రాజకీయ నాయకులు తెల్లని దుస్తులే ఎందుకు వేసుకుంటారు?

First Published Jun 11, 2024, 4:13 PM IST

మీరు గమనించినట్టైతే మన దేశంలో ఉన్న రాజకీయ నాయకులు మాత్రమే తెల్ల దుస్తులను ఎక్కువగా ధరిస్తుంటారు. అయితే రాజకీయ నాయకులు ఎందుకు ఖచ్చితంగా తెల్ల దుస్తులు వేసుకుంటారని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? 

మన దేశంలో పెద్ద పెద్ద నాయకులు చాలా మంది ఉన్నారు. రాజకీయ నాయకులను దగ్గర నుంచి చూసే ఉంటారు. లేదా టీవీల్లో వారు ప్రసంగాలు చేయడమైనా చూసే ఉంటారు. అయితే రాజకీయ నాయకుల విషయంలో ఒక విషయాన్ని మీరు బాగా గమనించే ఉంటారు. అదే వారు ధరించే దుస్తులు. పీఎం, సీఎం నుంచి ఎంపీలు, ఎమ్మేల్యేలు, జెడ్పీటీసీలు, ఆకరికి ఊర్లో సర్పంచులు కూడా తెల్ల దుస్తులనే వేసుకుంటుంటారు. అసలు రాజకీయాల్లో ఉన్నవారు తెల్ల దుస్తులు ఎందుకు వేసుకుంటారో మీకు తెలుసా?  మీకు తెలుసా రాజకీయాల్లోకి రాకముందు ఆడవారు, మగవారు అందరూ తెల్ల దుస్తులే ధరించేవారు. అసలు రాజకీయ నాయకులు ఎందుకు తెల్ల దుస్తులు వేసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

తెలుపు రంగు అర్థం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులంతా నల్ల కోట్ లను ధరిస్తుంటే.. భారతీయ నాయకులు మాత్రం ఎక్కువగా తెల్ల దుస్తుల్లోనే కనిపిస్తుంటారు. మీకు తెలుసా? ఒక్కో రంగుకు ఒక్కో అర్థం ఉంటుంది. తెలుపు రంగుకు కూడా ఒక ప్రాముఖ్యత కలిగిన అర్థం ఉంది. తెలుపు రంగు అంటే శాంతి, స్వచ్ఛత, జ్ఞానం అని అర్థం. తెలుపు రంగు అంటే శాంతికి చిహ్నం. జనాలు తెల్లని దుస్తులు ధరించడానికి ఇది కూడా ఒక కారణమే.


రాజకీయ నాయకులు తెల్లని దుస్తులు ఎందుకు ధరిస్తారు?

భారత స్వాతంత్ర్య పోరాటంలో బాపూజీ స్వదేశీ నినాదాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నినాదంలో విదేశీ దుస్తులన్నింటినీ సేకరించి తగలబెట్టారు. మేకిన్ ఇండియా ఆలోచనను ప్రోత్సహించడానికి మహాత్మా గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే మహాత్మా గాంధీ తన చరఖాతో చేసిన ఖాదీ దుస్తులను ధరించి దేశ ప్రజలను కూడా ఇలా ధరించేలా ప్రోత్సహించాడు. భారతీయులు వేసుకునే దుస్తులు భారతీయులే తయారుచేస్తారు. 

jagan

ఈ సందర్బంగా అప్పుడు చాలా మంది తెల్లని దుస్తులే ధరించారు. ఈ సమయంలో విప్లవకారులలో పాల్గొన్న ప్రజలు తెలుపు వస్త్రాన్ని ధరించారు. అయితే క్రమంగా తెలుపు రంగు నాయకుల గుర్తింపుగా మారింది. అప్పటి నుంచి నేతలు తెల్లని దుస్తుల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. 

Latest Videos

click me!