Chahal and Dhanashree ఔను.. వీళ్లు విడిపోతున్నాారు: యుజువేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ క్లారిటీ!

Published : Feb 21, 2025, 09:47 AM IST

నెలలకొద్దీ వస్తున్న ఊహాగానాలకు తెర పడింది. భారత క్రికెటర్ యుజువేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ తాము విడిపోతున్నామంటూ అధికారికంగా ప్రకటించారు. నాలుగేళ్ల పెళ్లి బంధాన్ని ముగిస్తున్నట్టు సామాజిక మాధ్యమాల ద్వారా ధ్రువీకరించారు. 

PREV
13
Chahal and Dhanashree ఔను.. వీళ్లు విడిపోతున్నాారు: యుజువేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ క్లారిటీ!
పుకార్లకు తెర

అంతా ఊహించిందే జరిగింది. యుజువేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ మధ్య చాలా గ్యాప్ పెరిగిందనీ, త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారని 14 నెలలుగా పుకార్లు వచ్చాయి. వీటిని ఈ ఇద్దరూ కొన్నాళ్లు కొట్టిపడేశారు. తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఒకర్నొకరు అన్ ఫాలో అయ్యారు. చివరికి మేం విడిపోతున్నాం అంటూ ప్రకటించారు.

23

విడిపోయిన తర్వాత ధనశ్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేసింది. భగవంతుడిని నమ్మనని, బాధల నుంచి ఉపశమనం కలగనుందని తెలిపింది. త్వరలోనే ఈ ఇద్దరూ  కోర్టు మెట్లు ఎక్కనున్నారు.  చాహల్, ధనశ్రీ ఒకరినొకరు గతంలోనే సామాజిక మాధ్యమాల్లో ఒకర్నొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. చాహల్ తన ఫోటోలను కూడా తొలగించాడు. ధనశ్రీ తన పేరు నుండి ‘చాహల్’ను తీసేసింది.

33

ధనశ్రీ తన మనసులోని బాధను ఎప్పుడూ బయటికి చెప్పలేదు. అన్నింటికీ మౌనంగా ఉంది. అయితే మౌనంగా ఉండటం బలహీనత కాదని ఆమె ఇన్స్టాా పోస్ట్ లో తెలిపింది. అయితే తాజా వాళ్లు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు  అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఒకర్నొకరు సున్నితంగా నిందిస్తున్నట్టుగా ఉన్న వ్యాఖ్యలు చేసుకోకుండా ఉండాల్సింది అని అభిమానులు అంటున్నారు.

click me!

Recommended Stories