Billionaires City: ప్రపంచ కుబేరులు ఉండే నగరాలు ఇవి, టాప్ 10లో మన ప్లేస్ ఎక్కడో తెలుసా?

Published : Nov 21, 2026, 12:00 PM IST

Billionaires City: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ధనవంతులు ఉన్నారు. కానీ, ఈ ధనవంతులు ఎక్కువగా ఏ నగరాల్లో ఉన్నారో తెలుసా? అసలు మన దేశంలో ఏ నగరానికి అయినా చోటు దక్కిందా?

PREV
12
కుబేరుల రాజధాని ఇది..

ప్రపంచవ్యాప్తంగా కోట్లకు పడగలెత్తినవారు చాలా మందే ఉన్నారు. ఈ కోటీశ్వరులంతా ఎలాంటి నగరాల్లో ఎక్కువగా నివసిస్తారో తెలుసా? కొందరు కుబేరుల ఆస్తులు కొన్ని చిన్న చిన్న దేశాల ఆర్థిక వ్యవస్థల కంటే కూడా ఎక్కువగా ఉంటాయి. ఫోర్బ్స్ 2025 జాబితా ప్రకారం... కోటీశ్వర్లు ఎక్కువగా నివసించే నగరాలు ఏంటో చూద్దాం..

టాప్ 3లో ఉన్న నగరాలు...

న్యూయార్క్.. 123 మంది బిలియనీర్లతో ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. మొత్తం 759 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ బిలియనీర్ రాజధానిగా మొదటి స్థానంలో నిలిచింది.

2. మాస్కో (Moscow): గత ఏడాది కంటే 16 మంది పెరిగి, మొత్తం 90 మంది బిలియనీర్లతో రెండో స్థానంలో ఉంది. వీరి సంపద $409 బిలియన్లుగా ఉండగా, ఆయిల్ దిగ్గజం వాగిట్ అలెక్పెరోవ్ ఇందులో ముందున్నారు.

3. హాంకాంగ్ (Hong Kong): 72 మంది బిలియనీర్లు, $309 బిలియన్ల సంపదతో మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ ప్రముఖ వ్యాపారవేత్త లీ కా-షింగ్ అత్యంత సంపన్నుడిగా ఉన్నారు.

22
ముంబయి కి మాత్రమే దక్కిన చోటు..

4. లండన్ (London): రెండు స్థానాలు ఎగబాకి 71 మంది అతి సంపన్నులతో నాలుగో స్థానానికి చేరుకుంది.

5. బీజింగ్ (Beijing): మరో ఐదుగురు కొత్త బిలియనీర్లను చేర్చుకుని, మొత్తం 68 మందితో ఐదో స్థానాన్ని నిలబెట్టుకుంది.

6. ముంబై (Mumbai): గతంలో నాలుగో స్థానంలో ఉన్న ముంబై, 67 మంది బిలియనీర్లతో ఆరో స్థానానికి చేరింది. అయితే వీరి మొత్తం సంపద $349 బిలియన్లుగా ఉండటం విశేషం.

7. సింగపూర్ (Singapore): రెండు స్థానాలు పైకి ఎగబాకి 60 మంది బిలియనీర్లతో ఏడో స్థానంలో నిలిచింది; వీరి మొత్తం సంపద $259 బిలియన్లు.

టెక్, ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌లు 

8 (టై). షాంఘై (Shanghai): గత ఏడాది 54 మంది ఉండగా, ఈసారి 58 మంది బిలియనీర్లతో ఎనిమిదో స్థానంలో నిలిచింది.

8 (టై). శాన్ ఫ్రాన్సిస్కో (San Francisco): ఇదీ 58 మంది బిలియనీర్లతో ఎనిమిదో స్థానాన్ని పంచుకుంది. వీరి మొత్తం సంపద $217 బిలియన్లు కాగా, సగటున ఒక్కొక్కరి సంపద $3.7 బిలియన్లుగా ఉంది.

10. లాస్ ఏంజిల్స్ (Los Angeles): 56 మంది బిలియనీర్లతో, $243 బిలియన్ల సంపదతో పదో స్థానంలో ఉంది. రిహాన్నా ($1.4 బిలియన్), లెబ్రాన్ జేమ్స్ ($1.3 బిలియన్), ఆర్నాల్డ్ ష్వార్జెనెగ్గర్ ($1.1 బిలియన్) వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories