గౌతమ్ గంభీర్ నుంచి విరాట్ కోహ్లీ వరకు.. ఈ క్రికెటర్లు తమ పిల్లలకు ఎంతటి స్పెషల్ పేర్లు పెట్టారో తెలుసా?

First Published | Jul 11, 2024, 12:29 PM IST

కొన్ని కొన్ని పేర్లు వింటే.. ఈ పేరెక్కడా వినలేదే.. అసలు ఈ పేరుకు అర్థం అంటూ ఉందా? అని డౌట్ వస్తుంటుంది. ఇక వాటి అర్థాలు కూడా మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇలాంటి ఫీలింగ్ క్రికెటర్ల పిల్లల పేర్లు విన్నప్పుడు కలుగుతుంది. గౌతమ్ గంభీర్ నుంచి విరాట్ కోహ్లీ వరకు కొంతమంది క్రికెటర్లు తమ పిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టారో తెలిస్తే షాక్ అవుతారు.. 
 


టీం ఇండియా కొత్త కోచ్ గా గౌతమ్ గంభీర్ నియమితుడైన విషయం అందరికీ తెలిసిందే. ఒక క్రికెటర్ గా ఈయన గురించి క్రికెట్ అభిమానులకు తెలిసిందే. కానీ ఈ క్రికెటర్ వ్యక్తిగత జీవితం మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఈయన పిల్లలలో సహా ఫ్యామిలీ విషయాలు జనాలకు చాలా తక్కువ తెలుసు. మీకు తెలుసా? గౌతమ్ గంభీర్ పిల్లల పేర్లు చాలా చాలా ప్రత్యేకమైనవి. ఒక్క గౌతమ్ గంభీర్ మాత్రమే కాదు.. చాలా మంది క్రికెటర్లు తమ పిల్లలకు చాలా డిఫరెంట్, స్పెషల్ పేర్లను పెట్టారు. ఈ పేర్ల అర్థం కూడా చాలా స్పెషలే. కాబట్టి ఈ రోజు ఏ క్రికెటర్ తన పిల్లలకు ఎలాంటి స్పెషల్ పేర్లు పెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


గౌతమ్ గంభీర్ పిల్లల పేర్లు..

గౌతమ్ గంభీర్ కు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వీరిద్దరికీ డిఫరెంట్ పేర్లను పెట్టారు గౌతమ్ గంభీర్. వారిలో ఒకరి పేరు అజిన్, మరొకరకి పేరు అనైజా. ఈ రెండు పేర్లు చాలా ప్రత్యేకమైనవి. రెండు పేర్లు అరబిక్ పదాల నుంచి ఉద్భవించాయి. ఆజిన్ అంటే అందమైనది అని అర్థం. అనైజా అంటే గౌరవనీయులు అని అర్థం వస్తుంది.
 


ఆశిష్ నెహ్రా పిల్లల పేర్లు..

క్రికెటర్ ఆశిష్ నెహ్రాకు ఒక కూతురు ఉంది. ఆమె పేరు కూడా చాలా స్పెషల్. ఈ క్రికెటర్ తన కూతురుకు అరియానా నెహ్రా అనే పేరు పెట్టారు. ఈ పేరుకు అర్థం చాలా పవిత్రమైనది అని.
 

విరాట్ కోహ్లీ పిల్లల పేర్లు

విరాట్ కోహ్లీ తమ పిల్లలకు డిఫరెంట్, ఎంతో ప్రత్యేకమైన పేర్లను పెట్టారు. ఈ పేర్ల అర్థాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు తమ కూతురుకు వామిక అని పేరు పెట్టారు. తమ కొడుకుకు అకాయ అనే పేరు పెట్టారు. వామిక అంటే దుర్గామాత అని అర్థం వస్తుంది. ఇక అకాయ అంటే శరీరం లేనివాడు, రూపం లేనివాడు.. శివుడి అని అర్థం వస్తుంది. 
 

హర్భజన్ సింగ్ పిల్లల పేర్లు

కొందరి క్రికెటర్ల లాగే హర్భజన్ సింగ్ కూడా తమ పిల్లలకు డిఫరెంట్ పేర్లను పెట్టాడు. ఈ క్రికెటర్ తన కూతురు పేరు హినయా హీర్ అని పెట్టాడు.  హినాయా హీర్ అంటే అందమైన దేవదూత అని అర్థం వస్తుంది.


శిఖర్ ధావన్ పిల్లల పేర్లు

శిఖర్ ధావన్ కు ఒక్కడే కొడుకు ఉన్నాడు. శిఖర్ ధావన్ తన కొడుకుకు జొరావర్ ధావన్ అనే పేరు పెట్టాడు. జొరావర్ అంటే అందరికంటే ధైర్యవంతుడు అని అర్థం.
 


మహేంద్ర సింగ్ ధోనీ పిల్లల పేర్లు

మహేంద్ర సింగ్ ధోనీ కూడా తమ పిల్లలకు ప్రత్యేకమైన పేర్లు పెట్టాడు. మహేంద్ర సింగ్ దోని తన కూతురికి జీవా అనే పేరు పెట్టాడు. జీవా అంటే తెలివైనవాడు, వెలుగు, ప్రకాశించేవాడు, భగవంతుని వెలుగు అని అర్థం.

Latest Videos

click me!