Health Tips: ఆయిల్ ఫుడ్ప్ తిన్నా.. మీ ఆరోగ్యం సేఫ్ గా ఉండాలంటే.. ఇలా చేయాల్సిందే..

Published : May 30, 2022, 02:30 PM IST

Health Tips: ఆయిలీ ఫుడ్ తిన్న తర్వాత ఈ ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 

PREV
19
Health Tips: ఆయిల్ ఫుడ్ప్ తిన్నా.. మీ ఆరోగ్యం సేఫ్ గా ఉండాలంటే.. ఇలా చేయాల్సిందే..

Health Tips: చాలా మందికి ఇంట్లో వండిన ఆహారాల కంటే బయట లభించే ఆయిలీ ఫుడ్స్ (Oily Foods), వేయించిన ఆహారాలే (Fried foods) ఎక్కువగా తింటూ ఉంటారు.  ఇవి నాలుకకు రుచిగా అనిపించినా ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. 

29

వీటిని తిన్న తర్వాత అజీర్థి, అపానవాయువు(పిత్తులు) (Fart), కడుపుల మంట (stomach Inflammation) వంట సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ ఆయిల్ ను ఎక్కువగా తీసుకోవడం, మనం తినే ఆహారాల్లో ఉండే సుగంధ ద్రవ్యాల (Spices) వల్ల వస్తాయి. ఇలాంటి సమస్యలు తలెత్తకూడదంటే.. ఆయిలీ ఫుడ్ తిన్న తిర్వాత ఇలా చేయండి.. 

39

గ్రీన్ టీ (Green tea).. ఆయిలీ ఫుడ్స్ తిన్న తర్వాత గ్రీన్ టీ తాగితే మీ పాణానికి ఎలాంటి హాని తలెత్తదు. ఎందుకంటే గ్రీన్ టీ ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థపై  Oxidation ను సమతుల్యం చేయడానికి ఎంతో సహాయపడుతుంది. 

49

వామ (Ajwain).. ఒక చెంచా వామును తీసుకుని ఒక లీటరు నీటికి కలిపి వేడి చేయండి. అది గోరు వెచ్చగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం సిప్ చేస్తూ ఉండండి. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపర్చడానికి ఎంతో సహాయపడుతుంది. గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి లక్షణాలు కలగకుండా మిమ్మల్ని కాపాడుతుంది. ఇది తిన్న ఆహారం జీర్ణం కావడానికి ఎంతో సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో అల్లం కలిపి తీసుకోవడం వల్ల కూడా జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. 

59

ప్రోబయోటిక్ అధికంగా ఉండే ఆహారాలు..  అధిక జీర్ణక్రియ నుంచి ఉపశమనం కలిగించడానికి , ప్రోబయోటిక్స్ తో గట్ ను పోషించడానికి కొద్దిగా జీలకర్రను తీసుకుని పెరుగులో కలిపి తీసుకోండి  ప్రోబయోటిక్స్ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా వాయువును నిరోధిస్తుంది. అలాగే సరైన ప్రేగు కదలికకు కూడా సహాయపడుతుంది.  పెరుగు ఒక ప్రోబయోటిక్. ఇది గట్ లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది.

69

తృణధాన్యాలు.. అదనపు కొలెస్ట్రాల్ ను తొలగించడంలో ధాన్యాలు ముందుంటాయి. అల్పాహారం (Breakfast) లో ఓట్స్ తినడం ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. తృణధాన్యాల్లో ఉండే ఫైబర్ ప్రేగులను శుభ్రపరిచే స్వీపర్ గా పనిచేస్తుంది. అంతేకాదు గింజలు మిమ్మల్ని శక్తివంతంగా కూడా ఉంచడానికి సహాయపడతాయి.
 

79

సీజనల్ పండ్లు, కూరగాయలు..  సీజనల్ పండ్లు, కూరగాయల్లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలను పుష్కలంగా ఉంటాయి. నెమ్మదించిన జీర్ణక్రియను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. నిత్యం పండ్లను తినడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది. అలాగే ఇవి మన శరీరాన్ని అవసరమైన అన్ని విటమిన్లను, ప్రోటీన్లను, ఖనిజాలను అందిస్తాయి. రోజుకు రెండు మూడు సార్లు పండ్లను తింటే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. 

89

గోరువెచ్చని నీళ్లను తాగండి.. ఆయిలీ ఫుడ్ తిన్న తర్వాత గ్లాస్ గోరువెచ్చని నీళ్లను తాగడం వల్ల జీర్ణక్రియను వేగవంతం అవుతుంది. ఇది జిడ్డుగా ఉన్న ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేయడానికి జీర్ణవ్యవస్థకు సులభతరం చేస్తుంది. ఎక్కువగా తిన్న తర్వాత నీళ్లు తాగకపోతే  మీ గట్ ఆహారం నుంచి నీటిని గ్రహిస్తుంది. మలబద్ధకానికి దారితీస్తుంది. గోరువెచ్చని నీటితో ఒక టీస్పూన్ అజ్వైన్ వేసుకుని తాగితే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది.

99

ఐస్ క్రీం తినొద్దు.. ఐస్ క్రీమ్ లేదా చల్లని ఆహారాన్ని తినడం మీకు హాయిగా అనిపించినా.. ఇలా తినడం మీ జీర్ణవ్యవస్థకు ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జిడ్డుగా ఉండే ఆహారాన్ని తిన్న వెంటనే చల్లని ఆహారాన్ని తీసుకోవడం వల్ల పేగులు, పొట్ట, కాలేయంపై ఒత్తిడి పెరుగుతుంది. దాంతో జిడ్డుగా ఉండే ఆహారాన్ని సులువుగా జీర్ణం చేయడం కష్టమవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories