ఏసీ రూం లో ఎక్కువసేపు ఉంటే ఏమౌతుందో తెలుసా?

First Published | Jun 19, 2024, 2:45 PM IST

మండుతున్న ఎండలకు ఏసీలను, కూలర్లను పొద్దంతా వాడుతూనే ఉంటారు. ముఖ్యంగా చాలా మంది ఏసీ గదుల్లోంచి బయటకు రారు. కానీ ఏసీ గదుల్లో ఎక్కువ సేపు ఉంటే ఏమౌతుందో తెలుసుకుందాం పదండి. 
 

చర్మం పొడిబారడం

ఏసీలో ఎక్కువ సేపు కూర్చుంటే చర్మం సంబంధిత సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎయిర్ కండిషనింగ్‌కు ఎక్కువగా గురికావడం వల్ల మన చర్మం పొరలు, పొరలుగా మారుతుంది. చర్మం పొడిబారుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే ఇది అలెర్జీలు, చాలా సేపటి వరకు దురద సమస్య వస్తుంది. 
 

శ్వాస సంబంధిత సమస్యలు

మండుతున్న ఎండలకు ఏసీ రూం చల్లగా ఉంటుంది. దీంతో ఈ రూముల్లోంచి చాలా మంది బయటకు కూడా వెల్లరు. కానీ ఏసీ గదుల్లో ఎక్కువ సేపు ఉండడం వల్ల గొంతు పొడిబారుతుంది. అలాగే నాసికా రద్దీ, శ్లేష్మ పొరలలో మంట వంటి సమస్యలు కూడా వస్తాయి. 


డీహైడ్రేషన్

ఏసీ గదుల్లో ఎక్కువ సమయం ఉండటం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎలా అంటే ఏసీలు గాలి నుంచి తేమను పీల్చుకుని శరీరాన్ని డీహైట్రేట్ చేస్తాయి. అలాగే ఏసీ గదుల్లో ఉండటం వల్ల దాహం అసలే వేయదు. 

 తలనొప్పి

AC గదుల్లో ఎక్కువ సేపు ఉండటం వల్ల తలనొప్పి వస్తుందని. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది మైగ్రేన్‌కు కూడా దారితీస్తుంది. 

నీరసం, బద్దకం

ఎయిర్ కండిషనర్లు ఉన్న గదులు చాలా కంఫర్ట్ గా ఉంటాయి. వీటిలో ఉంటే ఎటూ కదలాలనిపించదు. కానీ ఇది మిమ్మల్ని నీరసంగా, బద్దకంగా మారుస్తుంది. ఎక్కువసేపు ఏసీలో ఉండే వ్యక్తులు యాక్టివ్‌గా ఉండాలనే ఉత్సాహాన్ని కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు.
 

బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ

ఎయిర్ కండిషన్డ్ రూముల్లో ఎక్కువ సేపు ఉండటం వల్ల మీ రోగనిరోధక శక్తి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏసీ గదుల్లో ఉంటే ఇమ్యూనిటీ పవర్ ను  బలహీనపరిచే సూర్యరశ్మి, స్వచ్ఛమైన గాలి వంటి సహజ అంశాలకు మీకు అందవు. దీంతో మీ ఇమ్యూనిటీ పవర్ చాలా వరకు తగ్గుతుంది. 

కీళ్లలో నొప్పి

ఏసీ నుంచి వచ్చే చల్లని గాలిలో ఎక్కువ సేపు ఉండటం వల్ల మీ ఎముక సాంద్రత బాగా తగ్గుతుంది. ఇది కీళ్లలో నొప్పి,  కండరాల తిమ్మిరికి దారితీస్తుంది. 
 

Latest Videos

click me!