బరువు తగ్గాలంటే సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య ఇవి మాత్రం తినకండి

First Published | Jun 18, 2024, 3:51 PM IST

సాయంత్రం పూట ఏదో ఒకటి తినాలనిపించడం చాలా కామన్. కానీ మీరు బరువు తగ్గాలంటే మాత్రం సాయంత్రం పూట ఎంత ఆకలిగా అనిపించినా ఏవి పడితే అవి తినకూడదు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు మాత్రం సాయంత్రం 4 గంటల నుంచి  6 గంటల మధ్య కొన్ని ఆహారాలను మాత్రం తినకూడదు. 
 

బరువు తగ్గాలని చాలా మంది రాత్రిపూట తినడం మానేస్తుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే దీనివల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. దీనివల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది.అందుకే బరువు తగ్గడానికి తినడం మానేయకూడదు. 

weight loss

కొంతమంది బరువు తగ్గడానికి రకరకాల డైట్లను ఫాలో అవుతుంటారు. కానీ కొంతమంది మాత్రం ఎలాంటి డైట్ ను ఫాలో కారు. కానీ మీరు ఏవి పడితే అవి తింటే మాత్రం బరువు విపరీతంగా పెరిగిపోతారు. ముఖ్యంగా సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య. ఈ సమయంలో  మీరు ఏం తినకపోవడం డిన్నర్ కంటే చాలా ముఖ్యం. సాయంత్రం పూట అనారోగ్యకరమైన ఆహారాన్ని తినాలని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం మీరు అనారోగ్యకరమైన ఆహారాలను తింటే మీ బరువు ఫాస్ట్ గా పెరుగుతుంది. 


ఉదయం ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తర్వాత పండ్లు తినాలి. ఆ తర్వాత మధ్యాహ్నం ఆరోగ్యకరమైన  ఆహారం తినాలి. కానీ సాయంత్రం 4 నుంచి 6 గంటలు దాటిన వెంటనే చాలా మందికి ఆకలి మొదలవుతుంది. ఇలాంటి సమయంలో జనాలు అనారోగ్యకరమైన స్నాక్స్ తినడం మొదలుపెడుతుంటారు. టీ. కాఫీలు తాగడం, సమోసాలు తినడం లేదా వేయించిన రెడీమేడ్ స్నాక్స్ తినడం వంటివి చేస్తుంటారు. దీనివల్ల రోజంతా ఆరోగ్యకరమైన ఆహారం ప్రభావం తగ్గుతుంది. అలాగే అనారోగ్యకరమైన ఆహారాల వల్ల మీరు బరువు తగ్గడం కష్టమవుతుంది.

మీరు బరువు తగ్గాలనుకున్నా లేదా ఫిట్ గా ఉండాలనుకున్నా సాయంత్రం ఆకలి అయినప్పుడు కొన్ని ఆరోగ్యకరమైన వస్తువులను తినండి. దీంతో మీరు ఫిట్ గా ఉండాలనే మీ కోరిక నెరవేరుతుంది. 

సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య ఏం తినాలి: 4 గంటల తర్వాత ఆకలిగా అనిపిస్తే ఎలాంటి అనారోగ్యకరమైన స్నాక్స్ తినకుండా ఈ పనులు చేయండి

సాయంత్రం 4 గంటల సమయంలో ఒక గ్లాసు మంచిని తాగండి. ఎందుకంటే లంచ్ చేసిన గంట తర్వాత నీళ్లను ఖచ్చితంగా తాగాలి. కాబట్టి ఈ సమయంలో నీరు తాగడం వల్ల శరీరంలో నీటి కొరత దూరం అవుతుంది. మీకు ఆకలి కూడా తగ్గుతుంది.

అలాగే ఆకలిగా ఉంటే మజ్జిగ లేదా నిమ్మరసాన్ని తాగండి. ద్రవనాన్ని తాగడం వల్ల శరీరంలోని కేలరీల పరిమాణం తగ్గడమే కాకుండా శరీరం డిటాక్స్ చేయడానికి కూడా సహాయపడుతుంది.

కావాలనుకుంటే ఒక చిన్న కప్పు బ్లాక్ కాఫీ లేదా బ్లాక్ టీ తాగండి.

అలాగే మీకు ఆకలిగా అనిపిస్తే తక్కువ మొత్తంలో గింజలను తినండి. 
 

Latest Videos

click me!