క్రికెటర్లు మైదానంలో చూయింగ్ గమ్ ను ఎందుకు నమలుతారో తెలుసా?

మీరు గనించారో లేదో కానీ క్రికెటర్లు మైదానంలో ఉన్నప్పుడు చూయింగ్ గమ్ లను నములుతుంటారు. మనమైతే టైం పాస్ కు వీటిని నములుతుంటాం. మరి క్రికెటర్లు దీనికి నములుతారో ఇప్పడు తెలుసుకుందాం పదండి.

కపిల్ దేవ్ నుంచి ఆరోన్ ఫించ్ వరకు చాలా మంది క్రికెటర్లు మైదానంలో చూయింగ్ గమ్ ను నమలడం టీవీల్లో చూసే ఉంటారు. మనలో చాలా మంది కూడా చూయింగ్ గమ్ ను నములుతుంటారు. మనమైతే టైం పాస్ కోసం వీటిని నములుతుంటాం. మరి క్రికెటర్లు అందుకోసమే నములుతారా? మరేదానికోసమైనా నములుతారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


రీఫ్రెష్

క్రికెటర్లు రీఫ్రెష్ గా ఉంటేనే వారు క్రికెట్ బాగా ఆడగలుగుతారు.  మీకు తెలుసా? చూయింగ్ గమ్ లో ఉండే గ్లూకోజ్ క్రీడాకారులను రిఫ్రెష్ చేస్తుంది. దీంతో వాళ్లు తమ శక్తిని కోల్పోకుండా మైదానంలో ఉండగలుగుతారు.



అప్రమత్తం

చూయింగ్ గమ్  ను నమలడం వల్ల మన మెదడు అప్రమత్తంగా ఉంటుంది. దీనివల్ల నాడీ వ్యవస్థ మెదడు నుంచి శరీర భాగాలకు త్వరగా సందేశాలను పంపుతుంది. అందుకే వీళ్లు అలెర్ట్ గా ఉండటానికి చూయింగ్ గమ్ ను నములుతుంటారు. 

ఆర్ద్రీకరణ

చూయింగ్ గమ్ ను నమలడం వల్ల నోట్లో నుంచి లాలాజలం ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. దీనివల్ల ఆటగాళ్లకు దాహం బాగా వేస్తుంది. దీంతో వీళ్లు నీళ్లు తాగుతారు. నీళ్లు తాగకపోతే వీళ్ల బాడీ డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. 

రెస్ట్ 

మైదానంలో క్లిష్టమైన వాతావరణంలో విశ్రాంతి తీసుకోవడానికి అలాగే ఒత్తిడిని తగ్గించడానికి కూడా చూయింగ్ గమ్ సహాయపడుతుందని శాస్త్రీయంగా నిరూపించబడింది.
 

amazing

ఏకాగ్రత

స్టేడియంలో అభిమానుల హర్షధ్వానాల మధ్య ఫీల్డర్లు మ్యాచ్ పై దృష్టి పెట్టడం చాలా కష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితిలో చూయింగ్ గమ్ మనస్సును తేలిక పరిచి పరధ్యానాన్ని మనకు దూరం చేస్తుంది. అలాగే చూయింగ్ గమ్ శ్వాస, ఆక్సిజన్ శోషణను మెరుగుపరచడానికి కూడా బాగా సహాయపడుతుంది. దీంతో ఆటగాళ్లు మైదానంలో అలసిపోకుండా ఆడతారు. 

Latest Videos

click me!