ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ తన నాయకత్వానికి, కొత్త ఆవిష్కరణలకే కాదు.. పుస్తక పఠనంపై ఆయనకున్న ప్రేమకు కూడా ప్రసిద్ధి చెందారు. ఆయన పుస్తకాల నుంచి ఎంతో స్ఫూర్తి పొందారు.
1. షూ డాగ్ (రచయిత ఫిల్ నైట్ )
నైక్ సహ వ్యవస్థాపకుడు రాసిన ఈ పుస్తకం ఒక గ్లోబల్ బ్రాండ్‌ను నిర్మించడంలో ఎదురైన కష్టాలు, విజయాల గురించి చెబుతుంది. ఇది వ్యవస్థాపకులకు, అంకుర సంస్థలు ప్రారంభించాలనుకునేవాళ్లకు బాగా ఉపయోగపడుతుంది.
2. వెన్ బ్రీత్ బికమ్స్ ఎయిర్ (పాల్ కలనితి రాసినది)
టెర్మినల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఒక న్యూరోసర్జన్ తన జీవితంలోని అనుభవాలను ఇందులో పంచుకున్నారు. ఇది సక్సెస్ అంటే ఏమిటో తెలియజేస్తుంది. దాని కోసం ఎలా తపించిపోవాలో తెలియజేస్తుంది.
3. బాబీ కెన్నెడీ (లారీ టై రాసినది)
రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ సామాజిక న్యాయం కోసం ఎలా పోరాడారో ఈ పుస్తకం వివరిస్తుంది. ఇందులో సమగ్రత, దయ, నాయకత్వం గురించి తెలుసుకోవచ్చు. గొప్ప నాయకుడిగా పేరు గాంచిన కెన్నెడీ జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు ఇందులో చెప్పారు.
4. ట్రిలియన్ డాలర్ కోచ్ (ఎరిక్ స్మిత్ రాశారు)
ఈ పుస్తకం బిల్ కాంప్‌బెల్ గురించి చెబుతుంది. ఆయన చాలా మంది టాప్ లీడర్లకు మెంటార్‌గా ఉన్నారు. టీమ్‌వర్క్ గురించి ఇందులో తెలుసుకోవచ్చు.
5. మార్చి (జాన్ లూయిస్ రచయిత)
పౌర హక్కుల నాయకుడు జాన్ లూయిస్ రాసిన ఈ పుస్తకం సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటాన్ని తెలియజేస్తుంది. ధైర్యం గురించి తెలుసుకోవచ్చు.
6. గాంధీ: ఆన్ ఆటోబయోగ్రఫీ
ఇది మహాత్మా గాంధీ స్వీయ చరిత్ర. ఇందులో ఆయన తన గురించి, శాంతియుత నిరసనల గురించి వివరించారు. గాంధీ తత్వం స్ఫూర్తినిస్తుంది. టిమ్ కుక్ సైతం ఆయన నుంచి ఎంతో ప్రేరణ పొందారు.
7. కంపీటింగ్ ఎగైనెస్ట్ టైమ్ (జార్జ్ స్టాక్ జూనియర్ రాసినది)
సమయం ఆధారిత పోటీ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే బిజినెస్ క్లాసిక్ ఇది. కార్పొరేట్ ప్రపంచంలో ఇది ఉపయోగపడుతుంది.