ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే ద్రవిడ భాష ఏదో తెలుసా?

First Published | Aug 29, 2024, 9:44 AM IST

నేడు తెలుగు భాష దినోత్సవం. ఈ సంద్భంగా.. తెలుగు భాష గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..
 

ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే ద్రవిడ భాష ఏదో మీకు తెలుసా? మన తెలుగు. మీకు నమ్మసక్యంగా అనిపించకపోయినా ఇదే నిజం. ఎక్కువ మంది మాట్లాడే భాష మన తెలుగు.  ద్రవిడ భాషల్లో తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మళయాళం, గోండి, తులు వంటి భాషలు ఉండగా.. వీటిలో ఎక్కువ మంది వాడుక భాష తెలుగు కావడం విశేషం. నేడు తెలుగు భాష దినోత్సవం. ఈ సంద్భంగా.. తెలుగు భాష గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..
 

తెలుగు భాషను  గతంలో తెలుంగు, తెనుగు, తెలింగ అనే పేర్లతో కూడా పిలిచేవారు. ప్రాచీన తమిళ సాహిత్యంలో.. తెలుగు ప్రజల భూమిని తెలుంగనాడు అని కూడా పిలిచేవారు. ఇటాలియన్ లాగానే తెలుగులో ప్రతి పదం అచ్చుతో ముగుస్తుంది. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే ద్రావిడ భాష తెలుగు. ప్రపంచవ్యాప్తంగా 220  మిలియన్ల మంది తెలుగు మాట్లాడేవారు ఉన్నారు.


తెలుగు మాండలికాలు బెరడ్, దాసరి, దొమ్మర, గొలరి, కమతి, కొమ్టావు, కొండారెడ్డి, శబర, సాలేవారి, వడగ, శ్రీకాకుళ, విశాఖపట్నం, తూర్పు గోదావరి, రాయలసీమ, నెల్లూరు, గుంటూరు, వడరి, యానాది, చివరగా తెలంగాణ పదాలతో ఉర్దూ యాసలతో అచ్చువేస్తారు.

ఇతర ప్రధాన భాషల మాదిరిగా కాకుండా తెలుగులో మూడు లింగాలు ఉన్నాయి: పురుష, స్త్రీ , నపుంసకుడు. ఊరు, పేట, పేడు, పట్నం, వాడ, గిరి, చెర్ల, సీమ, గూడెం, పల్లె, పాలెం , పల్లి అనేవి సాధారణ ప్రత్యయాలతో తెలుగు స్థల పేర్లు. కర్ణాటక సంగీతంలో కంపోజ్ చేయబడిన చాలా పాటలు తెలుగు భాషకు చెందినవే కావడం విశేషం. తెలుగు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విదేశీ భాషగా అవతరించింది.

Latest Videos

click me!