White Hair : వావ్.. చింతపండు తెల్ల జుట్టును నల్లగా మార్చడమే కాదు.. ఊడిపోయిన జుట్టును కూడా మొలిపిస్తుంది..

Published : Jun 02, 2022, 12:57 PM IST

White Hair Treatment: తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి చింతపండు (Tamarind)కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.   

PREV
17
White Hair : వావ్.. చింతపండు తెల్ల జుట్టును నల్లగా మార్చడమే కాదు.. ఊడిపోయిన జుట్టును కూడా మొలిపిస్తుంది..

White Hair Treatment: చింతపండును ఇష్టపడని వారు ఎవరూ ఉండరేమో. చింతపండు చారు, పులుసు, కారం వంటివి చింతపండుతో ఏవి చేసినా.. బలే టేస్టీగా ఉంటాయి. దీనిని పప్పుల్లో కూడా ఉపయోగిస్తుంటారు. పుల్ల పుల్లగా ఉండే చింతపండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చాలా మందికీ తెలుసు. 

27

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే చింతపండు (Tamarind) తెల్లజుట్టును (White Hair) నల్లగా మార్చుతుందట. అంతేకాదు మండుతున్న ఎండలకు నిర్జీవంగా మారిన ముఖాన్ని తిరిగి కాంతివంతంగా మార్చడానికి కూడా చింతపండు ఉపయోపడుతుందని నిపుణులుచెబుతున్నారు. ఇందుకోసం మీరు పెద్దగా కష్టపడిపోవక్కర్లే.. మీ రోజు  వారి ఆహారంలో ఈ పుల్లని చింతపండును చేర్చుకుంటే సరిపోతుంది. ఈ రెండు సమస్యలు తొందరగా తగ్గిపోతాయి. 
 

37
ಹುಣಿಸೇಹಣ್ಣಿನಿಂದ ಜೀರ್ಣಕಾರಿ ಪ್ರಕ್ರಿಯೆ ಹುಣಿಸೆ ಜೀರ್ಣಾಂಗ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಸುಧಾರಿಸುತ್ತದೆ, ಜೊತೆಗೆ ಇದನ್ನು ತಿನ್ನುವುದರಿಂದ ಮಲಬದ್ಧತೆ, ಆಮ್ಲೀಯತೆ, ಗ್ಯಾಸ್  ಅಥವಾ ಅಲ್ಸರ್ಗಳಂತಹ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ತೆಗೆದುಹಾಕುತ್ತದೆ.

రెగ్యులర్ గా చింతపండును తినడం వల్ల తెల్లజుట్టు (White Hair)కాస్త నల్లగా నిగనిగలాడుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

47

వాతావరణ కాలుష్యం, మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు వంటి వాటివల్ల ప్రస్తుతం చాలా మంది హెయిర్ ఫాల్ (Hair fall)సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు మెల్లమెల్లగా రాలడం మొదలై.. చివరికి బట్టతల (Bald)కు దారి తీస్తుంది. జుట్టు రాలడాన్ని ఆపేందుకు చింతపండు ఔషదం కంటే తక్కువేం కాదు. దీన్ని తరచుగా తినడం వల్ల జుట్టు బలంగా, నల్లగా నిగనిగలాడుతుంది. అంతేకాదు చిన్నవయసులో తెల్లబడిన జుట్టును నల్లగా కూడా చేస్తుంది. 

57
Tamarind

ముఖంపై గ్లో వస్తుంది.. చింతపండును తీసుకోవడం వల్ల చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే ప్రీ రాడికల్స్ ను బయటకు పంపడానికి ఎంతో సహాయపడతాయి. అలాగే చర్మానికి కూడా మేలు చేస్తాయి. ముఖానికి చింతపండు ఫేస్ ఫ్యాక్ ను అప్లై చేయడం వల్ల ముఖంపై ఉండే నల్ల మచ్చలు పోతాయి. అలాగే ముఖం కూడా కాంతివంతంగా తయారవుతుంది. 

67

బరువును తగ్గిస్తుంది.. చింతపండులో కొవ్వు అస్సలు ఉండదు. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో కేలరీలు పెరుగుతాయన్న భయం కూడా అక్కర్లేదు. ఈ పుల్లని పదార్థాన్ని తినడం వల్ల మీరు సులువుగా బరువు తగ్గుతారు. 

77

కాలెయానికి మేలు చేస్తుంది.. కాలేయం మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. దానికి ఏదైనా నష్టం జరిగితే ప్రాణాలకు ముప్పు ఉంటుంది. కాబట్టి మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే చింతపండును ఈ రోజు నుండి తినడం ప్రారంభించండి. ఎందుకంటే ఇందులో ప్రోసైనిడిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి కాలేయాన్ని రక్షించడానికి, దెబ్బతినకుండా నిరోధించడానికి సహాయపడతాయి. 

click me!

Recommended Stories