స్త్రీలల్లో.. పురుషులు ముందుగా ఏం గమనిస్తారో తెలుసా?

First Published | Sep 27, 2021, 4:17 PM IST

పురుషులు మీతో ప్రేమలో పడడానికి అనేక కారణాలు ఉంటాయి. మీలో కొన్ని లక్షణాలు వారిని ఆకట్టుకుంటాయి. అవి వారి గుండె లయను తప్పేలా చేస్తాయి. అదే మీలో ఏదో తెలీని ఆకర్షణ ఉంది.. అనుకునేలా చేస్తుంది. అది వారిని మీ మాయలో పడేస్తుంది. 

పురుషులు మీతో ప్రేమలో పడడానికి అనేక కారణాలు ఉంటాయి. మీలో కొన్ని లక్షణాలు వారిని ఆకట్టుకుంటాయి. అవి వారి గుండె లయను తప్పేలా చేస్తాయి. అదే మీలో ఏదో తెలీని ఆకర్షణ ఉంది.. అనుకునేలా చేస్తుంది. అది వారిని మీ మాయలో పడేస్తుంది. వాటిల్లో ముఖ్యమైనవి మీ కళ్ళు, ముక్కు, చూపులు లేదా మీ ఫన్నీ నవ్వు ఉండొచ్చు. పురుషులు మిమ్మల్ని చాలా క్షుణ్ణంగా గమనిస్తారు. ఒకవేళ మిమ్మల్ని గమనిస్తున్న వ్యక్తిని మీరూ ఇష్టపడితే.. ఇంకా ఆలోచించకండి. మీలో దేనికి అతను ఫిదా అవుతున్నాడో తెలుసుకుని మరింతగా రెచ్చగొట్టండి. అవేంటో చూడండి.. 

చిరునవ్వు : నిజాయితీతో కూడిన స్వచ్ఛమైన చిరునవ్వు ఓ వ్యక్తి వెంటనే మీ ఆకర్షణలో పడేలా చేస్తుంది. ఎందుకంటే ప్రజలు ఇతరుల గురించి గమనించే మొదటి విషయం చిరునవ్వు. పళ్లు సరిగా లేవనో, చిగుర్లు కనిపిస్తాయనో చాలామంది హాయిగా నవ్వరు. అలా కాకుండా వాటని పట్టించుకోకుండా సహజంగా నవ్వడాన్ని పురుషులు ఇష్టపడతారు. ఎప్పటికప్పుడు అందమైన చిరునవ్వును మెరిపించడం ద్వారా మీ సంతోషకరమైన స్థితిని చూపించండి.  అతను ఇప్పటికే మీ దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నట్లైతే మీరు సక్సెస్ అయినట్టే. 


కళ్ళు : కళ్లు చాలా భావాల్ని పట్టిస్తాయి. 'కళ్ళు మీ ఆత్మకు కిటికీలు' అని కూడా చెబుతారు. ఇది పూర్తిగా నిజం ఎందుకంటే చాలామంది ఎదుటి వ్యక్తులు కళ్ల కంటే ముందు కళ్ళు గమనిస్తారని అనుకుంటారు. ఒక వ్యక్తి మీ కళ్ళను గమనిస్తే, అతను మీతో కళ్లలో కళ్లు పెట్టి చూడాలనుకుంటున్నాడని.. మిమ్మల్ని ఇష్టపడుతున్నాడని అర్థం. 

ఆటిట్యూడ్ : మీరు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నారనే కూడా అబ్బాయిలు మీ గురించి మొదటిసారి గమనించే విషయం. మీ ప్రవర్తన, వైఖరి మీరు ఇతరులతో ఎలా వ్యవహరిస్తారనే దాని గురించి తెలియజేస్తాయి. దయ, గౌరవం లేదా నిర్లక్ష్యంతో ప్రవర్తించినట్లైతే... మీ చెడు ప్రవర్తన మీ అందమైన ముఖాన్ని కవర్ చేయలేదు.

ఆసక్తికరంగా, అబ్బాయిలు మీరెంత నిటారుగా ఉంటారో, ఎలా నడుస్తారో గమనిస్తారు. ఇష్టపడతారు. మంచి, నమ్మకమైన నడక అనేది చాలా మంది పురుషులకు గేమ్ ఛేంజర్. నడకలో అలసత్వం, సోమరితనం కొన్నింటిని ఆపివేస్తుంది. అందుకే లేడీస్, స్టైల్‌గానడవండి, తలెత్తుకుని ఆత్మ విశ్వాసంతో నడవండి.

జుట్టు : మీ నుంచి వచ్చే దుర్వాసన, అపరిశుభ్రమైన జుట్టు ఏ వ్యక్తిని ఆకర్షించదు. చక్కటి మెరిసే జుట్టు, ఆ జుట్టు తళతళలను పురుషులు చాలా ఇష్టపడతారు. ఎందుకంటే చక్కటి కేశసంరక్షణ పద్ధతి మిమ్మల్ని మీరు చూసుకోగలరని, మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరి అవసరం లేదనే అభిప్రాయాన్ని వారికి కలిగిస్తుంది. రోమ్-కామ్ సినిమాలు చూపించినట్లుగా, వెనక్కి తిరిగేటప్పుడు మీ జుట్టు ఒక అలా అలా గాల్లోకి ఎగరడం కచ్చితంగా అతని దృష్టిని ఆకర్షిస్తుంది.

జుట్టు : మీ నుంచి వచ్చే దుర్వాసన, అపరిశుభ్రమైన జుట్టు ఏ వ్యక్తిని ఆకర్షించదు. చక్కటి మెరిసే జుట్టు, ఆ జుట్టు తళతళలను పురుషులు చాలా ఇష్టపడతారు. ఎందుకంటే చక్కటి కేశసంరక్షణ పద్ధతి మిమ్మల్ని మీరు చూసుకోగలరని, మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరి అవసరం లేదనే అభిప్రాయాన్ని వారికి కలిగిస్తుంది. రోమ్-కామ్ సినిమాలు చూపించినట్లుగా, వెనక్కి తిరిగేటప్పుడు మీ జుట్టు ఒక అలా అలా గాల్లోకి ఎగరడం కచ్చితంగా అతని దృష్టిని ఆకర్షిస్తుంది.

Latest Videos

click me!