హ్యాపీగా సాగుతున్న జీవితంలో కొన్ని ఘటనలు ఎన్నటికీ చెరిగిపోవు. అలాంటి ఘటనలు యాదికి వచ్చినప్పడు మనసంతా అదోలా ఉంటుంది. జీవితంలో ఏదో కోల్పోయాను అనే ఆలోచనలోనే ముగిని తేలుతుంటారు. అలాంటి సమయంలో ఎవ్వరితోనూ సరిగ్గా మాట్లాడాలనిపించకపోవడం, విసుగు, కోపం, నిరుత్సాహం వంటివి మనల్ని చుట్టుముడుతాయి. అంతేకాదు మనసంతా అనేక ఆలోచనలతో సతమతమవుతుంది. అలాంటి సమయంలో ఎవ్వరూ మాట్లాడినా.. వారిపై విసుగు చికాకు వస్తుంటాయి. అటువంటి సమయంలో కొన్ని పనులు చేస్తే మీ మూడ్ తొందరగా మారుతుంది. మరి అందుకు మనం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..