సెప్టెంబర్‌లో ఈ 5 పనులు చేయడం మర్చిపోతే ఇబ్బందులు తప్పవు

First Published | Aug 29, 2024, 12:17 PM IST

సెప్టెంబర్‌ నెలలో ముఖ్యంగా గుర్తు పెట్టుకొని చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఇవి మీకు ఎంతో ఉపయోగపడతాయి. వాటిని ఈ నెలలోనే ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేసేయండి. అవేంటంటే ఆధార్ కార్డ్‌ల అప్‌డేట్‌, క్రెడిట్ కార్డ్ పరిమితులు, LPG సిలిండర్ రేట్ల మార్పులు తెలుసుకోవడం మొదలైనవి. ఇవి తెలుసుకోవడం వల్ల మీ బడ్జెట్ నిర్వహణకు చక్కటి ప్రణాళిక ఏర్పడుతుంది. అలాంటి అయిదు ఇంపార్టెంట్‌ మార్పులు, గడువుల వివరాలు మీకోసం..

1.  ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు ముగుస్తోంది

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రతి ఒక్కరూ ఆధార్‌లో వివరాలు అప్‌డేట్‌ చేసుకోమని ఇప్పటికే ప్రకటించింది. దీనికి గడువు కూడా పెంచింది. జూన్ 14 నుండి సెప్టెంబర్ 14, 2024 వరకు గడువు ఇచ్చింది. జనాభా సమాచారంలో కచ్చితత్వం కోసం ఆధార్‌ అప్‌డేట్ ను కేంద్రం కోరుతోంది.  దీనికి సంబంధించిన గడువు ఈ నెలలోనే 14వ తేదీతో ముగియనుండటంతో అందరూ తప్పక ఆధార్‌ అప్‌డేట్ చేయించుకోవాలి. దీన్ని ఆన్‌లైన్‌లో అవసరమైన ధృవపత్రాలు సమర్పించి చేయవచ్చు. లేదా సమీపంలోని సచివాలయాలు, మీసేవా కేంద్రాల్లో అప్‌డేట్‌ చేయించవచ్చు. 
 

2. LPG సిలిండర్‌ల ధరలో మార్పులు

సెప్టెంబరులో LPG సిలిండర్‌ల ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఈ ధరల్లో వ్యత్యాసాలు తెలుసుకోవడం ద్వారా మీ బడ్జెట్‌ నిర్వహణకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్‌లను ఉపయోగించే వ్యాపారాలు ధరల్లో మార్పుల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి.
 


3. ఇంధన ధరల్లో మార్పులు

విమానం టర్బైన్ ఇంధనం(ATF), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(CNG-PNG) ధరల్లో మార్పులు సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వస్తాయని అంచనా. ఈ సర్దుబాట్లు రవాణా ఖర్చులపై ప్రభావం చూపవచ్చు. అంతేకాకుండా ఉత్పత్తుల ధరలపైనా ప్రభావం చూపే అవకావం ఎక్కువగా ఉంది. అందువల్ల విమాన ఇంధనం ధరలు, సీఎన్‌జీ గ్యాస్‌ ధరలు పెరిగితే మనకేంటి అనుకోకుండా వీటి ధరల పెరుగుదలపై దృష్టి పెట్టండి. 
 

4. మోసపూరిత కాల్‌లపై చర్యలు..

సెప్టెంబర్ 1 నుండి మోసపూరిత కాల్‌లు, సందేశాలను ఆపడానికి కేంద్రం కొత్త చర్యలు తీసుకుంటోంది. TRAI నిబంధనల ప్రకారం, భద్రతను మెరుగుపరచడానికి, స్పామ్‌ను తగ్గించడానికి టెలిమార్కెటింగ్ సెప్టెంబర్ 30 నాటికి బ్లాక్‌చెయిన్ ఆధారిత సిస్టమ్‌కి మారుతుంది. సెప్టెంబర్‌లో మోసపూరిత కాల్స్‌ వస్తే వెంటనే అప్రమత్తమవ్వండి.

5. కొత్త క్రెడిట్ కార్డ్ చట్టాలు తెలుసుకోండి..

సెప్టెంబర్‌లో HDFC బ్యాంక్ యుటిలిటీ లావాదేవీల కోసం రివార్డ్ పాయింట్‌లను పరిమితం చేస్తుంది. IDFC ఫస్ట్ బ్యాంక్ చెల్లింపు షెడ్యూల్‌లను మారుస్తోంది. కొత్త క్రెడిట్ కార్డ్ చట్టాలలో ఇవి కేవలం రెండు మాత్రమే. అప్‌గ్రేడ్‌లు కార్డ్ హోల్డర్‌లు పాయింట్‌లను ఎలా పొందుతాయో, రీడీమ్ చేసుకుంటారనే దానిపై ప్రభావం చూపుతాయి. వీటిపై దృష్టిసారించండి.
 

Latest Videos

click me!