Chef Hat: రెస్టారెంట్స్ లో పనిచేసే చెఫ్స్... తలకు తెల్లటి టోపీనే ఎందుకు పెట్టుకుంటారు..?

Published : Oct 27, 2026, 02:20 PM IST

Chef Hat: పెద్ద పెద్ద రెస్టారెంట్లలో పనిచేసే చెఫ్స్ తమ తలకు క్యాప్ పెట్టుకుంటారు. అది కూడా తెలుపు రంగు క్యాప్ మాత్రమే పెట్టుకుంటారు. దాని వెనక కారణం ఏంటి?

PREV
13
వైట్ క్యాప్ వెనక సీక్రెట్ ఏంటి?

స్టార్ హోటల్ లేదా రెస్టారెంట్లలో పనిచేసే చెఫ్ లకు క్రేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ పనిచేసే చెఫ్స్ కచ్చితంగా.. కిచెన్ లో వంట చేస్తున్న సమయంలో.. తలకు హ్యాట్ పెట్టుకుంటారు. రాజుకి కిరీటం ఎంత ముఖ్యమూ... ఒక చెఫ్ కి వారి తలపై ఉండే తెల్లటి టోపీ అంతే ముఖ్యం. మనకు ఏ హోటల్, రెస్టారెంట్ చూసినా.. పొడవైన, తెల్లటి టోపీలతోనే కనిపిస్తుంటారు. అసలు చెఫ్స్ వైట్ కలరే ఎందుకు ధరిస్తారు? బ్లాక్, రెడ్ కలర్ ఎందుకు ధరించరు? దాని వెనక కారణం ఏంటి? అనే విషయం ఇప్పుడు చూద్దాం...

23
అసలు కారణం ఇదే...

కిచెన్ లో వైట్ క్యాప్ ధరించడం వెనక అతి పెద్ద కారణం పరిశుభ్రత. నార్మల్ గా.. చేసే వంటలో వెంట్రుకలు రాలకుండా క్యాప్ పెట్టుకుంటారు. కానీ, తెల్ల క్యాపే ఎందుకు పెట్టుకోవాలి అంటే మాత్రం.. హైజీన్ మెయిన్ రీజన్. తెల్లటి క్యాప్ ధరించడం వల్ల చిన్న మరక పడినా, మురికి అంటినా వెంటనే తెలిసిపోతుంది. దీని వల్ల.. చెఫ్స్ తమ టీపీలను, దుస్తులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాల్సి వస్తుంది. ఇది కష్టమర్లలో నమ్మకాన్ని పెంచుతుంది. మనకు వడ్డించే ఆహారం ఎంత పరిశుభ్రమైన వాతావరణంలో తయారవుతుందో చెప్పడానికి ఈ తెల్లటి రంగు ఒక గ్యారెంటీ లాంటిది.18వ శతాబ్దంలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ షెఫ్ బుచర్ (Boucher), వంటగదిలో పరిశుభ్రత పాటించాలంటే చెఫ్స్ అందరూ తప్పనిసరిగా తెల్లటి టోపీలే ధరించాలని రూల్ పెట్టారు. ఇప్పటికీ.. అదే రూల్ ఫాలో అవుతూ వస్తున్నారు.

ఈ టోపీ పేరు ఏంటి?

ఈ ఐకానిక్ తెల్లటి టోపీని ఫ్రెంచ్ భాషలో "తోక్" (Toque) లేదా "తోక్ బ్లాంచ్" (Toque blanche) అని పిలుస్తారు. 'తోక్ బ్లాంచ్' అంటే తెల్లటి టోపీ అని అర్థం.

33
టోపీ ఎత్తును బట్టి వాళ్ల పొజిషన్ తెలుస్తుంది!

మీరు ఎప్పుడైనా గమనించారా? వంటగదిలో కొందరి టోపీలు చాలా పొడవుగా ఉంటాయి, మరికొందరివి కాస్త చిన్నవిగా ఉంటాయి. పాత కాలంలో వంటగదిలో అందరికంటే మెయిన్ హెడ్ చెఫ్ మాత్రమే అత్యంత పొడవైన టోపీని ధరించేవాడు. ఫేమస్ ఫ్రెంచ్ షెఫ్ మేరీ-ఆంటోనిన్ కరేమ్ (Marie-Antoine Carême) ఏకంగా 18 అంగుళాల పొడవైన తెల్లటి టోపీని ధరించేవారట! దానిని చూసి మిగతా చెఫ్ లు ఆయన సీనియారిటీకి గౌరవం ఇచ్చేవారు.

టోపీపై ఉండే మడతల సీక్రెట్!

చెఫ్ టోపీని దగ్గరగా చూస్తే దానికి నిలువుగా అనేక మడతలు కనిపిస్తాయి. ఇవి కేవలం డిజైన్ కోసం మాత్రమే అనుకుంటే పొరపాటే.పూర్వకాలంలో టోపీపై ఉన్న మడతల ఆధారంగా చెఫ్ నైపుణ్యాన్ని కొలిచేవారు. ఒక టోపీకి 100 మడతలు ఉంటే, ఆ చెఫ్ 'ఒక్క గుడ్డు (Egg)తోనే 100 రకాల వంటకాలు' చేయడం వచ్చని అర్థమట.

అంతేకాకుండా.. టోపీ తలను పూర్తిగా కప్పి ఉంచడం వల్ల ఆహార పరిశుభ్రత దెబ్బతినకుండా ఉంటుంది. వంట చేయడం అంటే పొయ్యి దగ్గర గంటలపాటు పనిచేయాల్సి ఉంటుంది. ఆ వేడికి ముఖం మీద చమట ఆహారంలో పడకుండా కూడా ఈ క్యాప్ ఆపుతుంది. టోపీ పొడవుగా ఉండటం వల్ల లోపల గాలి ఆడటానికి ఖాళీ ఉండి, షెఫ్ తల వేడెక్కకుండా ప్రశాంతంగా ఉంచుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories