ప్రతి అబ్బాయికీ తమ జీవితంలోకి వచ్చే అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలి అనే కోరికలు ఉంటాయి. ఎక్కువగా అబ్బాయిలను.. నీకు ఎలాంటి అమ్మాయి కావాలి అంటే పొడవాటి జుట్టు ఉండాలి అనే రిక్వైర్మెంట్ ని చెబుతూ ఉంటారు. తమ భార్యలు జుట్టు కత్తిరించుకుంటామన్నా కూడా ఒప్పుకోని భర్తలు కూడా ఉంటారు. అంతెందుకు సినిమాల్లో డైరెక్టర్లు కూడా హీరోయిన్ ని చూపించేటప్పుడు పొడవాటి జుట్టు ఉన్నట్లుగా, గాలికి ఎగురుతున్నట్లుగా అందంగా చూపిస్తారు. అసలు అబ్బాయిలకు ఈ పొడవు జుట్టు ఫ్యాంటసీ ఎందుకు ఉంటుంది? దాని వెనక కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...