టాయిలెట్ ను ఇలా క్లీన్ చేయండి.. తెల్లగా మెరిసిపోతుంది.. క్రిములు కూడా ఉండవు

First Published | Nov 19, 2023, 11:12 AM IST

world toilet day 2023: మరుగుదొడ్ల పరిశుభ్రతపై జనాలను అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది నవంబర్ 19 న ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరుగుదొడ్ల పరిశుభ్రత గురించి, ఇది ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ప్రజలకు అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. 

world toilet day 2023: మరుగుదొడ్లు ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఉండాలి.  ఇవి మన ఇంట్లో చాలా ముఖ్యమైన భాగం కూడా. అందుకే ఇంట్లోని ఇతర భాగాల మాదిరిగానే దీనిని కూడా పరిశుభ్రంగా ఉంచాలి. మరుగుదొడ్ల నుంచి వచ్చే వాసన మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అలాగే మురికి మరుగుదొడ్లు మన ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తాయి. మరుగుదొడ్లు, ఆరోగ్యానికి ఉన్న మధ్య సంబంధాన్ని హైలైట్ చేయడానికి ప్రతి ఏటా నవంబర్ 19 న ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం జరుపుకుంటారు. మరి మరుగుదొడ్లను క్రిములు లేకుండా తెల్లగా అయ్యేందుకు ఎలాంటి చిట్కాలను ఫాలో కావాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 

మరుగుదొడ్డిని ఇలా శుభ్రం చేయండి?

మర్చిపోకుండా ప్రతి వారం మరుగుదొడ్డిని క్లీన్ చేయండి. అయితే మీ ఇంటి మొత్తానికి ఒకే మరుగుదొడ్డి ఉంటే మాత్రం వారానికి రెండు మూడు సార్లైనా శుభ్రం చేయాలి.  ఎందుకంటే టాయిలెట్ సీట్ పై ఎన్నో రకాల క్రిములు, సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తాయి. అందుకో టాయిలెట్ సీటును శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే టాయిలెట్ ఫ్లోర్ ను, టైల్స్ ను శుభ్రం గా ఉంచుకోవాలి. 


టాయిలెట్ ను ఈజీగా శుభ్రం చేయాలంటే కొన్ని వేడినీళ్లు తీసుకుని అందులో డిటర్జెంట్ పౌడర్ ను కొద్దిగా కలపండి. దీనితో టాయిలెట్ సీటు, కమోడ్, టైల్స్ శుభ్రం చేయండి.

టాయిలెట్ ను మీరు డిటర్జెంట్ వాటర్ తో క్లీన్ చేసిన తర్వాత రెండు మూడు సార్లు వాటర్ తో కగడండి. 
 

ఫ్లష్ ట్యాంకును, టాయిలెట్ సీటుతో సహా టాయిలెట్ రూం ను మొత్తం శుభ్రం చేయాలి. మీరు వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఖచ్చింతంగా శుభ్రం చేయాలి. 

మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే.. టాయిలెట్ సీట్ లేదా కమోడ్‌ను ఎప్పుడూ కూడా వేడి నీటితో క్లీన్ చేయకండి. ఎందుకే ఎక్కువ హాట్ వాటర్ టాయిలెట్ సీట్ లేదా కమోడ్ పగుళ్లు వచ్చేలా లేదా విరిగిపోయేలాచేస్తుంది. 

వెనిగర్, నిమ్మకాయ 

వైట్ వెనిగర్ మరుగుదొడ్లను శుభ్రం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో టాయిలెట్ క్లీనర్ వంటి కఠినమైన రసాయనాలు ఉండవు. ఇది టాయిలెట్  మరకలను సులువుగా తొలగిస్తుంది. అలాగే బ్యాక్టీరియాను కూడా పోగొడుతుంది. వెనిగర్ తో టాయిలెట్ డ్రైనేజీలో చిక్కుకున్న మురికి కూడా పెద్దగా కష్టపడాకుండా బయటకు పోతుంది. 

Latest Videos

click me!