Periods in March: చాలా మంది మహిళలు గమనించే ఉంటారు. అన్ని నెలలతో పోలిస్తే మార్చి నెలలో పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? దానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి.
మహిళల్లో ప్రతి నెలా సమయానికి పీరియడ్స్ వస్తేనే వారు ఆరోగ్యంగా ఉన్నట్టు. ఇది మహిళల ఆరోగ్యానికి ముఖ్యమైన సూచికగా కూడ వైద్యులు చెబుతారు. అయితే చాలా మంది మహిళలకు ప్రతి ఏడాది మార్చి నెలలో పీరియడ్స్ ఆలస్యం అవుతున్నట్టు ఎంతో మంది గమనిస్తారు. మార్చి నెలలోనే ఎందుకు పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయి? ఆరోగ్య నిపుణులు చెప్పిన ప్రకారం ఇది భయపడాల్సిన విషయం కాకపోవచ్చు. మార్చి నెలలో సాధారణంగా పరీక్షలు, పనిభారం, టార్గెట్లు వంటివి ఎక్కువ ఉంటాయి. దీని కారణాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి శరీరంలోని హార్మోన్లపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా కార్టిసోల్ అనే హార్మోన్ పెరగడం వల్ల ఓవ్యూలేషన్ (అండాల విడుదల) ఆలస్యం అవుతుంది. దాంతో పీరియడ్స్ కూడా ఆలస్యంగా వస్తాయి. కాబట్టి స్ట్రెస్‌ను తగ్గించుకుంటే పీరియడ్స్ సమయానికి వస్తాయి.
23
ఫిబ్రవరి నెల వల్లే
మరొక ముఖ్యమైన కారణం కూడా చెప్పుకుంటారు. ఏడాదిలో అతి చిన్న నెల ఫిబ్రవరి. ఫిబ్రవరిలో సాధారణంగా 28 రోజులు మాత్రమే ఉంటాయి. చాలా మంది మహిళల పీరియడ్ సైకిల్ 30 లేదా 31 రోజులుగా ఉంటుంది. ఈ కారణంగా పీరియడ్స్ మార్చిలో ఆలస్యంగా వచ్చినట్లు అనిపిస్తుంది. కానీ ఇది నిజంగా ఆలస్యం కాదు. ఫిబ్రవరి నెలలో రోజులు తగ్గడమే. దీన్ని కాలెండర్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. అంతేకాకుండా జీవనశైలిలో మార్పులు కూడా ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు నిద్ర సమయాలు మారడం, ప్రయాణాలు ఎక్కువ అవడం, ఆహారపు అలవాట్లు మారడం, వ్యాయామం తక్కువ లేదా ఎక్కువ అవడం వంటి కారణాలు శరీర హార్మోన్లను ప్రభావితం చేస్తాయి. ఇవన్నీ కూడా పీరియడ్స్ ఆలస్యం కావడానికి కారణమవుతాయి.
33
మీకున్న ఆరోగ్య సమస్యలు
మహిళలకు ఉండే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా పీరియడ్స్ ఆలస్య కావడానికి కారణం అవుతాయి. ముఖ్యంగా పీసీఓఎస్ (PCOS), థైరాయిడ్ సమస్యలు లేదా ఇతర హార్మోనల్ అసమతుల్యత వంటి సమస్యలు ఉన్నప్పుడు పీరియడ్స్ రెగ్యులర్‌గా రావు. అలాగే హఠాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం వంటివి కూడా ప్రభావం చూపిస్తాయి. ఇలా తరచుగా జరుగుతుంటే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. ఒకటి రెండు సార్లు ఆలస్యం అవడం సాధారణమే అయినా.. వరుసగా నెలల తరబడి పీరియడ్స్ రాకపోతే పరీక్షలు చేయించుకోవాలి. మొత్తానికి మార్చిలో పీరియడ్స్ లేట్ అవ్వడం చాలా సందర్భాల్లో సాధారణంగానే తీసుకోవాలి.