అకస్మాత్తుగా అర్ధరాత్రిళ్లు మీపై ఎవరో కూర్చున్నట్టు అనిపిస్తోందా? అయితే మీకు ఆ సమస్య ఉన్నట్టే..!

First Published | Aug 10, 2024, 9:49 AM IST

చాలా మంది గాఢనిద్రలోంచి లేచి నా ఛాతీపై ఏదో కూర్చుంది అని చెప్పడం వినే ఉంటారు. అంటే ఆ బరువును ఫీల్ అవుతారు. ఇంకేముందు దెయ్యమే వచ్చిందని భ్రమపడిపోతుంటారు. అసలు ఇలా ఎందుకు అనిపిస్తుందో తెలుసా? 
 

sleep

కొన్నిసార్లు అర్ధరాత్రిళ్లు బాగా నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఛాతీపై ఎవరో కూర్చున్నట్టు అనిపిస్తుంటుంది. ఈ అనుభవం చాలా మందికి ఉంటుంది. కానీ ఇలా దెయ్యమే చేసిందని అందరూ భ్రమ పడుతుంటారు. అంతేనా ఈ రూం లో దెయ్యం ఉందనుకుంటారు కూడా. కానీ దెయ్యం వల్ల అయితే ఇలా కానే కాదు.. మరి ఛాతీపై ఎవరో కూర్చున్నట్టుగా ఎందుకు అనిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


వైద్య పరిశోధనల ప్రకారం..  రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు మీ ఛాతీపై ఎవరైనా కూర్చున్నట్టు అనిపిస్తే మీరు స్లీప్ పక్షవాతంతో బాధపడుతున్నట్టే నంటారు. అలాగే ఎత్తుల నుంచి పడిపోవడం, లోతైన నీటిలో మునిగిపోవడం లేదా ఇష్టమైన వ్యక్తి మరణం గురించి కలలు కూడా పడుతుంటాయి. దీనినే నిద్ర పక్షవాతం అంటారు. 



ఇకపోతే అర్థరాత్రిపూట అకస్మాత్తుగా ఎవరో వచ్చి మీ పైన కూర్చొని శబ్దం చేయకుండా చేతులు, కాళ్లు కట్టేసినట్టుగా ఉంటుంది. కానీ ఇలా దెయ్యం వల్ల జరుగుతుందని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అవును ఇలా నిద్ర పక్షవాతం వల్లే అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
 


వైద్య పరిశోధనల ప్రకారం.. నిద్రలేమి వల్ల కలిగే ఒక రకమైన సమస్యే నిద్ర పక్షవాతం. దీనిలో మీరు నిద్రపోతున్నప్పుడు మీ ఆత్మ బయటకు వెళ్లిపోయినట్టుగా అనిపిస్తుంది. అలాగే మీ చేతులు, కాళ్లు కదలికను కోల్పోతాయి. దీన్నే స్లీప్ పక్షవాతం అంటారు. అర్థమయ్యేట్టు చెప్పాలంటే మీ శరీరం నిద్రపోతున్నప్పుడు మీ మనస్సు మెలకువగా ఉంటుంది. మీకు తెలుసా? ఈ సమస్య ఎక్కువగా యువతలోనే కనిపిస్తుంది. ఇది గాఢ నిద్రలోకి వెళ్లే ముందు లేదా మేల్కొన్న కొద్దిసేపటికే వస్తుంది. 
 

నిద్ర పక్షవాతానికి కారణమేంటి?

నిద్ర పక్షవాతానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒత్తిడి, నిద్రలేమి వంటివి కొన్ని కారణాలు. తగినంత నిద్ర పోనప్పుడు నిద్ర పక్షవాతం సమస్య వస్తుంది. అలాగే మీ నిద్ర సరళిని ఎప్పటికప్పుడు మార్చుకోవడం కూడా ఈ సమస్యకు దారితీస్తుంది. అలాగే ఈ నిద్ర పక్షవాతం సమస్యకు అధిక నిద్ర కూడా ఒక కారణమేనంటున్నారు నిపుణులు.
 

నిద్ర పక్షవాతాన్ని ఎలా నివారించాలి?

నిద్రపక్షవాతం సమస్య నుంచి విముక్తి పొందలంటే మీరు ప్రతిరోజూ 7-8 గంటల పాటు గాఢనిద్రపోవాలి. 12 గంటల వరకు పడుకోవడం మానేసి ఉదయాన్నే నిద్రలేవాలి. ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతంగా నిద్రపోవడానికి యోగా, మెడిటేషన్ సాధన చేయాలి. పడుకునే ముందు కాఫీ, హెవీ ఫుడ్ కు దూరంగా ఉండాలి. అలాగే మీరు పడుకునే ప్లేస్ ను సైలెంట్ గా ఉంచాలి. మద్యం, సిగరెట్లు తాగకూడదు. పడుకునే రెండు గంటల ముందు ఫోన్ చూడకూడదు.

Latest Videos

click me!