Anant Ambani: వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నా.. అంబానీ కొడుకు బరువు ఎందుకు తగ్గలేదు..?

Published : Jun 15, 2026, 08:40 AM IST

Anant Ambani: మన దేశ కుబేరుడు ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అనంత్ దాదాపు 200 కేజీల బరువు ఉన్నాడు. అన్ని కోట్ల ఆస్తులు ఉన్నా అంబానీ కొడుకు బరువు ఎందుకు తగ్గించలేకపోయారు? అతనికి ఉన్న ఆరోగ్య సమస్య ఏంటి? 

PREV
14
ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్..

మన దేశంలోనే అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీకి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయనకు కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. వారు పెళ్లికే వందల కోట్లు ఖర్చు చేయగలరు. లక్షల రూపాయలు విలువ చేసే దుస్తులు , వాచ్ లు ధరించగలరు. వారు కోరుకున్నది క్షణాల్లో కళ్ల ముందు ఉంటుంది. అంతెందుకు వాళ్ల ఇంట్లో ఫంక్షన్ జరిగితే.. బాలీవుడ్ సెలబ్రెటీలు అందరూ వెళ్లి.. వాళ్లు సంతోషించేలా డ్యాన్సులు చేస్తారు. అయితే.. అంత ఆస్తి ఉన్నా కూడా ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ బరువు మాత్రం ఎందుకు తగ్గించలేకపోయారు ..? దీని వెనక కారణం ఏంటి? అసలు.. అనంత అంబానీకి ఉన్న ఆరోగ్య సమస్య ఏంటి? ఆయన బరువు ఎందుకు తగ్గలేరు..?

24
చిన్నతనం నుంచే ఆరోగ్య సమస్యలు..

ముకేష్ అంబానీకి ముగ్గురు సంతానం. మూడో సంతానమే అనంత్ అంబానీ. అయితే.. చిన్నతనం నుంచే అనంత్ ఆస్తమా వంటి ఆరోగ్య సమస్యతో ఇబ్బందిపడుతున్నాడు. దానికి చికిత్సగా చిన్నతనంలో స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ స్టెరాయిడ్స్ కారణంగా అనంత్ అంబానీ విపరీతంగా బరువు పెరిగిపోయాడు. ఎక్కువగా స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల సహజంగానే అధిక బరువు పెరుగుతారు. ఆకలి పెరుగుతుంది.శరీరంలో నీటి నిల్వ పెరిగిపోతుంది. మెటబాలిజం దెబ్బ తింటుంది. దీని కారణంగా ఉబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనంత్ అంబానీ విషయంలోనూ ఇదే జరిగింది. విపరీతంగా బరువు పెరిగాడు.

అధిక బరువుతో చాలా ఇబ్బంది పడ్డాడు. అతను పబ్లిక్ ప్లేస్ లో కనిపించిన ప్రతిసారీ.. చాలా మంది అనంత్ పర్సనాలిటీని చూసి విపరీతంగా ట్రోల్ చేసేవారు.

34
100 కేజీలు తగ్గి షాకిచ్చిన అనంత్..

అయితే... ట్రోలర్స్ కి చెక్ పెట్టేందుకు తన బరువును తగ్గించి చూపించాడు. దాదాపు 200 కిలోల బరువు ఉన్న అనంత్ అంబానీ 2016లో దాదాపు 100 కేజీల వరకు బరువు తగ్గి చూపించాడు. అప్పుడు అనంత్ ని చూసి అందరూ షాక్ అయ్యారు. అయితే.. తాను ఆ బరువు తగ్గేందుకు చాలా కష్టపడ్డాడు. కఠినమైన డైట్ ఫాలో అయ్యాడు. రెగ్యులర్ గా వాకింగ్, యోగా, వ్యామాయాలు చేసి కేవలం 18 నెలల్లోనే సగానికి సగం బరువు తగ్గాడు.

44
మళ్లీ బరువు ఎందుకు పెరిగాడు..?

18 నెలల్లోనే చాలా స్పీడ్ గా బరువు తగ్గిన అనంత్... మళ్లీ అంతే స్పీడ్ గా బరువు పెరిగిపోయాడు. దీని వెనక కారణాన్ని నీతా అంబానీ ఓ ఇంటర్వ్యూలో గతంలో చెప్పారు. మళ్లీ ఆస్తమా ఎక్కువ కావడం..దానికి మళ్లీ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల వేగంగా బరువు పెరిగాడు అని నీతా అంబానీ చెప్పారు. ‘ నా జీవితం ఎప్పుడూ పూల పాన్పు కాదు..నేను చిన్నప్పటి నుంచి ఎన్నో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డాను’ అని అనంత్ కూడా ఓ సారి ఓ పబ్లిక్ ఈవెంట్ లో చెప్పడం గమనార్హం.

డబ్బు ఉంటే ప్రపంచంలో కొనలేదని ఏదీ లేదు అనే భావన చాలా మందిలో ఉంటుంది. మరీ ముఖ్యంగా సంపన్నులను చూసిన ప్రతిసారీ.. జీవితం అంటే వారిదే.. వారు కోరుకున్న ప్రతిదీ వారికి నిమిషాల్లో దక్కుతుంది అని అనుకుంటూ ఉంటాం. అంబానీ లాంటి ఫ్యామిలీలో మేము కూడా పుట్టి ఉంటే బాగుండు అని కోరుకునేవారు కూడా ఉండే ఉంటారు. అయితే.. ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నా కూడా ఒక్కోసారి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే అంటారు..డబ్బు ఉంటే వస్తువుల కొనచ్చేమో కానీ.. ఆరోగ్యాన్ని కాదు.

Read more Photos on
click me!

Recommended Stories