పచరంగ పచ్చడి...
పానిపట్ పచ్చళ్ల పరిశ్రమ గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన పేరు పచరంగ పచ్చడి. ఈ సంస్థ ప్రయాణం 1943లో కేవలం 3 రకాల ప్రత్యేక పచ్చడి వంటకాలతో ప్రారంభమైంది. దశాబ్దాల కాలంలో ఇది ఒక స్థానిక బ్రాండ్ నుంచి భారతదేశమంతటా తెలిసిన భారీ నెట్వర్క్గా ఎదిగింది. నేడు పచరంగ పచ్చళ్లు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25కి పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
ఇక్కడ పచ్చడిని ఎలా తయారు చేస్తారంటే...
పానిపట్లో చేసే సాంప్రదాయ పచ్చడి రుచికి వారి తయారీ విధానమే ప్రధాన కారణం. తాజా కూరగాయలు లేదా పండ్లను ముక్కలుగా కోసి, ఉప్పు తగిలించి ఎండలో ఆరబెడతారు. ఆవాలు, సోంపు, మెంతులు, కారం, నూనెలను సరైన నిష్పత్తిలో కలిపి ఆ ముక్కలకు పట్టిస్తారు. ఈ మిశ్రమాన్ని కొన్ని రోజుల పాటు లేదా వారాల పాటు ప్రత్యేక పాత్రల్లో ఊరబెడతారు. ఆ సమయంలో మసాలాల రుచి ముక్కలకు పట్టి ఆ ఘాటైన, పుల్లటి కమ్మని రుచి వస్తుంది. పచ్చళ్లు అంటే ఇష్టం ఉన్నవారు జీవితంలో ఒక్కసారైనా ఇక్కడ పచ్చళ్ల రుచి ఆస్వాదించాల్సిందే.