చాణక్య నీతి ప్రకారం.. ఈ నాలుగు ఇండ్లు ఎప్పుడూ పేదరికంలోనే ఉంటాయి

First Published | Sep 20, 2024, 4:46 PM IST

ఆచార్య చాణక్యుడు మన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశాడు. అయితే చాణక్యుడి ప్రకారం.. నాలుగు ఇండ్లు ఎప్పుడూ పేదరికంలోనే మగ్గుతాయి. వాళ్లు ఎవరంటే? 
 

Chanakya Niti

 చాణక్య నీతిలో మన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ప్రస్తావించబడ్డాయి. ఏది మంచి? ఏది చెడు? ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? వంటి ఎన్నో విషయాలు దీంట్లో ఉన్నాయి. ఆచార్య చాణక్యుడు గొప్ప దౌత్యవేత్త. అలాగే ఆర్థికవేత్త. ఈయనకు రాజకీయ శాస్త్రంలో మంచి ప్రావీణ్యం కూడా ఉంది. ఆచార్య చాణక్యుడికి ప్రావీణ్యం సాధించలేని రంగం అంటూ ఏదీ లేదు. 
 

Chanakya Niti

ఆయన మనకు అందించిన జ్ఞానం ఎప్పటికీ ప్రజలకు సన్మార్గం చూపేందుకు సహాయపడుతూ వస్తోంది. ఆచార్య చాణక్యుడు తన నీతిలో మన నిజ జీవితంలోని ప్రతి అంశాన్నీ వివరంగా చెప్పాడు.  ఈ విధానాల ప్రకారం.. లక్ష్మీ దేవి కొన్ని ఇండల్లల్లో ఎప్పుడూ నివసించదు. ఈ ఇండ్లు ఎప్పుడూ పేదరికంలోనే ఉంటాయి. అసలు ఏ ఇంట్లో డబ్బు నిలవదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


ఎప్పుడూ గొడవ పడే ఇల్లు

కొందరి ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదని ఆచార్య చాణక్యుడు అంటాడు. కుటుంబ సభ్యులు ఎప్పుడూ తమలో తాము ఎప్పుడో కొట్లాడటం, అనవసరంగా ఒకరినొకరు తిట్టుకోవడం, నిందుకోవడం చేసే ఇంట్లో డబ్బు నిలవదు. ఇలాంటి ఇంట్లో ఎప్పుడూ పేదరికం, దుఃఖం ఉంటాయి. వీళ్లు జీవితాంతం పేదవాళ్లుగానే ఉండాల్సి వస్తుంది. 
 

పరిశుభ్రత ఉండని ఇల్లు 

చాణక్య  నీతి ప్రకారం.. పరిశుభ్రత లేని ఇంట్లో కూడా లక్ష్మీదేవి నివసించదు. ఈ విషయాన్ని పురాణాల్లో కూడా ప్రస్తావించారు. మీకు తెలుసా? ఎవరి ఇళ్లైతే పరిశుభ్రంగా ఉంటుందో.. అలాంటి ఇంట్లోనే లక్ష్మీ దేవి నివసిస్తుంది. డబ్బుకు ఏ కొదవా ఉండదు. మీ ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించాలనుకుంటే మీ ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచండి. 
 

వంటగది పరిశుభ్రత

ఆచార్య చాణక్యుడి ప్రకారం.. వంటగది కూడా నీట్ గా ఉండాలి. కానీ కొంతమంది తినేసిన పాత్రలను అలాగే ఉంచుతారు. ఒకేసారి సాయంత్రం క్లీన్ చేస్తుంటారు. కానీ ఇలాంటి ఇంట్లో, పాత్రలను పరిశుభ్రంగా ఉంచుకోని వ్యక్తులు ఎప్పుడూ పేదరికంలోనే ఉండాల్సి వస్తుంది. నిజానికి వంటగదిని చెత్తాచెదారంతో ఉంచడం వల్ల  అన్నపూర్ణదేవికి ఆగ్రహం  వస్తుంది. దీంతో మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత ఉంటుంది. అందుకే వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండండి. 
 

Chanakya Niti

స్త్రీలను, పెద్దలను గౌరవించని ఇంట్లో..

ఆచార్య చాణక్యుడి నీతి ప్రకారం.. స్త్రీలను, పెద్దలను, పండితులను గౌరవించని ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు. ఇలాంటి ఇంట్లో పేదరికం కమ్ముకుంటూనే ఉంటాయి. ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నివసించదు. ఇలాంటి ఇంట్లో ఎంత డబ్బు సంపాదించినా పేదరికం ఉంటాయి. ఆర్థిక కష్టాలు వస్తాయి. 

Latest Videos

click me!