#HIT2:అడవి శేషు 'హిట్ 2' మూవీ రివ్యూ

First Published Dec 2, 2022, 1:13 PM IST

'హిట్ 2' ప్రారంభం  బావుంటుంది. మిడిల్ ఓ మాదిరిగా ఉంటుంది... కిల్లర్ ఎవరనేది తెలిసిపోయాక...కిక్ పోతుంది..కానీ అప్పటిదాకా నడిపిన తీరు నచ్చుతుంది... 'హిట్ 2' డీసెంట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనిపిస్తుంది. 

HIT 2 Movie Review


సాధారణంగా థ్రిల్లర్స్ రాసి,తీసి ఒప్పించటం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే చూసే వారి ఇంటిలిజెన్స్ ని ఏ మేరకు సంతృప్తి పరిచామన్న దానిపైనే ఈ సినిమాల సక్సెస్ ఆధారపడి ఉంటుంది.  అందరికి ఒకే ఐక్యూ ఉండదు. అందరూ థియేటర్ లో కూర్చుని డిటెక్టివ్ లా మారి, కథలో దూరి ఇన్విస్టిగేట్ చెయ్యాలనుకోరు. అయితే చూసే వారిని ఏ మాత్రం థ్రిల్ చేసినా ఇవి వర్కవుట్ అయిపోతూంటాయి.అదే వీటి ప్లస్ . ఈ సినిమాలో ఎలాంటి థ్రిల్స్ ఉన్నాయి...సినిమా చివరి దాకా అవి సస్టైన్ అయ్యాయా...థ్రిల్లర్ ప్రేమికులకు నచ్చే సినిమాయేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.


కథాంశం:
అనగనగా ఓ సైకో కిల్లర్...అతను వైజాగ్ లో  సంజన అనే అమ్మాయి ని  దారుణంగా హింసించి చంపుతాడు. ఈ మర్డర్ అంతటా సంచలనం రేపుతుంది. పొలిటికల్ ప్రెజర్ మొదలవుతుంది. ఈక్రమంలో ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి వైజాగ్ ఎస్పీ కృష్ణదేవ్(అడివి శేష్) అలియాస్ కేడి ని రంగంలోకి దిగుతాడు. అతనో ఓవర్..స్మార్ట్..ఓవర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్...ఇలాంటి కేసులు చాలా చూశా కొన్ని గంటల్లో హంతకుడిని పట్టేస్తా అని స్టేట్మెంట్ పడేస్తాడు. అయితే అది అనుకున్నంత ఈజీ కాదని అతి తొందరోనే  కేడీకి అర్దమవుతుంది. 
 

HIT 2 Review


ముందుకు వెళ్లే కొలిదీ ఆ కిల్లర్...కేడీ కు సవాల్ గా మారతాడు.  అంతేకాదు  మర్డర్ కి గురైంది సంజన మాత్రమే కాదు ఆ బాడీ కొందరు అమ్మాయిల శరీర భాగాలతో కలిసి ఉందని రివీల్ అవుతుంది. ( తల, మొండెం, కాళ్ళు, చేతులు... నాలుగు భాగాలుగా బాడీని సపరేట్ చేస్తాడు. తల మాత్రమే సంజనాది అని... మొండెం, కాళ్ళు, చేతులు మరో ముగ్గురు అమ్మాయిలవి అని ఫోరెన్సిక్ టెస్టులో తెలుస్తుంది. )దాంతో  కేడీ మైండ్ బ్లాక్ అవుతుంది.  ఇప్పుడు కేడీ ఏం చేసాడు..అసలు ఈ సైకో సీరియల్ కిల్లర్ ఎవరు? వాడికి ఇదేం సరదా ...అమ్మాయిలనే పనిగట్టుకుని ఎందుకు చంపుతున్నాడు? కేడి ఈ కేసు ఎలా ఛేదించాడు? అనేది హిట్ 2 కథ…


ఎలా ఉందంటే...

ఇలాంటి కథల్లో ఎప్పుడూ ఒకటే కీలకంగా నిలుస్తుంది. అదే కథలో టెన్షన్ ఎంతుంది...అసలు టెన్షన్ క్రియేట్ చేసేది ఏది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే జనాలు ఏమి తెలుసుకోవాలని తహతహలాడుతున్నారు. దాన్ని ఏ మేరకు ఎంత సమర్దవంతంగా డిలే చేస్తున్నారు అనేది. అలాగని పాత్రలు భయంతో  లేదా టెన్షన్ తో పరుగెత్తటం కాదు. చూసేవాళ్లలో ఆ భావన కలగగలిగాలి. ఆ విషయంలో చాలా భాగం ఈ సినిమా సక్సెస్ అయ్యింది. మరీ సినిమాల్లోకి, పాత్రల్లోకి దూరేసి ..అసలు కిల్లర్ ఎవరు అని వెతికేస్తే తప్పించి...క్యాజువల్ గా చూస్తే ఇంట్రస్టింగ్ గానే సాగుతుంది. అయితే ఫస్ట్ పార్ట్ ఉన్నంత షార్ప్ గా అయితే ఈ సినిమాలో సీన్స్ కనిపించవు. అయితే విజువల్ గా ఈ సారి పరిణితి కనపడుతుంది. విజువల్స్ తోనే టెన్షన్ క్రియేట్ చేసే ప్రయత్నం ముచ్చటేస్తుంది. 
 


నేరేషన్ ...రెగ్యులర్ థ్రిల్లర్ ఫార్మెట్ ని ఫాలో కావటంతో కొంత గెస్ చేయగలుగుతాం. ఇంతకు ముందే చూసిన ఫీలింగ్ కొన్ని సీన్స్ లో వస్తుంది. అలాగే ఇన్విస్టిగేషన్ మధ్య లో ప్రెస్ మీట్స్, పై అధికారులతో విభేధాలు వంటి ఎలిమెంట్స్ దూరంపెట్టాల్సింది.    ఇంటర్వల్ మాత్రం బాగా డిజైన్ చేసారు. ఆ తర్వాత మళ్లీ  predictable టర్న్ తీసుకుని సాగుతుంది.  సెకండాఫ్ కూడా కొంచెం అటూ,ఇటూలో ఫస్టాఫ్ మాదిరిగాగా సాగినా...అయితే ప్రీ క్లైమాక్స్ దగ్గరక వచ్చేసరికి సర్దుకున్నారు. ముఖ్యంగా కృష్ణ దేవ్ పాత్ర సస్పెండ్ అవ్వటం,  కిల్లర్  ...కృష్ణదేవ్ కు ఛాలెంజ్ విసరటం మనం ఊహించగలిగేలా ఉంటాయి.


సినిమా ప్రారంభానికి ,చివరకు లింక్ పెట్టి కంక్లూజ్ చేసారు. క్లైమాక్స్ కొంచెం డిఫరెంట్ గానే ఉంది. దాన్ని ఏ మేరకు ఏక్సెప్ట్ చేస్తారన్నదానిపై ఈ సినిమా సక్సెస్ రేటు ఆధారపడుతుంది. ఏదైమైనా ఇలాటి కథలకు స్క్రీన్ ప్లే గురువులు చెప్పే ఒక మాట..The Antagonist Is The Most Important Person. ఈ విషయాన్ని ఈ సినిమాలో మరింత సీరియస్ గా తీసుకుంటే ఇంకా బాగుండేది.
 


 సాంకేతికంగా చూస్తే… 

ఇలాంటి సినిమాలకు అవసరమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ఇట్చారు. అలాగే   సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగున్నాయి. హిట్ 2 చిత్రానికి స్క్రీన్ ప్లే, అద్బుతం అని చెప్పలేం కానీ రేసిగా ఉందని  చెప్పొచ్చు. క్లూలు విసిరి, వాటిని ఏరి,కూర్చటం బాగుంది. అలాగే నిడివి తక్కువ వున్న సినిమా ఇది. అదీ కూడా ఒక ప్లస్ పాయింట్.

నటీనటుల్లో...
 
ఈ సినిమా అడవి శేషు వన్  మ్యాన్ షో అని చెప్పాలి. నటుడుగా శేషు ఎప్పుడో పరిణితి సాధించారు. తన అనుభవంతో కేడీ పాత్రలో ఒదిగిపోయాడు. పాత్రలో భిన్న పార్శ్వాలని చక్కగా ప్రదర్శించి, ఓ డిఫరెంట్ లుక్ ని ,ఎప్రోచ్ ని ఫిల్మ్ కు ఇచ్చాడు.. హీరోయిన్ పాత్రకు కథ రీత్యా పెద్దగాప్రయారిటీ లేదు. చెప్పుకునేదేమీ లేదు. పోసాని, తణికెళ్ల వంటి సీనియర్స్ తో పాటు మిగతా పాత్రల్లో కనిపించిన వారు  తమ పరిధి మేరకు ఎక్కువ తక్కువ కాకుండా చేసుకుంటూ పోయారు.


 
బాగున్నవి:

రన్ టైమ్
అడవి శేషు ఫెరఫార్మెన్స్
నిర్మాతగా నాని
 
బాగోలేవనిపించినవి:
 గొప్పగా అనిపించని క్లైమాక్స్
సెకండాఫ్ సగంలోనే మిస్టరీ,సస్పెన్స్  మాయమయ్యేలా స్క్రీప్లే రాయటం
 హై మూవ్ మెంట్స్ పెద్దగా లేకపోవటం
 


ఫైనల్ థాట్
మీలో మంచి డిటెక్టివ్ ఉన్నాడో లేడో ఈ సినిమా తేల్చి చెప్తుంది..ట్రై చేయచ్చు.
 

---సూర్య ప్రకాష్ జోశ్యుల

Rating:2.75

HIT 2 Movie review

నటీనటులు : అడివి శేష్‌, మీనాక్షి చౌద‌రి, రావు ర‌మేష్‌, పోసాని కృష్ణ ముర‌ళి, త‌నికెళ్ల భ‌ర‌ణి, శ్రీనాథ్ మాగంటి, కోమ‌లి ప్ర‌సాద్ త‌దిత‌రులు
ఛాయాగ్రహణం : మ‌ణి కంద‌న్‌ ఎస్‌
నేపథ్య సంగీతం : జాన్ స్టీవార్ట్ ఏడూరి
స్వరాలు : ఎం.ఎం. శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి
సమర్పణ : నాని 
నిర్మాత : ప్రశాంతి త్రిపిర్‌నేని
రచన, దర్శకత్వం : శైలేష్ కొలను 
విడుదల తేదీ: డిసెంబర్ 2, 2022

click me!