్ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవటంతో సీన్స్ సాగుతుంటాయి కానీ ఇంట్రస్ట్  పుట్టదు. ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా సార్లు ఇక లేస్తుంది బాగుంది, అనుకునే లోగా గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోతుంది. ఇలా చాలా సార్లు ప్లెక్సివేషన్స్ వచ్చాయి. దానికి తోడు ఫలానా విధంగానే కథ నడుస్తుందని ఊహించినట్లుగానే సాగటంతో  రాను రాను బోర్ కొడుతుంది. డైరక్టర్  గేరు మార్చి.. స్పీడు పెంచాల‌నిపిస్తుంది.  కానీ.. ఈ బండి స్పీడు పెర‌గ‌దు. క్ర‌మంగా త‌గ్గుతూ ఉంటుంది. దాంతో.. చుట్టూ మంచి ఎపిసోడ్స్ ఉన్నా… నీర‌సం ఆవ‌హిస్తుంది.  ఎందుకంటే పార్దు పాత్ర‌ ఓ టైమ్ లో  సింప‌తీ క్రియేట్ అవ్వాలి. అది ఇక్క‌డ జ‌ర‌గ‌లేదు. నాగశౌర్య చాలా బాగా చేశాడు. కాక‌పోతే. ఆ పాత్ర‌కు ఇంకాస్త ఎన‌ర్జీ ఉండాల్సింది.

Lakshya


 స్క్రిప్టు(భవిష్యత్తు) అతనికి ముందే తెలిసిపోయినట్లుగా రియార్ట్ అవుతూంటాడు. ఎన్ని అడ్డంకులు ఉన్నా ఓ వ్యక్తి పడిలేచి విన్నర్ ఎలా అయ్యాడు అనే  ఉదాత్త‌మైన క‌థ‌ని తెలుగు ప్రేక్ష‌కుల‌కూ అందించాల‌న్న త‌ప‌న ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ది. కాక‌పోతే.. ఇక్క‌డు మారుతున్న ప్రేక్ష‌కుల అభిరుచిని దృష్టిలో పెట్టుకోలేక‌పోయారు. మనకు ఏ కథ అయినా ఇప్పుడు కాస్తంత డెప్త్ గా కోరుకుంటున్నారు. నిజ జీవితాన్ని తెరపై ఆవిష్కరించినట్లు అనిపించాలనుకుంటున్నారు. ఓ నిజ జీవిత బయోపిక్ అనిపించగలగాలి. లేదా మాస్ మసాలా సినిమా అయినా కావాలి. రెండూ కానప్పుడు రొటీన్ కక్ష్యలోనే తిరుగుతుంది. వాస్తవానికి జగపతిబాబు, నాగశౌర్య మధ్య వచ్చే సీన్స్ హైలెట్ కావాలి. కానీ కాలేదు. ఆర్చరీ సీన్స్ కూడా అంతంతమాత్రమే. ఫస్టాఫ్  ఏదో కొంతైనా నడిచిన  ఫీలింగ్ క‌లుగుతుంది. ద్వితీయార్థం సైతం ర‌న్ టైమ్ మామూలే. కానీ లెంగ్తీ సినిమా చూసిన‌ట్టు ఉంటుంది. కార‌ణం.. క‌థ‌నంలో స్పీడు లేక‌పోవ‌డం. క్లైమాక్స్ ఊహించేదే కాబట్టి మామూలుగానే బయిటకు వస్తాం.  

Lakshya

టెక్నికల్ గా..

ఈ సినిమాకు తక్కువ పాటలు పెట్టడం కలిసొచ్చిందనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డీసెంట్ గా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. అయితే అద్బుతం కాదు. ఎడిటింగ్ సైడ్ సెకండాఫ్ లో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదనిపించింది. రైటింగ్ సైడ్ మాత్రం పూర్తిగా మ్యాజిక్ మిస్సైంది. ప్రొడక్షన్ వాల్యూస్ బ్యానర్ కు తగినట్లుగా ఉన్నాయి. దర్శకుడు గా మొదట సినిమా సుబ్రమణ్యపురంకు ఈ సినిమాకు బాగా ఛేంజ్ కనపడింది. మంచి స్క్రిప్టు తోడైతే దర్శకుడు హిట్ సినిమా తీయగలడని అనిపిస్తుంది. డైలాగులు బాగున్నాయి.  సూటిగా, ఫెరఫెక్ట్ గా వింటి నుంచి వదిలిన బాణంలా కొన్ని ఉన్నాయి. అయితే కొంత ఇలాంటి సినిమాలకు డైలాగులు ఎంత నేచరల్ గా ఉండే అంతే బాగుంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇలాంటి సినిమాల నుంచి ఆసించే థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ సినిమాలో లేవు. 

నటీనటుల్లో నాగశౌర్యం తన కష్టం తను పడ్డాడు. అతనికి వంక పెట్టలేం. హీరోయిన్ రొమాంటిక్ ఫేమ్ “కేతిక శర్మ” జస్ట్ ఓకే. జగపతి బాబు ఉన్నంతలో ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్.  
 

Lakshya


నచ్చినవి
కొత్త నేపధ్యం
బీజీఎం

నచ్చనవి
రొటీన్ స్క్రీన్ ప్లే
ఎమోషన్స్ కథ కు తగ్గ స్దాయిలో లేకపోవటం

‘వరుడు కావలెను’లో లవర్ బాయ్ గా కనిపించిన నాగశౌర్య తనను తాను మార్చుకుని  ‘లక్ష్య’లో విలువిద్యకారుడుగా మన ముందుకు వచ్చాడు. 

Lakshya


ఫైనల్ థాట్

కథకు నేపధ్యం మారిస్తేసరిపోదు..నడక (స్క్రీన్ ప్లే) కూడా మార్చాలి. 

---సూర్య ప్రకాష్ జోశ్యుల

రేటింగ్ : 2 / 5

Lakshya

ఎవరెవరు..

 న‌టీన‌టులు: నాగ‌శౌర్య‌, కేతిక శ‌ర్మ‌, స‌చిన్ ఖేడ్కర్‌, జ‌గ‌ప‌తిబాబు, ర‌విప్రకాష్‌, స‌త్య‌, శత్రు, వైవా హ‌ర్ష, త‌దిత‌రులు; 
సంగీతం: కాల భైర‌వ‌;
 కూర్పు: జునైద్‌; 
ఛాయాగ్రహ‌ణం: రామ్‌రెడ్డి; 
ద‌ర్శక‌త్వం: ధీరేంద్ర సంతోష్ జాగ‌ర్లపూడి; 
నిర్మాత‌లు: నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్‌రావు,శరత్ మరార్‌;
 విడుదల తేదీ: 10-12-2021

Also read Gamanam Review: శ్రియా `గమనం` మూవీ రివ్యూ

Latest Videos

click me!