తెల్ల జుట్టు నల్లగా అవుతుంది.. హెన్నాలో ఇవి కలిపి పెట్టండి

First Published | Jan 10, 2025, 11:30 AM IST

ఈ రోజుల్లో పెద్దలకే కాదు చిన్న పిల్లలకు కూడా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. అయితే హెన్నాలో కొన్ని పదార్థాలను కలిపి పెడితే తెల్ల వెంట్రుకలు నల్లగా అవుతాయి. అలాగే జుట్టు తెల్లబడటం కూడా తగ్గుతుంది. 

వయసు పెరుగుతున్న కొద్దీ తెల్ల జుట్టు రావడం చాలా కామన్. కానీ ఈ రోజుల్లో చిన్న పిల్లలకు, యంగ్ ఏజ్ వారికి కూడా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. పేలవమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల వయసు కంటే ముందే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. ఇక ఈ తెల్ల వెంట్రుకలను దాచడానికి కెమికల్ హెయిర్ కలర్స్ ను వేస్తుంటారు. కానీ వీటికి బదులుగా జుట్టుకు హెన్నా పెట్టడం బెటర్. హెన్నా తెల్ల జుట్టును నల్లగా చేయడమే కాకుండా.. జుట్టును  ఆరోగ్యంగా ఉంచుతుంది. వెంట్రుకలు రాలడాన్ని తగ్గిస్తుంది. మంచి షైనీగా చేస్తుంది. 
 

అయితే హెన్నా ఒక్కటే కాకుండా.. దానిలో కొన్నింటిని కలిపి పెడితే మీ వెంట్రుకలు నల్లగా నిగనిగలాడుతాయి. అలాగే జుట్టు రాలడం తగ్గుతుంది. తెల్ల వెంట్రుకలు వయసు కంటే ముందే వచ్చే అవకాశం తగ్గుతుంది. అందుకే తెల్ల జుట్టును హెన్నాలో ఏం కలిపి పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


హెన్నాలో ఉసిరికాయను కలపాలి

హెన్నాలోనే కాదు ఉసిరిలో కూడా ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఉసిరి మన జుట్టుకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. దీనిని ఉపయోగించి తెల్ల జుట్టును నల్లగా చేసుకోవచ్చు. ఉసిరి వెంట్రుకలను కూడా బలంగా చేస్తుంది. మంచి  రంగులో ఉంచుతుంది. మీరు తెల్ల జుట్టును నల్లగా చేయడానికి హెన్నాలో ఉసిరిని కలపండి.  ఇందుకోసం ఒక గిన్నెలో టీ స్పూన్ ఉసిరికాయ పౌడరని, మూడు టీ స్పూన్ల గోరింటాకు పొడిని వేసి బాగా కలపండి. 

హెన్నాను జుట్టుకు ఎలా పెట్టాలి?

హెన్నా, ఉసిరి పొడిలో కొన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా తయారుచేయండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మీ జుట్టు మొత్తానికి బాగా అప్లై చేయండి. ఇది మొత్తం ఆరిన తర్వాత అంటే 3 నుంచి 4 గంటల తర్వాత జుట్టును వాష్ చేయండి. ఇలా గనుక మీరు వారానికి 1 లేదా 2 సార్లు చేస్తే మీ తెల్ల జుట్టు నల్లగా అవుతుంది. అలాగే తెల్ల వెంట్రుకలు రావడం కూడా ఆగిపోతుంది. ముఖ్యంగా మీ హెయిర్ హెల్తీగా ఉంటుంది. 
 

మెహందీలో అరటిపండును కలపాలి

ఈ రోజుల్లో చాలా మందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తోంది. అయితే ఇలాంటి వారికి హెన్నా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు హెన్నాలో అరటిపండును కలిపి పెడితే తెల్ల జుట్టు నుంచి ఉపశమనం పొందుతారు. ఇందుకోసం 2 నుంచి 3 టీస్పూన్ల మెహందీ పౌడర్ లో ఒక అరటిపండును వేసి మెత్తని పేస్ట్ లా చేయండి. ఈ రెండింటినీ నీళ్లతో కలిపి పేస్ట్ చేయండి. దీన్ని జుట్టు మొత్తానికి అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. దీన్ని వారానికి 1-2 సార్లు పెడితే మంచి ఫలితం ఉంటుంది. 
 

మెహందీలో నూనె కలపాలి

తెల్ల జుట్టును నేచురల్ గా నల్లగా చేయాలంటే మీరు మెహందీలో నూనె వేసి కలిపి జుట్టుకు పెట్టండి. ఇందుకోసం మీరు మెహందీలో ఆవనూనె లేదా కొబ్బరినూనె లేదా ఆముదం నూనెను కలపొచ్చు. ఇందుకోసం గోరింటాకు పొడిలో 50 మి.లీ నూనెను పోసి కలపండి.వీటిని కాసేపు వేడి చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయాలి. ఈ మిశ్రమం నల్లగా అయిన తర్వాత మంటను ఆఫ్ చేయండి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత తలస్నానం చేయడానికి 3-4 గంటల ముందు జుట్టుకు అప్లై చేయండి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే తెల్ల వెంట్రుకలు నల్లగా అవుతాయి. 

Latest Videos

click me!