మగాళ్లు ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే శృంగారంలో రెచ్చిపోవడమే...

First Published Mar 17, 2022, 1:57 PM IST
Parenting Tips: సంతానం కోసం కేవలం ఆడవారే కాదు.. మగవారు కూడా తినే ఆహారంపై దృష్టి పెట్టాలి. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు మగవారిలో స్పెర్మ్ కౌంట్ ను పెంచుతాయి. అవేంటంటే.. 

గుడ్లు: గుడ్డు బలమైన ఆహారం. ఇందులో ఎన్నో పోషకవిలువలు ఉంటాయి. అంతేకాదు సంతానోత్పత్తి సమస్యకు ఇది చెక్ పెడుతుంది. ప్రతిరోజూ ఒక గుడ్డును తినడం వల్ల పురుషుల్లో శుక్ర కణాల సంఖ్య బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

అరటి పండ్లు: అరటిపండులో విటమిన్ సి, బి1, ప్రోటీన్లు, మెగ్నీషియం మెండుగా ఉంటాయి. వీటిని పురుషులు తరచుగా తింటే శుక్రకణాల సంఖ్య బాగా పెరుగుతుంది. ఈ పండులో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమే శుక్రకణాల సంఖ్యను పెంచుతుంది. 
 

టమాటా: టమాటాలు కూరలకు రుచిని ఇవ్వడమే కాదు వీటిని తరచుగా ఆహారంలో తీసుకుంటే స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుందట. ఇందులో ఉండే లైకోపీన్, విటమిన్ సి లే శుక్రకణాల పెరుగుదలకు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. 
 

దానిమ్మ: దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.  ఇవి శుక్రకణాలకు ఎటువంటి హానీ జరకగకుండా చూసుకుంటాయి. 

వెల్లుల్లి: వెల్లుల్లి కూరలకు టేస్ట్ ను ఇవ్వడమే కాదు స్పెర్మ్ కౌంట్ పెరగడానికి కూడా సహాయపడతాయి. ఇందులో ఉండే సెలీనియం అనే ఎంజమే శుక్రకణాల ఉత్తత్తికి సహాయపడుతుంది. 

పాలకూర: పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. అయితే పాలకూరలో ఉండే పోలీ ఎలిమెంట్స్ శుక్రకణాల కౌంట్ ను పెంచడానికి కూడా సహాయపడతాయి. అంతేకాదు ఇది  ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. 
 

బెర్రీస్:  క్రాన్ బెర్రీస్, స్ట్రాబెర్రీలల్లో యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ను బయటకు  పంపడానికి ఎంతో సహాయపడతాయి. అంతేకాదు ఇవి శుక్రకణాల ఉత్తత్తిని కూడా పెంచుతాయి. 

క్యారెట్: క్యారెట్స్ లల్లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పించి , శుక్రకణాల సంఖ్యను పెంచడానికి దోహాదపడతాయి.  
 

click me!