Garlic: వెల్లుల్లి తొక్క తీయడం కష్టంగా ఉందా? 20 సెకన్లలో తొక్క తీసే టెక్నిక్ ఇది..!

Published : Oct 28, 2026, 12:58 PM IST

Garlic: వెల్లుల్లి వంటకు కమ్మని రుచిని అందిస్తుంది. ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ, వెల్లుల్లి తొక్క తీయడమే పెద్ద పని. కానీ, జస్ట్ సెకన్లలో వెల్లుల్లి తొక్క తీసేయచ్చు.

PREV
13
Garlic

మన వంటింట్లో వంటకాలకు అద్భుతమైన సువాసన, రుచి అందించే వాటిలో వెల్లుల్లి మొదటి వరసలో ఉంటుంది. చాలా రకాల వంటలకు వెల్లుల్లే ప్రాణం. కానీ, వెల్లుల్లి తొక్క తీయడమే చాలా కష్టమైన పని. ఒక్కోక్క వెల్లుల్లి రెబ్బ తొక్క తీసేసరికి వేళ్లు నొప్పులు పెట్టేస్తాయి. ఆ పని చేయలేక చాలా మంది తమ వంటలో వెల్లుల్లి వేయడమే మానేస్తూ ఉంటారు. అయితే, పెద్ద కష్టం లేకుండా కేవలం 20 సెకన్లలో వెల్లుల్లి తొక్క తీసేయచ్చు. ఇది ఒక చెఫ్ చెప్పిన సీక్రెట్. అదేంటో ఇప్పుడు చూద్దాం....

23
20సెకన్లలో వెల్లుల్లి తొక్క తీసే హ్యాక్...

మొదట వెల్లుల్లి రెబ్బలపైన ఉండే తొడిమ భాగాన్ని చాక్ తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు.. ఈ కట్ చేసిన వెల్లుల్లిని..ఒక క్లింగ్ ఫిల్మ్ కవర్ లో చుట్టి, మైక్రోవేవ్ లో కేవలం 20 సెకన్లు ఉంచితే సరిపోతుంది. తర్వాత దానిని బయటకు తీసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత.. తేలికగా నొక్కినా కూడా.. వెల్లుల్లి పొట్టు దానంతట అదే ఊడిపోతుంది. ఆ వెల్లుల్లి రెబ్బలను మనం హ్యాపీగా వంటలో వాడుకోవచ్చు.

33
మైక్రోవేవ్ లేకపోతే ఏం చేయాలి..?

మీ దగ్గర మైక్రోవేవ్ లేకపోయినా కంగారు పడాల్సిన పనిలేదు. వెల్లుల్లి రెబ్బలను ఒక గిన్నెలో వేసి, అందులో వేడి నీళ్లు పోసి 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ వేడికి పొట్టు మెత్తగా మారుతుంది, దాంతో చేత్తో రుద్దగానే పొట్టు సులభంగా ఊడిపోతుంది.

జార్ / బాటిల్ షేకింగ్ మెథడ్ : వెల్లుల్లి పాయలన్నీ విడదీసి ఒక గాజు సీసాలో లేదా మూత ఉన్న స్టీల్ డబ్బాలో వేయండి. డబ్బాను 20-30 సెకన్ల పాటు గట్టిగా ఊపడం (Shake) వల్ల రెబ్బలు ఒకదానికొకటి తగిలి పొట్టు సులభంగా విడిపోతుంది.

ఒలిచిన వెల్లుల్లిని నిల్వ చేసే సరైన పద్ధతి.. 

వంటింట్లో సమయం ఆదా చేసుకోవడానికి వెల్లుల్లిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఒలిచి పెట్టుకోవడం మంచిది. పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టండి. తర్వాత వాటిని ఎయిర్ టైట్ కంటైనర్ లేదా ఏదైనా గాజు సీసాలో వేసి మూత పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఈ సీసాను ఫ్రిజ్‌లో ఉంచితే.. వెల్లుల్లి తాజాదనం, రుచి తగ్గకుండా 1 నుంచి 2 వారాల పాటు హ్యాపీగా వాడుకోవచ్చు.

ఫ్రీజర్‌లో నిల్వచేయచ్చు: వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసి లేదా పేస్ట్‌లా చేసి కొద్దిగా నూనె కలిపి ఐస్ క్యూబ్ ట్రేలలో వేసి ఫ్రీజ్ చేయవచ్చు. కావాల్సినప్పుడు ఒక క్యూబ్ తీసి నేరుగా వంటల్లో వాడుకోవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

పొడి వస్త్రం ఉపయోగించండి: వెల్లుల్లిని నిల్వ చేసే ముందు ఒక్క చుక్క కూడా తడి లేకుండా చూసుకోవడం ముఖ్యం, లేదంటే బూజు పట్టే అవకాశం ఉంది.

చేతుల వాసన పోవడానికి: వెల్లుల్లి వలిచిన తర్వాత చేతులు వాసన రాకుండా ఉండటానికి స్టీల్ స్పూన్ లేదా స్టీల్ పాత్రకు చేతులను కాసేపు రుద్ది, ఆపై సబ్బుతో కడుక్కుంటే వాసన వెంటనే పోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories