యోగా ఉదయమే చేయాలా..? సాయంత్రం చేయకూడదా?

First Published Jun 14, 2024, 5:20 PM IST

 ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను యోగా సహాయంతో తరిమి కొట్టొచ్చు. అయితే.. చాలా మంది యోగా అంటే ఉదయం మాత్రమే చేయాలి అనుకుంటారు. దీనిలో నిజమెంత..? యోగా ఉదయం మాత్రమే చేయాలా..? సాయంత్రం చేస్తే ప్రయోజనం ఉండదా..? దీనిపై నిపుణులు ఏమంటున్నారో చూద్దాం...
 

యోగా ఆరోగ్యానికి చాలా మంచిది అనే విషయం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. రోజూ యోగా చేయడం వల్ల మనం చాలా ఉత్తేజంగా ఉంటాం. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను యోగా సహాయంతో తరిమి కొట్టొచ్చు. అయితే.. చాలా మంది యోగా అంటే ఉదయం మాత్రమే చేయాలి అనుకుంటారు. దీనిలో నిజమెంత..? యోగా ఉదయం మాత్రమే చేయాలా..? సాయంత్రం చేస్తే ప్రయోజనం ఉండదా..? దీనిపై నిపుణులు ఏమంటున్నారో చూద్దాం...
 

చాలా మంది సమయం కుదరక ఉదయం కాకుండా సాయంత్రం యోగా చేస్తూ ఉంటారు. అయతే.. ఉదయం చేయడం వల్ల ఎంత ప్రయోజనం ఉందో... సాయంత్రం యోగా చేయడం వల్ల కూడా అంతే ప్రయోజనం ఉందట. సాయంత్రం యోగా చేయడం వల్ల  మానసిక ప్రశాంతతకు, మంచి నిద్రకు దారితీస్తుంది. కాబట్టి ఈవెనింగ్ యోగా చేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దాం.
 

సాయంత్రం యోగా ప్రయోజనాలు

ఒత్తిడిని తగ్గిస్తుంది: మీరు రోజంతా అలసిపోతే, సాయంత్రం యోగా చేయడం వల్ల ఆ రోజు అలసట, ఒత్తిడి మరియు ఆందోళన నుండి బయటపడవచ్చు. దీనివల్ల రాత్రిపూట బాగా నిద్రపోవచ్చు.
 

సాయంత్రం యోగా  ప్రయోజనాలు

కోపాన్ని తొలగిస్తుంది: మీరు పగటిపూట ఏదైనా కోపంగా ఉంటే యోగా ద్వారా సాయంత్రం దాన్ని వదిలించుకోవచ్చు. ఇది మీ మనస్సును ప్రశాంతపరుస్తుంది మరియు మీరు ఒత్తిడి లేకుండా ఉంటారు.


సాయంత్రం యోగా ప్రయోజనాలు

టైమ్ మేనేజ్‌మెంట్: మీరు చాలా సమయం ఉదయం పనికి వెళ్లి యోగా చేయలేరు. దీనికోసం షెడ్యూల్‌ రూపొందించుకున్నా.. పాటించడం కష్టం. అందుకని, సాయంత్రం ఎక్కువ సమయం ఉన్నందున ఎలాంటి గందరగోళం లేకుండా ఆ సమయంలో యోగా చేయండి.

Latest Videos

click me!