పెళ్లి ఓ మధురమైన, అద్బుతమైన ఘట్టం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలోకి అందమైన, గుణగణాలు మంచిగున్న వారే భాగస్వాములుగా రావాలని కోరుకుంటారు. అయితే పెళ్లి చేసుకునే ముందు అబ్బాయి వయసెంత, అమ్మాయి వయసెంతో ముందుగానే కనుకుంటారు.
కొంతమంది భాగస్వాముల మధ్య ఏజ్ గ్యాప్ తక్కువగా ఉంటే, మరికొంత మంది భాగస్వాముల మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. అది ఎంతలా అంటే.. రెండు మూడేండ్ల వయసు తేడాతో వివాహం చేసుకుంటే.. మరికొంతమంది భార్యా భర్తల మధ్యన ఏకంగా 2 నుంచి 7 ఏండ్ల గ్యాప్ ఉంటుంది. అబ్బాయి అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి 10 ఏండ్ల ఏజ్ గ్యాప్ ఉన్నా ఏమీ కాదనే వారు చాలా మందే ఉన్నారు. పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయి అబ్బాయి మధ్యన ఖచ్చితంగా ఎంత ఏజ్ గ్యాప్ ఉండాలనే విషయాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి..
1-4 ఏజ్ గ్యాప్: 21 ఏండ్లు దాటిన వారు పెళ్లి చేసుకోవచ్చని మన చట్టం చెబుతోంది. చాలా వరకు 21 ఏండ్లు దాటితే చాలు పెళ్లిల్లు చేసుకుంటున్నారు. ఈ వయస్సులో పెళ్లి చేసుకోవడం వల్ల ఎన్నో అనుకూలతలు, ప్రతికూలతలు కూడా ఉన్నాయి. 21 ఏండ్లున్న వారు మొండిగా ప్రవర్తిస్తుంటారు. దీనివల్ల భార్యా భర్తల మధ్య మనస్పర్థలు, సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే ఇద్దరి మధ్యన దూరం మరింత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విడాకులు తీసుకునే ఎక్కువ మందిలో ఈ ఏజ్ వాళ్లే ఎక్కువగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
5-7 ఏజ్ గ్యాప్: 5 నుంచి 7 ఏండ్ల ఏజ్ గ్యాప్ ఉన్న భార్యా భర్తల్లో అపార్థాలు, విభేదాలు, వాదనలు తక్కువగా వస్తుంటాయి. వీరి వైవాహిక జీవితంలో ఎన్ని గొడవలు జరిగినా.. చాలా తొందరగా వాళ్లు కలిసిపోతారు. ఎందుకంటే వీరిలో అర్థం చేసుకునేతత్వం బాగా ఉంటుంది. ముఖ్యంగా వీరు సహనంగా ఉంటారు.
పదేండ్ల తేడా: భార్యా భర్తల మధ్య 10 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉండే పెళ్లిళ్లు చాలా తక్కువగా జరుగుతుంటాయి. జీవిత లక్ష్యం చేరుకోవడానికి, అనుకున్న విజయాలను చేరుకోవడాని పదేండ్ల ఏజ్ గ్యాప్ పెద్ద సమస్య కాదు. ఈ ఏజ్ గ్యాప్ ఉన్న వారికి యువ భాగస్వామి ఉంటే వారు పరిపక్వత దశకు చేరుకోకపోవచ్చు. దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.
flirting
20 ఏండ్ల గ్యాప్: ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా వివాహాలు చేసుకుంటున్నారు కొందరు. మన సమాజంలో 20 ఏండ్ల గ్యాప్ ఉన్న జంటలు చాలానే ఉన్నాయి. కానీ ఇలాంటి జంటల ఆలోచనలు, లక్ష్యాలు వేరేగా ఉంటాయి. ఏ జంటకైనా.. పిల్లలంటే చాలా ఇష్టం. కానీ భార్యా భర్తల మధ్య 20 ఏండ్లకు పైగా ఏజ్ గ్యాప్ ఉంటే ఒకరు పిల్లలు కావాలనుకుంటే ఇంకొకరు వద్దనుకుంటారు.
వయసు వ్యత్యాసం అవసరమా?: వివాహం చేసుకోవడానికి ఇద్దరి మధ్య ఇంత ఏజ్ గ్యాప్ ఉండాలనేది జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. దీనికి సమాధానం దొరకడం కష్టమైన పనే. ఎందుకంటే ఇద్దరి అభిప్రాయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు కాబట్టి. వాళ్ల సమస్యలు కూడా ఒకే విధంగా ఉండవు. చిన్న వయస్సు జంటైనా.. పెద్దవయస్సు జంటలైనా.. వారి మధ్యన ఏజ్ గ్యాప్ పెద్ద సమస్య కాదు. వారి మధ్య అర్థం చేసుకునే గుణముండాలి. అప్పుడే వారి వైవాహిక జీవితం కలకాలం నిలుస్తుంది.