Health Tips: ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకుని పనిచేస్తున్నారా? దీనివల్ల అబ్బాయిలకు ఆ సమస్యలు వస్తాయి..జాగ్రత్త

Published : Jun 02, 2022, 12:07 PM IST

Health Care Tips: అబ్బాయిలు ఒడిలో ల్యాప్ టాప్ ను పెట్టుకుని పనిచేయడం వల్ల పునరుత్పత్తి వారి (Reproduction)ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా దీనిని ఎక్కువ సేపు ఒడిలో పెట్టుకోవడం వల్ల పురుషుల్లో వంధ్యత్వ (Infertility) సమస్యలు వస్తాయి.   

PREV
15
Health Tips: ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకుని పనిచేస్తున్నారా? దీనివల్ల అబ్బాయిలకు ఆ సమస్యలు వస్తాయి..జాగ్రత్త

Men Health Tips: కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి వర్క్ హోం  కల్చర్  (Work Home Culture) బాగా పెరిగింది. ఇక దీంతో చాలా మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. దీనివల్ల ల్యాప్ టాప్ (Laptop)ల వాడకం విపరీతంగా పెరిగింది.  ఇంతవరకు బాగానే ఉన్నా.. ల్యాప్ టాప్ లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల పునరుత్పత్తి ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

25

అంతేకాదు రోజంతా ల్యాప్ టాప్ ను వాడటం వల్ల శరీరంపై కూడా చెడు ప్రభావం పడుతుంది. ల్యాప్ టాప్ నుంచి వెలువడే  వేడి వల్ల మన చర్మంలోపలి కణజాలం దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని ఎక్కువ సేపు ఒడిలో పెట్టుకుని పనిచేయడం వల్ల పురుషుల్లో వంధ్యత్వ (Infertility) సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. ఇంతకు ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకుని పనిచేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం పదండి.

35

పురుషుల్లో వంధ్యత్వానికి దారితీస్తుంది.. ల్యాప్ టాప్ వేడి వల్ల మహిళల కంటే పురుషులకే ఎక్కువ ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం వారి శరీర నిర్మాణం (Body structure). ఆడవారి శరీరంలో గర్బాశయం (Cervix) శరీరం లోపల ఉంటుంది. పురుషులలో వృషణం (Testicle) శరీరం యొక్క వెలుపల భాగంలో ఉంటుంది. ఇక ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకోవడం వల్ల వేడి తగులుతుంది. ఉష్ణోగ్రత కారణంగా స్పెర్మ్ నాణ్యత తగ్గుతుంది. దీంతో సంతానోత్పత్తి సమస్యలు కూడా రావొచ్చు. అందుకే ల్యాప్ టాప్ ను ఒడిలో ఎక్కువ సేపు పెట్టుకోకూడదు. 

45

వైఫై ద్వారా రేడియేషన్ వ్యాపిస్తుంది.. ల్యాప్‌టాప్‌ను మీపై ఉంచుకుని ఎక్కువ సేపు పని చేయడం కంటే ఇది చాలా దారుణంగా ఉంటుంది.  తక్కువ ఫ్రీక్వెన్సీ రేడియేషన్ హార్డ్ డ్రైవ్ నుంచి విడుదలవుతుంది. అదే రేడియేషన్ బ్లూ టూత్ కనెక్షన్ నుంచి బయటకు వస్తుంది. రేడియేషన్ ప్రభావం వల్ల నిద్రలేమి, తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.
 

55

కండరాల నొప్పి రావొచ్చు.. ల్యాప్ టాప్ ను కాళ్లపై లేదా ఒడిలో పెట్టుకోవడానికి బదులుగా టేబుల్ పైనే పెట్టండి. కానీ కొంతమంది ల్యాప్ టాప్ ను కాళ్లపై పెట్టుకుని పని చేస్తారు. దీనివల్ల ల్యాప్ టాప్ రేడియేషన్ నేరుగా శరీరంపై పడుతుంది. ల్యాప్ టాప్ నుంచి వచ్చే వేడి మిమ్మల్ని ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడేస్తుంది. అంతేకాదు ఇది కండరాల నొప్పిని కూడా కలిగిస్తుంది. అందుకే దీనిని ఎక్కువ సేపు ఉపయోగించకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

click me!

Recommended Stories