భారత్ లోకి ఎలా అడుగుపెట్టిందంటే...
15వ శతాబ్దంలో ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్, హెరాత్ ప్రాంతాలలో 'కబులీ పలావ్' అనే రాజభోజనం చాలా ప్రసిద్ధి చెందింది. 1526లో దండయాత్రల ద్వారా భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్... పర్షియన్ , సెంట్రల్ ఆసియన్ వంటకాల పద్ధతులను మన దేశానికి తీసుకొచ్చారు. ఇక్కడ లభించే బాస్మతీ బియ్యం, మన సుగంధ ద్రవ్యాలు (మసాలాలు) కలవడంతో పలావ్ కాస్తా బిర్యానీగా రూపాంతరం చెందింది!
మరో కథ కూడా ఉంది...
యుద్ధరంగంలో ఉండే మొఘల్ సైనికులకు తక్కువ సమయంలో ఎక్కువ శక్తినిచ్చే ఆహారం అందించడం కోసం ఒకే పాత్రలో రైస్, మాంసం, అందుబాటులో ఉన్న మసాలాలు కలిపి వండేవారు. అలా సాధారణ సైనికుల ఆకలి తీర్చిన ఈ వంటకం.. 18వ శతాబ్దం నాటికి ఢిల్లీ, లక్నో, హైదరాబాద్‌లలో రాజులు మెచ్చే రాజభోజనంగా మారింది!
బిర్యానీ కి గుర్తింపు తెచ్చింది మాత్రం మనమే..
బిర్యానీ ఎక్కడ పుట్టినా.. దానికి ఒక మహత్తరమైన వంటకాల కళాత్మక రూపం ఇచ్చింది మాత్రం హైదరాబాద్, అవధ్ (లక్నో) నవాబులే. లక్నోలో రాగితో చేసిన పాత్రల్లో సున్నితమైన రుచులతో వండితే, హైదరాబాద్‌లో కుంకుమపువ్వు, ఘాటైన మసాలాలతో బిర్యానీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. బిర్యానీ ఎక్కడ పుట్టినా... దానిని కింగ్ ఆఫ్ ఫుడ్ గా మార్చింది మాత్రం మన భారతదేశమే.