సాధారణంగా వర్షాకాలం ప్రతి ఒక్కరికీ ఇష్టమే. కానీ ఈ సీజన్ తో పాటుగా ఎన్నో వ్యాధులు కూడా ఎంట్రీ ఇస్తాయి. ముఖ్యంగా ఈ కాలంలో దగ్గు, జలుబు, జ్వరంతో పాటుగా రకరకాల ఇన్ఫెక్షన్లు ఎక్కువగా సోకుతుంటాయి. అకస్మాత్తుగా ఈ వాతావరణ మార్పును మన శరీరం తట్టుకోలేకే అనారోగ్యానికి గురవుతుంటాం. దీనికి తోడు సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువగా వ్యాపిస్తాయి. ఇలాంటి పరిస్థితిలో మనం ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని రకాల పండ్లు, కూరగాయలు బాగా సహాయపడతాయి. అందుకే ఈ సీజన్ లో వీటిని ఖచ్చితంగా తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అవేంటంటే?
కాకరకాయ
కాకరకాయను చాలా తక్కువ మంది తింటారు. ఎందుకంటే ఇది చేదుగా ఉంటుందని. దీని రుచి చేదుగా ఉన్నా.. కాకరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వర్షాకాలంలో మన పేగుల్లో వృద్ధి చెందే సూక్ష్మక్రిములు మన జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి. కానీ ఈ సూక్ష్మక్రిములను చంపే గుణం కాకరకాయకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ సీజన్ లో కాకరకాయను ఖచ్చితంగా తినండి.ఈ సీజన్ లో కాకరకాయలు మార్కెట్ లో బాగా దొరుకుతాయి.
ivy gourd
దొండకాయ
దొండకాయ కూర, దొండకాయ ఫ్రై ఇలా.. దొండకాయతో ఏది చేసిన సూపర్ టేస్టీ గా అవుతుంది. మీకు తెలుసా? ఇది మన ఆరోగ్యానికి కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల దగ్గు, జ్వరం, జలుబుతో పాటుగా.. వర్షాకాలంలో వచ్చే అలర్జీ సమస్య కూడా తొలగిపోతుంది.
పర్వల్
ఈ కూరగాయను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఇది కూడా వర్షాకాలంలో మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. ఇదొక యాంటీ ఇన్ఫ్లమేటరీ వెజిటేబుల్. వర్షాకాలంలో దీన్ని తినడం వల్ల శరీరంలో విషపూరిత బ్యాక్టీరియా పెరగదు. దీనిలో ఉండే విటమిన్ -సి వర్షంలో వచ్చే వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్నిమన శరీరానికి అందిస్తుంది.
నేతి బీరకాయ
వర్షాకాలంలో నేతి బీరకాయలు కూడా మార్కెట్ లో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ వెజిటేబుల్ లో మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెండుగా ఉంటాయి. దగ్గుకు జలుబుకు కారణమయ్యే శోషరస గ్రంథుల్లో వాపును ఈ కూరగాయ నివారిస్తుంది.
pomegranate
దానిమ్మ
దానిమ్మ ఎన్నో పోషకాలున్న పండు. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే డెంగ్యూ, మలేరియా వంటి వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు మనల్ని దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జలుబు, దగ్గు రాకుండా మనల్ని కాపాడుతాయి.
పీచెస్
పీచెట్ టేస్ట్ లో పుల్లగా ఉంటుంది. కానీ ఈ పండులో ఎన్నో ఔషద గుణాలుంటాయి. ఈ పండును వర్షాకాలంలో తింటే అలర్జీల బారిన పడే ప్రమాదం ఉండదు. ఈ పండు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇది దగ్గు జలుబు జ్వరం రాకుండా మనల్ని కాపాడుతుంది.
బెర్రీలు
బ్లాక్ బెర్రీ, బ్లూ బెర్రీ వంటి రకరకాల బెర్రీ పండ్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముందుంటాయి. ఈ పండులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎన్నో వ్యాధులను దూరం చేస్తాయి. అలాగే వీటిలో ఉండే విటమిన్-సి మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వర్షాకాలంలో అనారోగ్యానికి గురికావడానికి మనల్ని కాపాడుతుంది.
చెర్రీలు
చెర్రీలను ప్రతి ఒక్కరూ తింటారు. ఇది మన ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడుతుంది తెలుసా? దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది వర్షాకాలంలో సంక్రమణను నివారిస్తుంది. జలుబు వల్ల కలిగే కండరాల నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.