Gold Haaram: ఇలాంటి అందమైన బంగారు హారాలు మీ దగ్గర ఒక్కటైనా ఉండాల్సిందే.. చూస్తే వావ్ అనేలా ఉంటాయి

Published : Jun 18, 2026, 11:31 AM IST

Gold Haaram: మీకు బంగారు హారాలంటే ఇష్టమా?  పెళ్లిళ్లకు ఇలా రాయల్ నెక్లెస్ వేసుకుంటే ఎంతో అందంగా కనిపిస్తారు. ఇక్కడ జోధా హారాల డిజైన్లు ఇచ్చాము. కుందన్, మల్టీ లేయర్ జోధా హారాలు… లెహంగాలు, చీరలపై అదిరిపోతాయి.

PREV
15
జోధా బంగారు హారాలు ఎందుకంత ప్రత్యేకం?

పెళ్లిళ్లు, పండుగలకు మెడలో బంగారు హారాలు వేసుకోవడం ప్రతి మహిళకు అందం. ఇక్కడ మేము జోధా హారాల డిజైన్లు ఇచ్చాము. ఇవి రాచరిక సంప్రదాయానికి, భారతీయ హస్తకళకు నిలువుటద్దంలాంటివి. కుందన్, పోల్కి, ముత్యాలు, రంగురాళ్లతో అలంకరించిన ఈ హారాలు మహిళల అందాన్ని రెట్టింపు చేస్తుంది. 

25
కుందన్ వర్క్‌తో జోధా హారం

జోధా హారం ఎంతో ప్రత్యేకమైనది.  దానిపై చేసే సూక్ష్మమైన పనితనం ఎంతో గొప్పగా ఉంటుంది. చాలా హారాల డిజైన్లలో కుందన్, పోల్కి, ముత్యాలు, రంగురంగుల రాళ్లను అందంగా ఉపయోగిస్తారు. ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు రాళ్లతో అలంకరించిన ఈ హెవీ కుందన్ జోధా హారం బెనారసీ చీరలపై చాలా క్లాసీగా కనిపిస్తుంది.

35
గోల్డ్, ఎమరాల్డ్ స్టోన్ జోధా హారం

గోల్డ్ బేస్‌తో తయారు చేసిన ఎమరాల్డ్ (పచ్చల) రాళ్ల జోధా హారాలు ఎంతో అందంగా ఉంటాయి. వీటిలో ఆకుపచ్చ డ్రాప్లెట్స్, పారదర్శక కుందన్ రాళ్లతో కనిపిస్తుంది. మెడకు అతుక్కుని ఉండే ఈ చోకర్ స్టైల్ జోధా హారం ఎవరికైనా మరింత అందాన్ని తెస్తుంది. ఇది చీర, లెహంగా, పట్టు వస్త్రాలపై అద్భుతంగా ఉంటుంది.

45
గోల్డ్ ప్లేటెడ్ జోధా హారం

మీకు పూర్తిగా బంగారంతో మాత్రమే చేసిన హారం కావాలంటే ఇలాంటిది ఎంపిక చేసుకోవచ్చు.  గుండ్రని ఆకారం, ఫ్లోరల్ డిజైన్ లేదా టెంపుల్ జ్యువెలరీ స్టైల్‌లో లభించే ఈ హారాలు చూడటానికి చాలా రాయల్‌గా ఉంటాయి. మీ లుక్‌ను మరింత ప్రత్యేకంగా మారుస్తాయి.

55
మల్టీ లేయర్ జోధా హారం

మల్టీ లేయర్ జోధా హారం బ్రైడల్ జ్యువెలరీలో ఉండాల్సిందే. ఇందులో చాలా లేయర్లు ఉండటం వల్ల ఇది చాలా రిచ్‌గా కనిపిస్తుంది. చిన్న చిన్న గోల్డ్ చైన్లు, ముత్యాల వరుసలు లేదా మూడు లేయర్ల డిజైన్లు మెడను చాలా అందంగా చూపిస్తాయి.  జోధా హారం లెహంగా, బెనారసీ చీర, పట్టు చీర, అనార్కలీ సూట్‌లతో చాలా రాయల్ లుక్‌ను ఇస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories