Dogs: కుక్కల విశ్వాసం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరితో ఇంట్లో కుటుంబ సభ్యున్నిలా కలిసిపోయే గుణం కుక్కల సొంతం. మోస్ట్ ఫ్రెండ్లీ జంతువులు కుక్కలు. అయితే, వాటిని పెంచుకుంటున్న వాళ్లకు లేదా వేరే వారి కుక్కలు మన దగ్గరకు వచ్చినప్పుడు తప్పక ఈ అనుభవం ఎదురై ఉంటుంది. జీవితంలో ఒక్కసారి అయినా.. ఈ అనుభవం ఎదుర్కొనే ఉంటారు. ఇంతకీ ఆ అనుభవమేంటీ? అని ఆలోచిస్తున్నారా?