నిల్చొని కాదు కూర్చొని వంట చేస్తే ఏమౌతుందో తెలుసా?

First Published | Sep 20, 2024, 5:33 PM IST

ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ లు వచ్చాయి. దీంతో అందరూ నిల్చొనే వంట చేస్తున్నారు. కానీ ఒకప్పుడు కట్టె పొయ్యిలు మాత్రమే ఉండేవి. వీటిపై వంట చేయాలంటే ఖచ్చితంగా నేలమీద కూర్చోవాల్సిందే. కానీ నేలమీద కూర్చొని వంట చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? 
 

పూర్వకాలంలో  వంట కూర్చొనే చేయాలనే నియమం ఉండది. అంతేకాకుండా.. అప్పుడు ఈ గ్యాస్ స్టవ్ లు లేవు. కట్టెల పొయ్యి మీదనే వంట చేసేవారు. దీంతో వంట చేయడానికి ఖచ్చితంగా నేలమీద కూర్చోవాల్సి వచ్చయేది. 

పూర్వ కాలంలో నేలమీద కూర్చొని వంట చేయడానికి కారణం గ్యాస్, స్టవ్ లు మొదలైనవి ఉండేవి కావు. కానీ జ్యోతిష్యం ప్రకారం చూసుకున్నట్టైతే దీనికి ఒక ప్రత్యేకత ఉంది.

జ్యోతిష్యం ప్రకారం.. నేలమీద కూర్చొని వంట చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ కారణంగానే ఆడవాళ్లు ఎప్పుడూ నేలమీద కూర్చొనే వంట చేసేవారు. అసలు నేలమీద కూర్చొని వంట చేయడం వల్ల ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


పూర్వకాలంలో అంటే నేలమీద వండేటప్పుడు నిప్పు భూమి.. రెండూ పొయ్యి రూపంలో కలుస్తూ ఉండేవి. అంటే భూమి, అగ్ని కలిసి రావడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటీవిటీ తొలగిపోతుంది. ఇంట్లోకి పాజిటీవిటీ వస్తుంది. దీంతో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.


అలాగే నేలమీద కూర్చొని వంట చేయడం వల్ల  ఇంట్లో ఏదైనా వాస్తు లోపం ఉంటే అది కూడా దానంతట అదే తొలగిపోతుంది. అంతేకాకుండా శరీరంలోని లోపలి భాగాలను లాగగల సామర్థ్యం భూమికి ఉంటుంది. నేలపై కూర్చొని వంట చేయడం వల్ల శరీరంలోని నెగిటీవిటీ, ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. 

ఇప్పుడైతే గ్యాస్, స్టవ్ దగ్గర నిలబడి వంట చేస్తున్నారు. కానీ పూర్వకాలంలో కూర్చొని వంట చేయడం వల్ల అన్నపూర్ణదేవి ఇంట్లో ఎప్పుడూ ఉంటుందని నమ్మేవారు. ఎందుకంటే కూర్చునే భంగిమ దేవతలు, దేవుళ్లు శాశ్వతమనే భావనను కలిగిస్తుందని జ్యోతిష్యులు చెప్తారు.
 

అలాగే ఒకప్పుడు ఆ ఇంట్లో కోడలు లేదా కూతురు వంట చేసేవారు. వీరిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. ఇది ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగ్గా ఉంచడానికి ఇంట్లోని లక్ష్మిదేవి కూర్చొని వంట చేస్తున్నట్టుగా భావిస్తారు. కూర్చొని వంట చేయడం వల్ల కూడా గ్రహాలను బలంగా ఉంచుతుంది.

Latest Videos

click me!