అతిగా దాహం వేస్తోందా? కారణం ఇదే కావొచ్చు..

Published : Mar 06, 2022, 10:26 AM IST

కాలాలతో సంబంధం లేకుండా చాలా మందికి అతిగా దాహం వేస్తూ ఉంటుంది. దీనికి కారణం మన శరీరంలో ఉప్పు శాతం ఎక్కువ అవడమే. అవును ఉప్పు అతిగా తీసుకోవడం వల్లే మనకు మాటిమాటికి దాహం వేస్తోందని నిపుణులు చెబుతున్నారు.   

PREV
16
అతిగా దాహం వేస్తోందా? కారణం ఇదే కావొచ్చు..

కూరలకు రుచిని అందివ్వడమే కాదు.. కూరలు చెడిపోకుండా చేయడంలో ఉప్పు ఎంతో సహాయపడుతుందని మనందరికీ తెలిసిందే. అందుకే కదా.. ఉప్పు తక్కువైతే పచ్చళ్లు, సాంబర్ సాయంత్రానికే పాడయిపోతుంటాయి. ఎందుకంటే కూరలను పాడు చేసే బ్యాక్టీరియా.. ఉప్పు ఎక్కువగా ఉండే చోట జీవించలేదు.

26

ఉప్పులో ఉండే సోడియం మినరల్స్ మన బాడీలోని అనేక విషయాల్లో బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. మోతాదులో ఉప్పును తీసుకుంటే ఎటువంటి సమస్యా ఉండదు. కానీ ఉప్పును ఎక్కువ మొత్తంలో తీసుకుంటేనే  మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

36

ఉప్పు ఎక్కువ తీసుకుంటున్నట్లు ఎలా తెలుసుకోవాలి:  మీరు తీసుకునే ఆహార పదార్థాల్లో ఉప్పు శాతం ఎక్కువ అయితే.. మీకు ఎక్కువగా దాహం వేస్తుంటుంది. అలాగే బాత్రూంకి తక్కువగా వెలుతుంటాయి. అలాగే బరువు కూడా పెరుగుతుంటారు. వాంతులు, డయేరియా వంటి సమస్యలు వస్తాయి. 
 

46

ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఏమౌతుంది:  ప్రతిరోజూ పెద్దవాళ్లు ఉప్పును 2,300 మిల్లీగ్రాముల కంటే తక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతక్వాంటిటీ కంటే తక్కువగా తీసుకుంటే కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఉప్పును ఇంతకు మించి ఎక్కువగా తీసుకుంటే మాత్రం Hypernatremia అనే కండీషన్ బారిన పడొచ్చు. దీనివల్ల మీ శరీరం Dehydration బారీన పడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

56

ఉప్పును ఎక్కువగా తీసుకుంటే ఒక్కో సారి మీ బ్రెయిన్ సరిగ్గా పనిచేయదట. అలాగే మూర్చ, కంఫ్యూజన్, Muscle twitching, కోమా వంటి సమస్యల బారిన పడొచ్చట. అంతేకాదు ఈ సమస్యల వల్ల ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

66

పై సమస్యలన్నీ మీలో కనిపిస్తుంటే మీరు తీసుకునే ఆహారంలో ఉప్పు శాతం ఎక్కువ అవుతుందని అర్థం చేసుకోవాలి. ఉప్పు క్వాంటిటీ ఎక్కువ అయితే అది విషం అవుతుంది. కాబట్టి ఉప్పును మీ ఆహారంలో తగ్గించుకోండి. లేదంటే అది ప్రాణాంతకం కావొచ్చు. 

    

click me!

Recommended Stories