ఇలా పడుకుంటే ఎన్ని లాభాలో..

Published : Mar 17, 2022, 02:56 PM IST

Sleeping Sideways: మన నిద్ర గంటలపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్న సంగతి మనందరికీ తెలిసిందే.. మరి ఎలా పడుకుంటే  మన హెల్త్ కు మంచిదో తెలుసా..? 

PREV
18
ఇలా పడుకుంటే ఎన్ని లాభాలో..

Sleeping Sideways: ఆరోగ్యం బాగుండటానికి పోషకాహారం ఎంత అవసరమో.. కంటి నిండ నిద్ర కూడా అంతే అవసరం. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అదీకాక అర్థరాత్రుల్ల వరకు ఫోన్లు, ల్యాప్ టాప్ లు పెట్టుకుని టైంపాస్ చేస్తున్నారు. నిద్రపోకపోతే.. ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు, నిద్రలేమి వంటి సమస్యల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

28

పడుకోవడం ఎంత ముఖ్యమో ఎలా పడుకుంటున్నామన్నది కూడా అంతే ముఖ్యంటున్నారు నిపుణులు. కొంత మంది బోర్లా పడుకుంటే, మరికొంత మంది వెల్లకిలా పడుకుంటూ ఉంటారు. వీటికంటే పక్కకి తిరిగి పడుకోవడం వల్లే ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేంటంటే.. 

38

గురక రాదు:  గురక వల్ల ఇంటిల్లిపాదికి రాత్రంతా జాగారమే. గురక శబ్దం అలా ఉంటుంది మరి. అయితే గురక సమస్య ఉన్న వాళ్లు పక్కకి తిరిగి పడుకుంటే గురక వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వెల్లకిలా పడుకుంటే వాయుమార్గం ఇరుగుకా మారుతుంది. దాంతో శ్వాస ఆడక గురక మొదలవుతుంది. అయితే పక్కకి తిరిగి  పడుకుంటే శ్వాస మార్గంలో ఎలాంటి ఇబ్బందులు రావు. దాంతో గురక కూడా రాదు. 

48

స్లీప్ అప్నియా: స్లీప్ అప్నియా ప్రమాదకరమైన వ్యాధి.  ఈ సమస్య బారిన పడిన వాళ్లు నిద్రలోనే చనిపోయే ప్రమాదం ఉది. ఈ సమస్య ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్, అధిక రక్తపోటు, ఉబ్బసం, టైప్ 2 డయాబెటిస్ రోగులకే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ స్లీప్ అప్నియా రుగ్మత బారిన పడకుండా ఉండాలంటే పక్కకి తిరిగి పడుకోవాలి. పక్కకి తిరిగి పడుకోవడం వల్ల మరో బెనిఫిట్ కూడా ఉంది. సైనస్ నొప్పి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 

58

వెన్ను నొప్పి: ప్రస్తుత కాలంలో వెన్ను నొప్పి సమస్యతో బాధపడే వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. ఈ నొప్పి అంత మామూలుగా వదిలిపోదు. అయితే పక్కకి తిరిగి పడుకుంటే వెన్ను నొప్పి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇలా పడుకుంటే ఈ నొప్పి వచ్చే అవకాశం తగ్గుతుందట. ఇలా పడుకుంటే భుజం నొప్పి కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

68

జీర్ణక్రియకు మేలు: తిన్నవెంటనే పడుకోవడం ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు. ఇలా పడుకుంటే గొంతులోకి గ్యాస్ ఆమ్లాలు వస్తాయట. అయితే తిన్న ఒక అరగంట తర్వాత పక్కకి తిరిగి పడుకుంటే ఆహారం పొట్టలో సరైన ప్లేస్ లో ఉంటుంది. దీంతో జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది.

78

మెదడుకు అవసరం:  మెదడులోని టాక్సిన్లు బయటకుపోవాలంటే మనం పక్కకి తిరిగి పడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇలా పడుకోవడం వల్ల అల్జీమర్స్ వ్యాధి తగ్గుతుంది. 
 

88

గర్భిణులకు: గర్భిణుల పొట్ట చిన్నగా ఉన్నా.. పెద్దగా ఉన్నా.. వెల్లకిలా పడుకునే కంటే పక్కకి తిరిగి పడుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వెల్లకిలా పడుకుంటే తల్లికీ బిడ్డకి చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే పక్కకి తిరిగి పడుకోవడం వల్ల కడుపులో ఉండే బిడ్డ, తల్లి హార్ట్ లకు  Blood circulation బాగా జరుగుతుంది. 

   

 

click me!

Recommended Stories