Women diet plan: సూపర్ ఉమెన్ గా మారాలంటే వీటిని తినాల్సిందేనంటున్న నిపుణులు..

Published : Apr 13, 2022, 04:58 PM IST

Women diet plan: ఆడవారు శక్తివంతంగా, ఆరోగ్యంగా తయారవ్వాలంటే పోషకాహారం ఎక్కువగా తీసుకోవాలి. ఈ ఆహారాలతో ఆరోగ్యంతో పాటుగా నాజూకైన శరీరం కూడా మీ సొంతం అవుతుంది. అలాగే చర్మం, వెంట్రుకలు కూడా అందంగా తయారవుతాయి.   

PREV
19
Women diet plan: సూపర్ ఉమెన్ గా మారాలంటే వీటిని తినాల్సిందేనంటున్న నిపుణులు..

Women diet plan: మహిళలు ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉన్నప్పుడే ఇంట్లో పనులను, ఆఫీస్ పనులు సులభంగా చేసుకోగలుగుతారు. కానీ చాలా మంది మహిళలు పనుల హడావుడిలో పడి తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవడమే మానేసారు. దీనివల్లే వారు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 

29

బలవర్థకమైన, పోషకాహారం తీసుకున్నప్పుడే మీరు ఎంతో శక్తివంతంగా ఉంటారు. పనులను కూడా చకాచకా చేసుకోగలుగుతారు. మీరు ఒక సూపర్ ఉమెన్ లా కావాలంటే మాత్రం ఈ ఆహారాలను తప్పక తినాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 
 

39

మీగడ లేని పెరుగు.. పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందులో మీగడ  లేని పెరుగు వల్ల మన శరీరానికి మంచి చేసే ప్రోబ్యాక్టీరియా, కాల్షియం లభిస్తాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచేందుకు ఎంతో సహాయపడతాయి. తక్షణ శక్తి కూడా లభిస్తుంది. అందుకే దీన్ని ఆడవారు ప్రతిరోజూ తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు. 
 

49

చేపలు.. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. చేపల్లో ఉండే ప్రోటీన్స్ వల్ల మానసిక ఒత్తిడి, హార్ట్ ప్రాబ్లమ్స్, కీళ్ల నొప్పులు, హైపర్ టెన్షన్ వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఉండే అవిసిగింజలు, వాల్ నట్స్ తీసుకున్నా వీరి ఆరోగ్యానికి ఎంతో మంచిది.
 

59

టమాటాలు.. టొమాటోలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో లైకోనిన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. టొమాటోలను నిత్యం తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వ్యాధులకు అడ్డుకట్ట వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

69

ఆకు కూరలు.. ఆకు కూరల్లో కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎముకలను బలంగా ఉంచుతాయి. అలాగే కళ్లను కూడా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తాయి. 
 

79

డ్రై ఫ్రూట్స్.. ప్రతిరోజూ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ ను తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశమే ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డ్రై ఫ్రూట్స్ ను తింటే మన శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఇవి మన ఆకలిని కూడా నియంత్రిస్తాయి. దీంతో మీరు సులువుగా వెయిట్ లాస్ అవుతారు.
 

89

 ఈ డ్రై ఫ్రూట్స్ లో ఫైటో ఈస్ట్రోజెన్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా ఇవి ఆడవారిలో Reproductive capacity ని కూడా పెంచడానికి సహాయపడతాయి.  ఆప్రికాట్స్, ఎండిన ఖర్జూర పండు, నేరెడు పండ్లలలో ఈ ఫైటో ఈస్ట్రోజెన్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి మహిళలు వీటిని ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

99

ఆడవారు శరీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇంటిని చూసుకోగలరు. మీ ఆఫీస్ వర్క్ ను కూడా ఎలాంటి ఆటంకం లేకుండా కంప్లీట్ చేసుకుంటారు. మీరు శక్తివంతంగా ఉన్నప్పుడే ఎలాంటి వర్క్ నైనా అలవోకగా చేయగలరు. పైన చెప్పిన ఆహారాలను తీసుకోవడం వల్ల మీరు శక్తివంతంగా తయారవ్వడమే కాదు వెయిట్ లాస్ కూడా అయ్యి చురుగ్గా ఉంటారు. 

click me!

Recommended Stories