Teeth Cleaning: పళ్లను ఇలా తోమితే తెల్లగా మెరిసిపోతాయి తెలుసా..

Published : Apr 22, 2022, 02:43 PM IST

Teeth Cleaning: ప్రతి రోజూ రెండు సార్లు పళ్లను సరిగ్గా తోమినా.. కొందరి దంతాలు పసుపు పచ్చగానే ఉంటాయి. అయితే పళ్లపై పసుపు పచ్చదనం పోవాలంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.   

PREV
17
Teeth Cleaning: పళ్లను ఇలా తోమితే  తెల్లగా మెరిసిపోతాయి తెలుసా..

Teeth Cleaning: ప్రతి ఒక్కరూ తమ శరీరంలోని అన్ని భాగాలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ దంతాలపై అంత ఇంట్రెస్ట్ చూపరు. దీంతో కొందరి పళ్లు తెల్లదనం పోయి పసుపు పచ్చ కలర్ లోకి మారిపోతుంటాయి. వన్స్ దంతాలు పసుపు కలర్ లోకి మారిన తర్వాత ఎంతసేపు బ్రష్ చేసినా.. అవి మళ్లీ తెలుపు రంగులోకి రావు. ఈ విషయం చాలా మందికి తెలుసు. 

27

రోజుకు రెండు పూటలా సరిగ్గా బ్రష్ చేసినా.. పసుపు పచ్చ పళ్లు తెల్లబడకపోవచ్చు. కానీ కొన్ని ఇంటి చిట్కాలతో పసుపు పచ్చ పళ్లను తెల్లగా తయారుచేయొచ్చు. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 

37

అల్లం.. అల్లం మన ఆరోగ్యానికి దివ్య ఔషదంలా పనిచేస్తుంది. ఇది ఎన్నో రోగాలను నయం చేయడంతో పాటుగా.. దంతాలను తెల్లగా మెరిపించగలదు. ఇందుకోసం.. కొంచెం అల్లం ముక్కను తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో పావు టీ స్పూన్ ఉప్పును, కొంచెం నిమ్మరసాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో దంతాలను తరచుగా తోముకుంటే తెల్లగా మెరిసిపోతాయి. 

47

వేప ఆకులు.. వేపలో ఎన్నో ఔషధ గుణాలున్న సంగతి మనందరికీ తెలిసిందే. వేప చేదుగా ఉన్నప్పటికీ ఇది మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. కొన్నినీళ్లలో కొన్ని వేపాకులను వేసి బాగా మరిగించండి. ఆ తర్వాత కిందికి దించి వడకట్టండి. ఇవి చల్లబడిన తర్వాత నోటిలో వేసి పుక్కిలించండి. వేప చేదుగానే అనిపించినప్పటికీ దంతాలలో, నోటిలో ఉన్న క్రిములన్నింటినీ చంపుతుంది. 
 

57

ఎప్సమ్ ఉప్పు.. ఈ ఎప్సమ్ ఉప్పును  Magnesium sulfate అని కూడా పిలుస్తారు. ఈ ఎప్సమ్ ఉప్పును, నీళ్లను సమానంగా తీసుకుని.. రెండింటినీ కలపండి. ఈ మిశ్రమాన్నా టూత్ బ్రష్ కు పెట్టుకుని దంతాలను తోమండి. తర్వాత మీ నోటిని కూడా శుభ్రం చేసుకోండి. 

67

కోకో పౌడర్.. కోకో పౌడర్ ను తీసుకుని దీన్ని కొబ్బరి నూనె లేదా నీటిలో కలిపి పేస్ట్ లా తయారుచేసుకోండి. ఈ పేస్ట్ ను బ్రష్ కు అప్లై చేసి.. దంతాలను తోమండి. ఈ పేస్ట్ దంతాలను తెల్లగా, ప్రకాశవంతంగా చేస్తుంది. 
 

77

పుదీనా ఆకులు.. పుదీనా ఆకుల్లో ఎన్నో ఔషద గుణాలున్నాయి. మూడు లేదా నాలుగు పుదీనా ఆకులను తీసుకుని వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ లో కొంచెం కొబ్బరినూనెను మిక్స్ చేసి టూత్ బ్రష్ తో దంతాలపై రుద్దాలి. తరచుగా ఈ చిట్కాలను ఫాలో అయితే ఎంతటి పచ్చని దంతాలైనా.. తెల్లగా మారుతాయి.   

click me!

Recommended Stories