White hair problem: చిన్న వయసులోనే జుట్టు తెల్లగా ఎందుకవుతుంది.. దీన్ని ఎలా ఆపాలి?

First Published Aug 15, 2022, 2:05 PM IST

White Hair Problem: ప్రస్తుతం చిన్న వయసు వారు సైతం తెల్ల జుట్టుతో బాధపడుతున్నారు. అయితే ఇలా ఎందుకు అవుతుందో తెలుసుకుంటే.. తెల్ల జుట్టును ఆపొచ్చంటున్నారు నిపుణులు. 
 

ఈ రోజుల్లో 25 నుంచి 30 ఏండ్ల యువత కూడా తెల్లజుట్టు బారిన పడుతున్నారు. ఇక ఈ తెల్లజుట్టు రావడం మొదలైతే దాన్ని ఆపడం అసాధ్యమనే చెప్పాలి. అయితే ఈ తెల్ల జుట్టు జన్యుపరమైన కారణాల వల్ల కూడా వస్తుంది. దీనిని మాత్రం ఏం చేసినా తగ్గించుకోలేం. అయితే మన జీవన శైలిలో చేసే తప్పుల వల్ల కూడా తెల్లజుట్టు వస్తుంది. దీనిని నివారించొచ్చు. చిన్న వయసులో తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. దీనిని ఎలా ఆపాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

చిన్న వయసులో తెల్ల జుట్టు రావడానికి గల కారణాలు

పని ఒత్తిడి

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు

శరీరంలో ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్లు లోపించడం

రసాయనాలు ఎక్కువగా ఉండే హెయిర్ ప్రొడక్ట్స్ ను వాడటం

జన్యుపరంగా 

స్మోకింగ్, ఆల్కహాల్ ను సేవించడం
 

జుట్టు తెల్లబడకుండా ఉండేందుకు ఏం చేయాలి?

జుట్టుకు రెగ్యులర్ గా స్నానం చేసేవారు.. రెగ్యులర్ గా షాంపూను అప్లై చేయడం మానుకోవాలి. దీనికి బదులుగా రసాయనాలు ఎక్కువగా లేని, సేంద్రీయ షాంపూలను ఉపయోగించొచ్చు. మనం యూజ్ చేసే షాంపూల్లో, కండీషనర్లలో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టును తెల్లబడేలా చేస్తాయి. 
 

హెల్తీ ఫుడ్స్ ను తినాలి

ఈరోజుల్లో చాలా మంది ఇంటి ఫుడ్ కంటే బయట దొరికే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ నే ఎక్కువగా తింటున్నారు. ఈ ఆహారాల వల్ల కూడా చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తుంది. ఈ ఫుడ్స్ వల్ల జుట్టుకు పోషణ లభించదు. అందుకే ఇలాంటి వారు విటమిన్ బి 12 ఎక్కువగా ఉండే పండ్లను, కూరగాయలను ఎక్కువగా తింటూ ఉండాలి. 
 

కెమికల్స్ హెయిర్ ఆయిల్

మార్కెట్ లో దొరికే చాలా హెయిర్ ఆయిల్స్ లో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు సరైన పోషణ అందదు. అందుకు వీటికి బదులుగా కొబ్బరి నూనె లేదా బాదం నూనె, ఆలివ్ ఆయిల్ వంటివి జుట్టుకు పెట్టండి. ఇవి జుట్టుకు అవసరమయ్యే పోషణను అందజేస్తాయి. 
 

స్మోకింగ్, ఆల్కహాల్

సిగరేట్లు, ఆల్కహాల్ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. ఇవి మీ కాలేయాన్ని, ఊపిరితిత్తులను పాడుచేయడమే కాదు.. జుట్టును కూడా దెబ్బతీస్తాయి. వీటిని తాగడం వల్ల నల్లగా ఉండే జుట్టు తెల్లగా, బలహీనంగా మారుతుంది. అందుకే ఈ చెడు అలవాట్లకు స్వస్తి చెప్పండి

ఒత్తిడి

నల్ల జుట్టు తెల్లగా మారడానికి ఒత్తిడి కూడా ఒక కారణమే అంటున్నారు నిపుణులు. నియంత్రణ లేని ఆలోచనలు, ఒత్తిడి వల్ల  జుట్టుపై చెడు ప్రభావం పడుతుంది. ఈ ఒత్తిడి వల్ల జుట్టు తెల్లబడటమే కాదు విపరీతంగా ఊడిపోతుంది కూడా.

click me!