
ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. మనం అనుసరించే లైఫ్ స్టైల్, తినే ఆహారం కూడా అందుకు కారణం కావచ్చు. హార్ట్ ఎటాక్ ఏవిధంగా ఏ సమయంలో ఎవరిని ఎలా ఎటాక్ చేస్తుందో... పక్షవాతం కూడా అదేవిధంగా ఎటాక్ చేసే అవకాశం ఉంటుంది. అసలు పక్షవాతం ఎవరికి వస్తుంది..? వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనపడతాయి..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...
మెదడుకు ఏదైనా శరీర భాగం నుంచి రక్త ప్రసరణ సరిగా జరగకపోతే..అప్పుడు పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పక్షవాతం ఎప్పుడు ఎవరికైనా ఎలాగైనా వచ్చే ఛాన్స్ ఉంది. అయితే.. ఇది రావడం వెనక కారణాలు మాత్రం చాలానే ఉన్నాయి. మనం సరైన ఆహారం తీసుకోనప్పుడు కూడా ఇది జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని రకాల విటమిన్ల లోపం ఉన్నప్పుడు ఇది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
1.విటమిన్ బి12..
విటమిన్ బి12 లోపం కారణంగా నరాలు, మజిల్స్ బలహీనంగా మారిపోతాయి. ఇది శరీరంలో బ్యాలెన్స్ దెబ్బతినేలా చేస్తుంది. ఫలితంగా పక్షవాతం వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే.. ఈ విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు కచ్చితంగా తీసుకుంటూ ఉండాలి.
2.వయసు పెరగడం,..
కొందరిలో వయసు మీద పడుతున్న సమయంలో ఈ పక్షవాతం రావచ్చు. రక్త నాళాలు సరిగా పనిచేయక, రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల ఇది జరిగే అవకాశం ఉంటుంది.
3.హై బీపీ..
హై బ్లడ్ ప్రెజర్ కారణంగా హార్ట్ ఎటాక్స్ ఎలా వస్తాయో....తలలో నరాలపై ఒత్తిడి పెరిగి పక్షవాతం వచ్చే ఛాన్స్ కూడా ఉంది.
4.హైపర్ కొలిస్ట్రాలోమియా..
మన రక్తంలో ఫ్యాట్స్ లెవల్స్ బాగా పెరగడాన్ని హైపర్ కొలిస్ట్రాలోమియా అని అంటారు. ఎంత ఫ్యాట్స్ పెరిగిపోతే.. పక్షవాతం వచ్చే అవకాశాలు అంత పెరుగుతాయి.
5. పొగ తాగడం, మద్యం సేవించడం...
విపరీతంగా పొగ తాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లు ఉన్నవారిలోనూ గుట్కా నమిలేవారిలోనూ పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.
పక్షవాతం వచ్చే ముందు సంకేతాలు...
పక్షవాతం వచ్చే ముందు మనకు కొన్ని సంకేతాల ద్వారా ముందుగానే హెచ్చరిస్తుందట. అలర్జ్ అయితే.. ఈ ప్రమాదం నుంచి బయటపడొచ్చు. పక్షవాతం రావడానికి ముందు శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. అది కూడా ఒకవైపే బలహీనంగా అనిపిస్తుంది. చేయి, కాలు ఒకేసారి బలహీనంగా మారడం మనం గమనించవచ్చు.
అంతేకాదు.. పక్షవాతం లక్షణాలు ముఖంపై కూడా కనపడతతాయి. మూతి ఒక వైపుకు వంకరపోయినట్లుగా అనిపిస్తుంది. మాట్లాడుతున్నా, నవ్వుతున్నా పక్కకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. వారు మాటలు కూడా సరిగా అర్థం కావు. మాట్లాడుతుంటే మాటలు తడపడుతూ ఉంటాయి. నిలపడటంలో, నడవడంలో కూడా తడపాటు ఉంటుంది. వీటి ఆధారంగా కూడా గుర్తించవచ్చు. కంటి చూపు కూడా మందగిస్తుంది.