గ్రీన్ టీ అతిగా తాగితే ఆ సమస్యలు తప్పవు.. జాగ్రత్త..!

Published : Mar 06, 2022, 09:35 AM IST

green tea side effects: గ్రీన్ టీ  ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే. కానీ వీటిని అతిగా తాగితే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోకతప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.   

PREV
18
గ్రీన్ టీ అతిగా తాగితే ఆ సమస్యలు తప్పవు.. జాగ్రత్త..!

green tea side effects:గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అందుకే చాలా మంది టీ, కాఫీలకు బదులుగా గ్రీన్ టీనే తాగడం అలవాటు చేసుకున్నారు. 

28

ముఖ్యంగా గ్రీన్ టీ తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతారని చాలా మంది నమ్ముతుంటారు. అందుకే ప్రతి రోజూ ఉదయాన్నే ఈ గ్రీన్ టీని తాగుతుంటారు. గ్రీన్  టీ ఆరోగ్యానికి మంచిదే అయినా.. దీన్ని అతిగా తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోకతప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 

38

గ్రీన్ టీని రోజులో ఎక్కువసార్లు తాగే అలవాటున్న వారికి తరచుగా తీవ్రమైన తలనొప్పి, బద్దకం, చిరాకు, నీరసం వంటి సమస్యలను ఎదుర్కొంటారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

48

మరి ఈ గ్రీన్ టీ తాగడం వల్ల ఇంకా ఎలాంటి అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
 

58

నిద్రపై ఎఫెక్ట్: గ్రీన్ టీని మోతాదుకు మించి అతిగా తాగితే నిద్రలేమి సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలసిన శరీరం పునరుత్తేజంగా మారాలంటే మన బాడీకి ఖచ్చితంగా నిద్ర ఎంతో అవసరం. నిద్రలేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి గ్రీన్ టీని అతిగా తాగకండి.

68

రక్తపోటు పెరిగే అవకాశం:  గ్రీన్ టీని అతిగా తాగితే Blood pressure పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రీన్ టీ లో ఉండే కెఫిన్ మన nervous systemపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. తద్వారా  blood circulation చెడు ప్రభావం పడి Blood pressure పెరుగుతుందట. 

78

ఐరన్ : గ్రీన్ టీని అతిగా తాగడం వల్ల మన బాడీలో ఐరన్ లోపం ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు గ్రీన్ టీ తాగడం వల్ల మన ఆకలి రోజు రోజుకు తగ్గిపోతుందట. దీంతో మీరు బలహీనంగా తయారవుతారు. మీ బాడీ వీక్ అవడం వల్ల మీకు అనేక రోగాలు సోకే అవకాశం ఉంది. 
 

88

ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే వచ్చే అనారోగ్య సమస్యలు: నేడు చాలా మంది బరువు తగ్గుతామని ఖాళీ కడుపుతోనే గ్రీన్ టీని తాగుతుంటారు. ఇలా తాగడం వల్లల ఎసిడిటీ సమస్య వస్తుందట. అంతేకాదు తీవ్రమైన తలనొప్పి, బద్దకం, నీరసం, చిరాకు వంటి సమస్యలు అటాక్ చేస్తాయి.  

click me!

Recommended Stories