యూట్యూబ్ మొదట్లో డేటింగ్ యాపా..! అప్పుడు దీని పేరేంటో తెలుసా?

First Published | Aug 29, 2024, 12:51 PM IST

యూట్యూబ్ మొదట డేటింగ్ యాప్ అని మీకు తెలుసా? దాని పాత పేరు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

యూట్యూబ్ గురించి ఈ ఆసక్తికర విషయం తెలుసా?

ప్రస్తుతం యూట్యూబ్ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన యాప్. ఇందులోని లక్షలాది వీడియోలు యావత్ ప్రపంచాన్ని అలరిస్తున్నాయి. 

యూట్యూబ్ గురించి ఈ ఆసక్తికర విషయం తెలుసా?

ఈ టెక్నాలజీ యుగంలో చేతిలో స్మార్ట్ ఫోన్, అందులో యూట్యూబ్ లేనివారు లేదనడం అతిశయోక్తి కాదు. ఇంతలా ఉపయోగిస్తున్న ఈ యూట్యూబ్ గురించి చాలా మందికి తెలియని అనేక విషయాలు ఉన్నాయి.

Latest Videos


యూట్యూబ్ గురించి ఈ ఆసక్తికర విషయం తెలుసా?

అసలు ఈ యూట్యూబ్ ను ఎప్పుడు ప్రారంభించారో తెలుసా? ఫ్రిబ్రవరి 14, 2005 అంటే వాలెంటైన్స్ డే రోజున యూట్యూబ్ సేవలు ప్రారంభమయ్యాయి.  చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు దీన్ని ప్రారంభించారు. 

యూట్యూబ్ గురించి ఈ ఆసక్తికర విషయం తెలుసా?

ప్రస్తుతం సరికొత్త వీడియోలతో అలరిస్తున్న యూట్యూబ్ మొదట్లో ఓ డేటింగ్ యాాప్. "ట్యూన్ ఇన్ హుక్ అప్". పేరుతో మొదట్లో డేటింగ్ యాప్ గా రూపొందించారు వ్యవస్థాపకులు. అందమైన అమ్మాయిలు తమ వీడియోలను ఇందులో అప్ లోడ్ చేయాలని ...ఇందుకోసం 100 డాలర్లు ఇస్తామని కూడా ప్రకటన ఇచ్చారు. కానీ ప్రజల నుండి అంతగా స్పందన రాకపోవడంతో ఎలాంటి వీడియోలనైనా అప్ లోడ్ చేసే అవకాశం కల్పించారు. దీంతో యూట్యూబ్ ఊపందుకుని ప్రజల్లోకి వెళ్ళింది. 

యూట్యూబ్ గురించి ఈ ఆసక్తికర విషయం తెలుసా?

ఈ యూట్యూబ్ భవిష్యత్ లో ప్రపంచాన్ని ఊపేస్తుందని ముందే గ్రహించారో ఏమోగానీ గూగుల్ దీన్ని కొనుగోలుచేసింది. కేవలం ప్రారంభించిన 18 నెలల్లోనే ఏకంగా 1.65 బిలియన్ డాలర్లు వెచ్చించి యూట్యూబ్ ను కొనుగోలు చేసింది గూగుల్. ఇలా నవంబరు 2006 నుండి గూగుల్ ఆధీనంలో యూట్యూబ్ ప్రస్ధానం ప్రారంభమయ్యింది. 

యూట్యూబ్ గురించి ఈ ఆసక్తికర విషయం తెలుసా?

ప్రస్తుతం యూట్యూబ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పటివరకు యూట్యూబ్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన అంశం  'హౌ టు కిస్' అలాగే అత్యంత ప్రజాదరణ పొందిన ట్యుటోరియల్ 'హౌ టు టై ఎ టై'. 

click me!