ఈ యానిమల్ యోగా పోజులు.. ఎలాంటి మ్యాజిక్ చేస్తాయో తెలుసా?

First Published | Jun 15, 2024, 10:05 AM IST

ఈ కింది యానిమల్ పోజులను వేయడం వల్ల... మీరు ఊహించని ప్రయోజనాలు పొందగలరు. ఈ యానిమల్ యోగా పోజులు మీ ఆరోగ్యంపై మ్యాజిక్ లా పని చేస్తాయి. అవేంటో ఓసారి చూద్దాం...
 

యోగా గురించి మనం స్పెషల్ గా  చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని నమ్ముతారు. యోగాను శారీరక వ్యాయామం గా మాత్రమే చూడలేం. మానసిక ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. యోగాలో చాలా పోజులు ఉంటాయి.  ఒక్కో భంగిమ వల్ల మనకు ఒక్కో ప్రయోజనం చేకూరుతుంది. అయితే.. ఈ కింది యానిమల్ పోజులను వేయడం వల్ల... మీరు ఊహించని ప్రయోజనాలు పొందగలరు. ఈ యానిమల్ యోగా పోజులు మీ ఆరోగ్యంపై మ్యాజిక్ లా పని చేస్తాయి. అవేంటో ఓసారి చూద్దాం...
 

1.ఫిజ్ పోజ్...(మత్స్యాసనం)
ఫిష్ పోజ్.. అచ్చం చేప ఆకారంలో ఉండటమే. ఈ భంగిమ చేయడం చాలా సులువు. ఈ భంగిమ చేయడం వల్ల.. థైరాయిడ్ సమస్య తగ్గిపోతుంది. ఈ రోజుల్లో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఒక్కసారి థైరాయిడ్ వచ్చింది అంటే... సంవత్సరాల పాటు ట్యాబ్లెట్స్ మింగడమే అయిపోతుంది. కానీ.. ఈ చేప ఆకారంలో యోగా చేయడం వల్ల ఈ థైరాయిడ్ సమస్యకు పరిష్కారం దొరికినట్లే.
 

Latest Videos


Cobra Pose

2.కోబ్రా పోజ్..( భుజంగాసనం)..
ఈ ఫోటో చూస్తే ఈ కోబ్రా పోజ్ ఎలా చేయాలో స్పెషల్ గా వివరించాల్సిన అవసరం లేదు. చేయడం చాలా సింపుల్. కానీ... ఈ యోగా పోజు వల్ల కలిగే లాభాలను మాత్రం మీరు ఊహించలేరు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒత్తిడితో బాధపడుతున్నారు. అలాంటి ఒత్తిడిని ఈ యోగా భంగిమ ఇట్టే తగ్గించేస్తుంది. నడుము నొప్పి సమస్యను కూడా తగ్గిస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం సమస్యను కూడా తగ్గిస్తుంది.
 

Cat-Cow Pose

3.గోముఖాసనం( కౌ పోజ్)...
గోముఖాసనం అంటే... ఆవు భంగిమ అని అంటారు.  ఆవును మనం ప్రశాంతత, సౌమ్యతకు చిహ్నంగా భావిస్తాం. ఈ యోగా పోజు చేయడం వల్ల కూడా.. మనకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆందోళనలను కూడా తగ్గిస్తుంది.
 

downward dog pose


4.డాగ్ పోజ్  (అధో ముఖ స్వనాసన)
డాగ్ పోజ్.. దీనినే అధో ముఖ స్వనాసన అని కూడా పిలుస్తారు. కుక్క పడుకున్నట్లుగా ఈ పోజు ఉంటుంది. శరీరాన్ని సాగదీసి ముందుకు పడుకోవడమే. ఈ యోగా పోజ్ ని తరచూ చేయడం వల్ల...  వెన్నెముక ఆరోగ్యంగా ఉంటుంది.  రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

5.బటర్ ఫ్లై పోజ్...

సీతాకోకచిలుక భంగిమ, లేదా బాధకోనసనా, సున్నితమైన , అందమైన సీతాకోకచిలుకచే ప్రేరణ పొందింది. ఈ భంగిమ  వశ్యతను మెరుగుపరచడానికి , ఉద్రిక్తత నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఈ యోగా పోజు వేయడం వల్ల.. పీరియడ్స్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. 
 

click me!