మనం ఇష్టంగా లాగించే చిప్స్ ని నూనెలో వేయించి తయారు చేస్తారు. ఈ ఫుడ్ కి ఆక్సీజన్ ఎక్కువసేపు తగిలితే.. వాటి రుచి మారిపోవడమే కాకుండా, వాసన కూడా వస్తాయి. త్వరగా పాడౌతాయి. అందుకే, ఆక్సీజన్ స్థానంలో నైట్రోజన్ నింపుతారు. అందుకే, మనం చిప్స్ ప్యాకెట్ ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా మంచిగా కరకరలాడతూ ఉంటాయి. రుచి మారవు, మెత్తగా కూడా మారవు.
అంతేకాదు, చిప్స్ మనం జస్ట్ చేతితో పట్టుకుంటేనే విరిగిపోతాయి. అలాంటివి ఫ్యాక్టరీ నుంచి తయారై.. ట్రక్కులు, చివరకు దుకాణాల వరకు చేరే ప్రయాణంలో ప్యాకెట్లపై ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. అదే.. నైట్రోజన్ గాలి ఆ చిప్స్ కి మంచి కుషన్ లా పని చేస్తుంది. దీని కారణంగా.. అవి పాడవ్వకుండా.. సేఫ్ గా మనదాకా వస్తున్నాయి.
చిన్న ప్యాకెట్ లో అమ్మచ్చు కదా...
చిప్స్ ప్యాకెట్ లో చిప్స్ చాలా తక్కువగా ఉంటాయి కదా.. అంత పెద్ద ప్యాకెట్ కి బదులు చిన్న ప్యాకెట్ లోనే అమ్మచ్చు కదా అని మీకు సందేహం రావచ్చు. కానీ.. దీని వెనక కూడా కారణం ఉంది. చిప్స్ అన్నీ ఒకే ఆకారంలో ఉండవు. వాటి పరిమాణం, మందం, ఆకృతి ఆధారంగా అవసరమైన స్థలం మారుతూ ఉంటుంది. అందుకే.. ప్యాకెట్ కవర్ పెద్దగానే ఉంటుంది.
కంపెనీలు మనల్ని మోసం చేస్తున్నాయా..?
మనకు చూడటానికి ప్యాకెట్ పెద్దగా కనిపించినా, అందులో చిప్స్ తక్కువ ఉంటాయి కదా.. మరి కంపెనీలు మనల్ని మోసం చేస్తున్నాయా? అంటే అందులో మోసం ఏమీ లేదు. ఎందుకంటే.. చిప్స్ ఎంత బరువు ఉన్నాయో.. ప్యాకెట్ మీద క్లియర్ గా రాసి ఉంటుంది. మనం.. దానిని చెక్ చేసుకోవాలి.
ఫైనల్ గా చెప్పేది ఏంటంటే...
చిప్స్ ప్యాకెట్ లో కనిపించే ఖాళీ భాగం మనల్ని మోసం చేయడానికి కాదు.. చిప్స్ ని మనకు తాజాగా అందించాలనే లక్ష్యంతోనే ఇలానే తయారు చేస్తున్నారు.